చాగంటి తులసి పద సౌందర్య ప్రతీక “కూనలమ్మ పదాలు”

చాగంటి తులసి పద సౌందర్య ప్రతీక “కూనలమ్మ పదాలు”

లుకురాయి పలుకు
చిమ్మ చీకటి
మరొహరికి
ఇంపు సొంపులు
నోటి భాష

ఇలాంటి పద సౌందర్యం ఎవరిది? ఎక్కడిది?
నిస్సందేహముగా మాట్లాడే భాషలోనే సాహిత్యము రాసే తులసి గారిది. తులసి గారి కలానిది. కన్ను, చెవి విప్పార్చి గ్రహించినవి. ఇలాంటివి తులసి గారి రచనల్లో కోకొల్లలుగా మన కి కనిపిస్తాయి. అలాంటి కోవకు చెందినవే ఇటీవల తులసి గారు రాసినకూనలమ్మ పదాలు, మరికొన్ని కవితలు ఈ పుస్తకం రంగుల బొమ్మలతో అందముగా ముస్తాబై, తులసి గారి చిత్రమే ముఖచిత్రంగా ప్రముఖ చిత్రకారుడు అన్వర్ చే చిత్రింపబడి, 17/1/2023 మంగళవారం ఉదయం చా సో జయంతి సందర్భముగా తులసిగారింట్లో, హైదరాబాదు నుండి వచ్చిన పి. లలిత గారిచే ఆవిష్కరింపబడినది. లలిత, జయసూర్య, అన్వర్, సుమనస్పతి,  దుర్గాప్రసాద్  వేదిక నలంకరించారు
తులసి గారి అధ్యక్షతన సభ అసాంతం చక్కగా సాగినది.

ప్రముఖ వయోలిన్ విద్వాంసులు మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పూర్వ ప్రిన్సిపాల్  ద్వారం దుర్గాప్రసాద్ గారు సుమారుగా గంటన్నర సేపు ఈ పుస్తకానికి ఆప్త వాక్యం అందించారు. ముకుంద రామారావు గారు, V.A.K రంగారావు గారు ద్వారం దుర్గాప్రసాద్ గారు ముందుమాటలు రాశారు. కొందరు సాహిత్య అభిమానులు తులసి గారితో తమకు గల అనుభవాలను ఆహూతులతో పంచుకున్నారు. పాటలతో సభ ప్రారంభం అవడం ఆనాటి ప్రత్యేకత.

ముందుగా ద్వారం వారు సంగీత సాహిత్య ప్రవీణులు కనుక తమ ప్రసంగాన్ని సందర్భానుసారంగా సంగీత కృతులను మేళవించి ప్రసంగించారు.మాటకో కృతి, సంఘటన కోకృతిఅన్వయించి చెప్పడంలో అందవేసిన చెయ్యి ద్వారం వారిది.మన ముందు తరాల వారి పట్ల మనకి ఎంతో కొంత అనురాగం ఉంటుంది. ఆ అనురాగమే మన చేత గొప్ప పనులు చేయిస్తూ ఉంటుంది అంటూసరస్వతి రాగంలోని త్యాగరాజ కృతిని పాడి వివరించారు. అంతర్ జ్ఞానము నందు పట్టు సాధించిన వారికే జ్ఞానం అందుతుంది. అలాగే రచయితలకి సాహిత్య జ్ఞానం కావాలి దానికి నిరంతర అధ్యయనం అభ్యాసం అవసరం అని చెప్పారు.

లలిత గారు కాలజ్ఞానులుఅనే కవితను చక్కగా విశ్లేషించారు.

భూమ్మీద పడ్డ మరుక్షణం
మేలిమి కలిమి కానుక గదా జీవితం!
బట్ట కట్టిన బతుకు వెలుతురు తెలుపు
వృధా చేసే క్షణం చిమ్మ చీకటి నలుపు
క్షణం లక్షణం క్షణికం
క్షణ లక్షణాలను అర్థం చేసుకుంటూ
నచ్చిన పనులు చేసుకుంటూ పోవాలి
క్షయ అక్షయాలు అర్థమైతే
కాదా? కాలం అమరం
కామా? కాలజ్ఞానులం

అంటూ జీవితం  విలువని కాలం విలువని చక్కగా చెప్పారు.  అనేక కవితలను గురించి విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. ప్రముఖ చిత్రకారుడు అన్వర్ మాట్లాడుతూతాను విజయనగరం రావడం ఇదే మొదటిసారి,అలాగే తులసిగారిని చూడడం కూడా మొదటి సారేను అంటూశ్రీపాద వారి మాటలను గుర్తు చేశారు.

మనం ఏదైనా దానం చేసేటప్పుడు రేపు ఉండను చనిపోతాను అనే భావనతో వెంటనే చేయాలి విద్య నేర్చుకునేటప్పుడు నేను చిరంజీవిని అనుకుంటూ విద్య నేర్చుకోవాలి అలాంటి తత్వాన్ని తులసిగారిలో చూశాను అని క్లుప్తత లో గాఢతని తన మాటల ద్వారా చూపించారు. ఆదిలాబాద్ నుండి వచ్చిన సుమనస్పతి గారు ఈ పుస్తకాన్ని చక్కగా సమీక్షించారు. చిత్తం, కామా కాలజ్ఞానులం, రిలే రేసు కవితల గురించి సుమనస్పతి, జయ సూర్య, లలిత, శ్రోతలు విశేషంగా స్పందించి వివిధ కోణాలతో విశ్లేషించారు.

*

కొంకేపూడి అనూరాధ

అనురాధ కొంకేపూడి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు