ఖమ్మం నుంచి ప్రతిఘటన కవిత్వం!

poetry is matter of life not just a matter of language…

ఒక్కదాన్నే…

అయినా భయపడను..తిరగబడతాను, కళ్ళెర్ర జేస్తాను ఖమ్మం నాది, వీధి వీధీ పోరాటాల గుమ్మం నాది.. అనాది సమాధి గొంతు పెకిలించుకొని మరి మరీ అరచి తీరతాను… అదిమిపట్టిన చాందస పాదంలో తుమ్మ ముల్లునై కసిగా దిగబడతాను.

దెయ్యం బహువచనమైనపుడు యావత్ స్త్రీదేశం ఏకవచనమైనపుడు..ఇదిగో..సహ ఆవేశాలను ఇలా సమీకరించుకుంటాను..ఇప్పుడు సరిగ్గా చూడు మేమంతా ఒక సమూహస్వరం.. మేమంతా రావణత్వాన్ని కూల్చే రాకెట్ల గుచ్చం…

అత్యంత హేయం అత్యాచారం అది నిన్నగా ముగిసిపోవాలి నేటితో చచ్చిపోవాలి రేప్ పదం రేపటి తరాల చెవిన పడకూడదు..

ఆశయం కోసం మేమంతా అయుధాలమే..అన్నీ అణ్వస్త్రాలు కాకున్నా..శక్తిమేరకు దేని బలప్రత్యేకత దానిదే…

హా…మేమిప్పుడు యుద్ధభూమిలో ఉన్నాం..ఉంటాం యుద్ధం ఉన్నంతకాలం మమ్మల్ని మేం ఎక్కుపెట్టుకొనే…

జంగల్ లో లేడిపిల్లను జనారణ్యంలో ఆడపిల్లను భయరహితంగా చూడటమే మా కవితాస్వప్నం.. నేరగాడి చావుకాదు మా ఆశయం నేరం చావాలి…

ఐయాం నాట్ ఎ షౌట్..ఐయాం ఏ స్లోగన్ కోరస్డ్ విత్…ఐ వస్ ఎ సింగ్యులర్ బట్ ఐ వుడ్ ఫ్లూరల్…ఐ నో ఐయాం ఎకో సౌండ్….

ఎవరికెవరం ఏమౌతామో తెలియదు

ఉన్నట్టుండి జీవితం సమూహమైపోతుంది..

కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్న ఒక యజ్ఞం ఇది

మనమంటూ లేకుంటే పదాలు మరణిస్తాయి

వాక్యాలు ఆత్మహత్యలు చేసుకుంటాయి

పద్యాలు, కవితలు ఇంకా పుస్తకాలు

ఏ పుట్టనో వేలాడి ప్రాణాలు విడుస్తాయ్..

ఎందుకనో అడగొద్దు

కొన్నంతే

దేహమొకటే కాదు ప్రాణం కూడా మాటాడింది

మా పుస్తకంలో కొన్నికవితలు

మానవ మృగాల్ని వేటాడుతూనో వెంటాడుతూనో

వేధనలను అనుభవిస్తున్న స్త్రీలకై ప్రేమగా కొన్ని వాక్యాలను అంకితమిచ్చాయి….

ఏ నిర్మానుష్యపు రోడ్డుపై అతివల మాన ప్రాణాలని ఫణంగా పెట్టె ఆ దయ్యపు మూకని నిరసిస్తూ రాసిన ఈ కవిత్వ పుస్తకం దయ్యం పోరగాళ్ళు

ఇదిప్పుడు సెన్సేషన్…

వణుకు పుట్టించే

ఒక అభాగ్యురాలి చివరి మాటలు

నిర్భయపు నీచుల రుపాంతరం. ..

కాగితాలపై మాటలు ఎవర్ని మారుస్తాయి అన్న మాటకు నా సమాధానం

వందేమాతర నినాదం ఒక్కమాటే..

ఒక్క అడుగుతోనే ఏదైనా మొదలు

ఇలాంటి మొదళ్ళు ఇంకెన్నో రావాలి

ఇహ

ఏ ఒక్కరో కాకుండా నలుగురం కలిసి ఒకే విషయాన్ని చెప్పడమే

చరిత్రలో ఒక సిరామరకను

అంటించడంలాంటిదని అనుకుంటాను..

అడవిలాంటి దేశంలో

చిన్నారి కుందేలు ఆడదంటే…

జాగ్రత్త చెప్పినా

ఏ మృగరాజుకో బలయ్యే ఆ చిన్న ప్రాణికి ఆడబతుక్కి పెద్దతేడా లేదిక్కడ

ఇంకా ఏం మిగులుంది

నువ్వు నడిచే దారెంట రక్తపాతాలు తప్ప…

నిద్రలోనే ఉన్నామని

మెలకువలోనే నిద్రించడం

అఘాయిత్యాలను కన్నార్పకుండా

రెప్పవిదల్చకుండా గుడ్డి దీపపు కాంతిలో ఇంకెంతకాలం …మసక చీకట్లని వదిలి

వెళుతురుకై నినదించాలి …

పగుళ్ల నేలపై

ఏ వానచినుకులనో పలవరిస్తూ చివికిపోయిన ఆశల్ని మొలిపించకు

తంగేడు పూలల్ల బతుకమ్మలా వెలిగిపోవాలి

తిరిగి చూసుకో ఒకసారి తరిగిపోతున్న మానవ హృదయాన్ని కాపాడేందుకు తలా ఒక చెయ్యెద్దాం…

చావువాసన లేని బ్రతుకుని పుననిర్మించుకుందాం కదలండి….

పుస్తకాన్ని అందరూ గెలిపించాలని

మానవత్వాన్ని చాటాలని చెబుతూ…

-సుభాషిణి తోట

తోట సుభాషిణి మంచి అమ్మాయి

ఈమె చేస్తున్న మంచి పనిని అభినందిస్తూ ఈ నాలుగు మాటలు ..

స్త్రీ ల మీద హింస రోజురోజుకు పెరుగుతుంది.

Growing violence on women is a global phenomena. మన దేశంలో కూడా స్త్రీల మీద అత్యాచారాలు ఎక్కువైపోయాయి.ఇలాంటి సందర్భంలో ప్రజల స్పందనను “కవిత్వ పుస్తకం” రూపంలో తీసుకురావడం హర్షించదగ్గ విషయం.

సుభాషిణి కి best wishes చెబుతూ, ముందు ముందు ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలని కోరుకుంటూ,

“”దయ్యం పోరగాళ్ళు””కవితా సంకలనాన్ని స్వాగతిస్తున్నాను.

౼మహెజబీన్

   కవయిత్రి

   మానవహక్కుల న్యాయవాది.

F.I. R is not a poem but..some poems are first infermation reports.. సం సంఘటనల తాలూకు సందర్భాల్ని నమోదు చేయటమూ కవిత్వ గుణమే….. poetry comes from the highest happiness, or deepest sorrow.. // A P J abdul kalam // …అమెజాన్ కార్చిచ్చు లాంటి ఈవాక్యాగ్రహ సంకలన సందర్భం కచ్చితంగా రెండో కోవలోదే….

కామా నే తప్ప పుల్ స్టాప్ లేని అమానుష వాక్యం అత్యాచారం… అమానవీయానికి ఒడిగట్టే మృగాళ్ళు ఎన్ కౌంటరవుతారు, ఉరి తీయబడతారు, జనం చేతిలో హతమవుతారు.. లేదూ వాళ్ళంత వాళ్ళుగా చస్తారు..కానీ అత్యాచారం మాత్రం ఇంకా చావని నేరం, బాధితులదెప్పటికీ ఒడవని దుఖం.. కొవ్వత్తుల కన్నీళ్ళు, చీకట్ల ర్యాలీలు, ఎంకౌంటర్ డిమాండ్ల వరకేనా మన ధర్మాగ్రహం.. భూస్థాపితం చేయాల్సింది అత్యాచార భూతాన్ని కదా… ఆ దిశగా.. కలాల కార్యాచరణ కోణంలో ఈ కవిత్వం పెల్లుబుకింది…poetry is the clear expression of mixed feelings.. yaa..it was Flower Bouquet of progressive feelings.

నిద్రపోతున్న అదును చూసి.. ప్రేమగానో, భక్తిగానో … రెండు అరచేతుల్లో ప్రేమగా దోసెడు నదిని తోడు తెచ్చుకుంటాం … కొంత దూరం నడిచాక చూస్తే…నది చేపపిల్లలా ఎగిరిపోతుంది.. కానీ తడిమాత్రం చల్లగా తాకుతుంది… ఆ..తడి స్పర్ష తీరే ఈ సంకలనంలోని కవిత్వం… నిలువవని తెలిసి నీళ్ళను దోసిట్లోకి తీసుకోరు కొందరు, ఈ తడి చాలనమైనా చాలునని..గుండె దోసిలిలో నీళ్ళ స్నేహం చేస్తారింకొందరు… ఇదిగో వీళ్ళంతా వాళ్ళే..వాళ్ళంతా వీళ్ళే.. చిక్కదనం కోసమో శిల్పం కోసమో వెతక్కండి ఈ సంకలనంలో.. poetry is matter of life not just a matter of language…

-శ్రీనివాస్ సూఫీ

పోస్టల్ చార్జెస్ తో కలిపి పుస్తకం విలువ 60రూపాయలు
పుస్తకం కావాలనుకున్నవాళ్ళు సుభాషిణి తోట మెసెంజర్ లో పింగ్ చేయొచ్చు

సుభాషిణి తోట

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు