థాంక్యూ…తాతా…

ప్రియమైన తల్లి తండ్రులారా..మీపిల్లలకి ఎప్పుడైనా ఒక్క కధనన్నా narrate చేశారా?

గులకరాళ్లు అనే కధ చెప్పాడు తాత ,మైదానంలో గొడ్లు కాయడానికి పోయినప్పుడు.పచ్చటి మైదానాలు,
బలుసుకాయలు, నల్లనల్లని రాళ్లు, సీతాఫలచెట్లు, కొమ్ముపొదలు,రేగిమొక్కలు ఈతచెట్లు,ఎత్తుగా పెరిగినగడ్డి,తెల్లతెల్లని పలుకురాళ్లు,పక్కనే చెరువు అత్యాద్భుతమైన geogrphical surroundings లో నామీద చెయ్యేసి కథల్ని ఎన్నింటినో narrate చేసేవోడు తాత.
తనేమీ పుస్తకాల్ని చదువుకోలేదు.బడికి పోలేదు.సరస్వతిదేవీ తనకి చుట్టమేమీ కాదు.చాలాసార్లు చాలాచోట్ల తన అనుభవాలనే కథలుగా మలిచి నాకు వినబెట్టేవోడు.
తాననుభవించిన కుల ఆర్ధిక దరిద్ర్య జీవన అనుభవసారాన్ని కధలుగా మలిచి నా బాల్యం మీద విడిచేవోడు.ఆ విడిచిన ప్రతిఊహా ప్రతిఅనుభవం ప్రతికధ ఆ కథల్లో పాత్రలు ఉద్దేశాలు నా బాల్యాన్ని చాలావరకు ఊహల దీపాలతో వెలిగించేవి.తన నోటికి అందిన ప్రతి విషయానికి జీవితాన్ని అద్ది కథల్ని ఒట్టి కబుర్లుగా సరదా మాటలుగా విసిరేవోడు .ఒక రోజు ఆవులు నీల్లుతాగి చెట్లకింద గడ్డిని నెమరవేస్తూ ఉండగా ఒక తునికి చెట్టు నీడన ఈ గులకరాళ్లు కథను ఎత్తుక్కున్నాడు.

కధ –1

సుబ్బయ్యకి ధనవంతుడు అవ్వాలనే ఆశ ఉండేది.కానీ ధనవంతుడు కావటానికి కష్టపడాల్చిన అవసరం లేదు.ఏదైనా పెద్ద మొత్తంలో సొమ్ము దొరికితే చాలు కష్టపడకుండా ధనవంతుడు అవ్వొచ్చు అనే విశ్వాసంతో కష్టించేవోడు కాదు సుబయ్య.దుర్గయ్య మాత్రం ఎల్లప్పుడూ ఎదో పని చేస్తూ డబ్బుని కొంత ఆదాచేస్తూనే ఉండేవోడు.ఏ పని దొరికితే ఆపని చేస్తూ ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారం చేస్తూ రూపాయికి మరో రూపాయి కూడబెడుతున్నాడు.ఎవరో ఊళ్ళో చెప్పారు సుబ్బయ్యకి, రాజ్యంలో రాజుగారు వజ్రాన్ని పోగొట్టుకున్నాడని , అప్పటినుండి సుబ్బయ్య ఎక్కడికి పోయినా వజ్రాన్ని వెతుకులాడే పనిలోనే ఉన్నాడు తప్ప కష్టించి పని చేయటం  లేదు.దుర్గయ్య మాత్రం అడవిలో ఉన్న గులకరాళ్లను పొగుచేసి ఎదో వ్యాపారం చేస్తూ కొంత అదనంగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టి తక్కువ కాలంలోనే ఏంతో డబ్బుని సంపాదించి ధనవంతుడు అయ్యాడు.ఏ పనీ చేయని సుబ్బయ్యకి తిండి కూడా దొరకక ఎంతో ఇబ్బంది పడ్డాడు.కష్ట పడకుండా ఏదీ రాదు..అన్నది నీతి.సత్యం కూడా.అని కధ ముగించాడు.ఇటువంటి కధ బాల్యంలో ఒకపిల్లాడి మనస్సులో ఎటువంటి సంచలనాలు సంవేదనలని రేకెత్తిస్తుందో just ఉహించండి.

కధ 2

బాగా ఆకలిగా ఉన్న సింహం ఒకటి ఆహారం కోసం వెతుకులాడుతున్న సమయంలో ఆ సింహానికొక గాడనిద్రలో ఉన్న జింక కనిపించింది.దాన్నితిని కడుపునింపుకోవాలని వెళ్తున్న సింహానికి అటువైపు నుండి వెళ్తున్న మరో జింక కనిపించింది.పడుకొని ఉన్న జింకని ఎప్పుడైనా తినొచ్చు ముందు అటువైపుగా వెళ్తున్న జింకని తిందామని దానిని వేటాడలనుకొని దాని వెంట పడింది.ఆకలితో ఉండటంవల్ల జింకని పట్టుకోలేకపోయింది.ఇది తప్పించుకుంటే తప్పించుకుంది.నిద్రిస్తున్న జింక ఉందికదా అని అక్కడికోచ్చి చూస్తే అది అక్కడనుండి ఏటో వెళ్ళిపోయింది.ఆశ ఆకల్నయినా తీరుస్తుంది.దురాశ నోటికి అందిన దానినికూడా దూరం చేస్తుంది
కాబట్టి దురాశకు పోకూడదు.దొరికిన దానితోని సంతోషమో సంతృప్తో పొందకుండా దక్కనిదానికోసం దూరాశపడటం భాదకి దుఃఖానికి కరనమౌతుంది..

కధ 3

బాగా డబ్బున్న ఒక జమీందారు.అతనికి ఒక పాలేరు.కష్టాన్ని సుఖాన్ని పంచుకుంటూ చాలా సరదాగా గడిపేవారు.కాలం గడుస్తున్న కొద్దీ,వాళ్ళిద్దరి మధ్య జమీందారు పాలేరు తేడా పోయింది.ఒకే మంచంలో పడుకోవడం వరకూ వొచ్చింది.జమీందారుకి కూడా తను జమీందారునని అతను పాలేరని ఏమాత్రం భేషజాలు లేవు.కలిసి తింటున్నారు.కలిసి పడుకుంటున్నారు.కాలగమనంలో జమీందారు పెళ్లి చేసుకుంటాడు.ఒచ్చిన జమీందారు భార్య జమీందారు హోదాని
పాలేరు స్థాయిని వేరు చేసి చూడటం మొదలు పెట్టింది.పాలేరుకి ఆవిషయం ససేమిరా నచ్చలేదు.ఇన్నాళ్లు ఇద్దరు సమానంగా ఉంటే మద్యలో ఇవిడేవారు మమ్మల్ని విడిగా చూడటానికి అని ఎంతో బాధపడుతూ..ఇంటినుండి వెళ్ళిపోతాడు.అది తెలుసుకున్న జమీందారు ఆది తట్టుకోలేక
పాలేరు కోసం వెతికాడు.ఎంత వెతికినా దొరకని పాలేరు ని పదే
పదే తలుచుకొని జమీందారు మంచాన పడ్డాడు.ఇకప్పుడు జమీందారి నయా భార్య ఎక్కడెక్కడికో తిరిగి పాలేరును పట్టుకొచ్చింది.జబ్బునపడ్డ జమీందారు మెల్లమెల్లగా కోలుకుని
భార్యతో సంతోషంగా గడిపాడు.స్నేహం గొప్పది.నిజమైన స్నేహం స్థాయిని ఆస్తిని హోదాల్ని అధిగమించి నిలబడుతుంది.

కధ 4

ఒక నక్క దారిగుండా నడిచి వెళుతుంది.దానికి బాగా కాయలు కాసిన ఒక ద్రాక్ష తీగ కనిపించింది.ఎలాగయినా ఈ తాజా ద్రాక్షాలని తినాలని సంకల్పించుకొని ద్రాక్షాలని అందుకునే ప్రయత్నం చేసింది.దురదృష్టవశాతు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒక్క ద్రాక్షాకుడా నక్కకి అందలేదు.మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.అప్పుడు విసుగుతో చీ..ఈ ద్రాక్షాలు రుచిగా ఉండవు అని ద్రాక్షలిని నిందించి అక్కడినుండి ఏటో వెళ్ళిపోయింది.ప్రయత్నం విఫలమైన ప్రతి వాడు నిందల్ని
మోపుతాడు.

ఇటువంటివి ఎన్నో కథల్ని నాకు తినబెట్టాడు తాత.ఎంత అదృష్టమో నాకు.ఇవ్వాళ పిల్లల్ని ఏదయినా కధచెప్పమంటే వింత ముఖాలు వేసుకొని చూస్తున్నారు.నెట్ యూట్యూబ్ ద్వారా ఏదయినా కధ విని సాంకేతిక కథా కధనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.దాని వల్ల నష్టం ఏమి లేదు.సహజమైన శాబ్దాల్ని ఉహాల్ని ప్రకృతిని కల్పించకుంటూ కథల్ని వినగలిగితే చెప్పగలిగితే ఎంతబాగుండు.కథలు చెప్పే తాతలు లేరు.చెపితే వినే పిల్లలులేరు.అందువల్లనే పిల్లలకు ఊహలు సెల్ల్ఫోన్లు అయ్యాయి.వస్తువులు వాళ్ళకి నేస్తాలు అయ్యాయి.మీకు ఏమి ఇష్టం అని అడగండి.పలానా ఫోను నాకిష్టమనో,పలానా వొస్తువు నాకిష్టమనో చెప్తారు తప్ప.మరో జవాబు ఉండదు.

ప్రియమైన తల్లి తండ్రులారా..మీపిల్లలకి ఎప్పుడైనా ఒక్క కధనన్నా narrate చేశారా?

చేయకపోతే ఇప్పుడే ఈక్షణమే కథని చెప్పటం ప్రారంభించండి.చెప్పడానికి ఏ కథలు లేకపోతే మీ కదనే పిల్లలకి చెప్పండి.కథల పుస్తకాల్ని పిల్లలకి కానుక ఇవ్వండి.జీవితం అంటే మరో అర్థంలో జ్ఞాపకాలు అని అర్థం చూసుకొని మీ జ్ఞాపకాలని మీపిల్లలకి ఇవ్వండి.సెల్ ఇచ్చాము
బైక్ ఇచ్చాము.బాటా షూ ఇచ్చాము.లాప్టాప్ ఇచ్చాము.కార్లు కానుకగా తెచ్చాము.ఇంతకంటే ఒక తండ్రి ఒకతల్లి ఏమివ్వాలి అని అనుకోకండి.అవన్నీ వొస్తువులు అని మరువకండి.

తాత థాంక్యూ..నాకు కథల్ని చెప్పి నా బాల్యానికి ఊహల జెండాలు కట్టి ఎగరవేసినందుకు…నాకు విశాల కల్పనల్ని లోతయిన ఉహాల్ని పునాదిగా వేసినందుకు…imaginative potansiality ని ,సృజనకు కావాల్సిన craft ని శ్రమపడి తెచ్చు కోకుండానే కానుక చేసినందుకు..

థాంక్యూ..తాతా…

పెద్దన్న

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • పిల్లలలో సృజనను తెలియజేయడం.. అలా ఉహలలోకంలొ విహరింపచేయడం, తాతామామ్మలదే భాద్యత….ఆ ఒరవడిని మరిచిపోకూడదని…గుర్తుచెసారు పెద్దన్న.. ఈ వొరవడి బహుదా శ్లాఘనీయం…పిల్లల నడత…నడక కూడా భవిష్యత్ లో బంగారుబాటకు మార్గదర్శకంకాగలదు అనుటలో నిస్సందేహం…

 • కథే జీవితం…..జీవితమే కథ కావాలి…thanks to writer

 • కవితా త్మక కథనం.ఆధునిక భారతంలో రైతు బాధామయ జీవితాలను . కళ్ళకు కట్టినట్టు రాసారు.అభినందనలు అండి

 • ఊహ గారి ఎర్ర చీర లో కోరికలను జీరా, వైవిద్యం కనిపించాయి. కథనం బాగుంది. ఆలోచనల ప్రస్థానం ఎన్నో కొనాల్ని స్పృశించి మనోభావాలని తట్టి లేపి చైతన్య పరిచింది. కథలో నిజం ప్రతి ధ్వనించింది. ఊహలోకం సుసంపన్నం అయినది. Sri కి, సారంగకి అభినందనలు.

 • అన్న…చిన్ని చిన్ని కథల్లో సముద్రమంత జీవితాన్ని చిత్రించారు…

 • చక్కని విలువలతో కూడిన కథలు. నా చిన్నతనం గుర్తుకు వచ్చింది. మా ఇంట్లో సోమయ్యతాత అని మా నాన్న దగ్గర పని చేసే వ్యక్తి ఉండేవారు. మా అమ్మానాన్న ఉరెళ్తే చాలు కథలు చెప్పమని ప్రాణం తీసేవాళ్ళం. చందమామ, అక్బర్ బీర్బల్ లాంటి పుస్తకాలు వదిలేవాళ్ళం కాదు. మాకు మా పిల్లలకి మా తాతగారు పొడుపు కథలు చెప్పడం చెప్తే తాయిలాలు ఇస్తా అనడం ఇప్పటికి తలుచుకుంటాం. ఈ కథలు చదివాక
  అవన్నీ గుర్తు వచ్చాయి. ధన్యవాదాలు🙏అభినందనలు..💐💐
  నేటి తరానికి చాలా ఉపయోగం ఇవి.

 • PUTTINAPPATINUNCHE MA MANAVARALI KI STORYS CHADIVI VINIPINCHEDAANNI>ALA PEDDA AYYAKA MY GRANDDAUGHTER KI CHADAVADAM ALAVAATU IENDI>
  GOOD HABBY EVERYONE.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు