కొండ బతుకుల గుండె ఘోష- పంపాతీరం

ల్గా గారు రాసిన పంపాతీరం చదివినంత సేపు ప్రఖ్యాత రచయిత్రి మహాశ్వేత దేవి గారు తలపులోకి వచ్చారు. మహాశ్వేత దేవి కి అరణ్యాలన్నా అందులో బతుకుతున్న గిరిజనులు, వాళ్ళను దోపిడిచేసే నాగరిక సమాజం అంటే ఉండే కోపం, తలపులోకి వస్తుంది.

రామాణయం లోని శబరి , తదితర పాత్రల సహాయం తో అప్పటి రోజుల్లో కూడా అరణ్యాలను అందులో వుండే సంపదనూ ఎలా దోచుకునేవారో ఓల్గా గారు చెప్పారు. కల్పనా కన్నాభిరన్ గారు వారి ముందుమాటలో చెప్పినట్టు “ఇది అరణ్యజీవి శబరి కధ. శబరి అరణ్యవాసుల బిడ్డ. అరణ్యాలను దురాక్రమించే రాజ్యానికి బానిసగా చిక్కి, అతి కష్టం మీద ఆ రాజ్యపు ఉక్కు పిడికిలి నుంచి తప్పించుకున్న మాతంగమునిని తిరిగి కలుసుకొని అడవి బిడ్డగా జీవితాంతాన్నీ చేరుకున్న శబరి కధ “ (ఇది చదువుతుంటే, బస్తర్, జార్ఖండ్ , ఒరిస్సా మిగతా రాష్ట్రాల్లో ఉన్న అరణ్యాలలో గిరిజనులను  ప్రస్తుత రాజ్యం పాలిస్తున్న వారు,  దేశ, విదేశాలలో  ఉన్న పెట్టుబడిదార్లకు, పారిశ్రామికవాదులకు, ఆ అరణ్యలలో ఉన్న ఖనిజ సంపదలను  దోచి పెట్టడం, దాన్ని ఎదుర్కొంటున్న గిరిజనుల మీద దాడి(యుద్దం) చేయడం గుర్తుకొస్తోంది!)

ఇదేమాట ఓల్గా అన్నారు. “ఈ కధ రాయడానికి నాకు ప్రేరణ అరణ్యవాసులను, ఆదివాసులను అరణ్యాలనుండి వెళ్లగొట్టడానికి రాజ్యం చేస్తున్న క్రూరమయిన దాడులూ, చట్టాలు, ఆక్రమణలే. రాజ్యం ఇప్పుడే కాదు తను పుట్టిన నాటి నుండి అదే పని చేస్తున్నది. ఆ రాజ్యాన్ని తిరస్కరిందలుచుకుని  ఈ నవల రాశాను.”

శబరి కాక మాతంగ ముని , అయోధ్యా వాసి సుతాపుడు, కబందుడు  శబరి తల్లీదండ్రులు, వషిష్టుడు, హనుమ, సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు, సీత ఈ నవలలోని పాత్రలు.

పంపారణ్యం లో శబరి ఉండగా, అయోధ్య నుంచి సుతాపుడు రాకతో మొదలు పెట్టి కథ  నడుపుతారు.

శబరి బాల్యం, తల్లి తండ్రులతో అడవిలో సుఖంగా ప్రశాంతంగా జీవిస్తునప్పుడు ఆయుధాలు ధరించిన దండు అడవిమీద పడడం అరణ్యవాసులను చంపడమూ, రాజ్యం సంపదకోసం  అడవిని ఆక్రమించుకోడం. ఆ ఆక్రమణ లోంచి అతికష్టంగా వారు తప్పించుకొగలుతారు.

అరణ్యం నాగారికులకి పరిశోధనా వస్తువయింది. భూమినుంచి పిండగలిగినవి తెలుసుకోవడమే వారి మానసిక  వికాసమయింది, మేధ అయింది. చంపడం, హింసించడం, హింసరుపాలను మరిన్ని కనుగొనడం నాగరికతకు లక్ష్యం, పరమార్ధం.

ఈ నవలలో మాతంగముని ద్వారా కులవిక్షేపణ ఓల్గా బాగా చూపిస్తారు. అంటరానివాడిగా పుట్టిన మాతంగముని జ్గానం కోసం ఒక బ్రాహ్మణ ముని సలహామీదా తపస్సు మొదలి పెట్టి, జ్గానం పొందక పోగా ఆ అగ్రకులస్త ముని చేత తన అంటరానితనం వల్ల అవమానం పొందుతాడు.

శబరి నడిపే “పంపాతీరం’ కధలో ముఖ్య అంశం ఏమిటంటే రాముడి వనవాసం లేక అరణ్యవాసం, కైకేయి వల్ల కాకుండా, వశిష్టుడు బలవంతం వల్లనని తెలుస్తుంది. అంతవరకూ అయోధ్యా రాజ్యం చెప్పు చేతలోకి  రాని అరణ్యాన్ని, రాముడు,లక్ష్మణుడు, రాజ్యంలోకి తీసుకు రావాలని. తండ్రి కోరిక మీద వనవాసం కి వెళ్ళిన వాళ్ళ దగ్గర ఆయుధాలెందుకుంటాయి!?.

శబరి, రాముడిని ప్రార్ధిస్తుంది. “నీవు యువకుడవు, సమర్ధుడివి అరణ్య సంచారం చేసి నాగరికతలోని విధ్వంశాన్ని విప్పి చెప్పి జనులను ప్రకృతితో సహజీవనానికి మళ్లించగలవని, ఆ పని నీకు చెప్పి ఒప్పించాలని నీ కోసం ఎదురుచూస్తున్నాను” ….. “మా చిన్ననాటి జీవితాలు మాకు కావాలి. మేము ఆ రోజుల్లో యుద్ధాల నెరుగం. ఆకలి, రుచి, దివ్యమయిన శారీరిక అనుభూతులు.. స్వేచ్చగా సరిహద్దులు వనసీమలలో సంచారం చేశాం . .. ఆ జీవితాన్ని మానుంచి నాగరీకులు బలవంతంగా  లాక్కున్నారు. మా నివాసల నుంచి మమ్మల్ని తరిమేశారు … ఎవరు వాళ్ళు? ఏమిటీ పెత్తనం”

రాముడు జవాబు గా “ అమ్మా! నువ్వు కాలాన్నివెనక్కు మళ్లించాలని చూస్తున్నావ్. నేను అయోధ్యా నగరవాసిని. నాగరిక ధర్మాలను ఆచరించడం పుట్టిన నాటినుండి నేర్చుకున్నవాడిని. నేను రాజ్య పరిత్యాగం చేసి రాలేదు. నా అరణ్యవాసం వెనక ఆర్య సామ్రాజ్య విస్తరణ కాంక్షే ఊనది,”

రాముడిని ఎన్ని విధాలా ప్రాధేయ పడాలో అన్నీ విధాలా ప్రయత్నించి, శబరి  “ రామా! నువ్వు జ్నానంతో నిండి పోయావు. నేను అజ్జ్ఞానంతో పండిపోయాను, రాజ్యం ఎవరినీ రక్షించలేదు. ఎవరికీ స్వేచ్చ్హ  నివ్వదు. …….. రాజ్యం ఎప్పుడూ భాధ్యతలేనితనన్నే , ఖాఠిన్యాన్నే పెంచి పోషిస్తుంది . రాజ్యాధికార కాంక్ష అందరినీ బలి తీసుకుంటుంది “

ఓల్గా గారు ఇంత గొప్పగా రాసిన ‘పంపాతీరం’ పుస్తకం  లో , ఇప్పటి మనరాజ్యం పరిస్థితి అందులోని రాజ్యాంగ దుర్మార్గం దౌర్జన్యం  కూడా అన్వయించుకోవచ్చు.

*

దేవరకొండ సుబ్రహ్మణ్యం

దేవరకొండ సుబ్రహ్మణ్యం – విశాఖపట్నం లోని సింధియా కోలని లో పుట్టి పెరిగి, 1960-66 ల మధ్య అక్కడున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం లో చదువుకొని, ఉద్యోగం కోసం ఢిల్లీ 1969 లో వెళ్ళి అక్కడే స్థిరపడిపోయి, ఢిల్లీకి ఆనుకొని ఉన్న గురుగ్రామ్ లో ఉంటున్నారు. తన మేనమావా ఆకెళ్ళకృష్ణమూర్తి గారి ద్వారా పరిచయమయి ఫ్యామిలి మిత్రులయిన రావి  శాస్త్రి  గారంటే అంతులేని గౌరవం. నాటకం ప్రాణంగా భావించే సుబ్రహ్మణ్యం తెలుగు సాహిత్యమంటే కూడా అంతే ఇష్టం చూపుతారు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • నువ్వు జ్ఞానంతో నిండిపోయావు…..నేను అజ్ఞానంతో పండిపోయాను.
  త్యజించడానికి, రాజ్యసంకీర్తనకు విరామం పలకడానికి మధ్య తేడా ఉండదా ఏమి?
  అడవిలో అడుగిడిన నాగరికత కాళ్లకు నిప్పు రవ్వలు ఉంటాయి. శబరి ప్రకృతి, ప్రకృతితో పెనవేసుకున్న జీవుల విధ్వంసాన్ని చూసింది.
  అన్ని రోజులూ ఒకేలా ఉండవు. నాగరికత అడవిని జయించాలనుకుంటే అడవి నాగరికతను నాశనం చేస్తుంది. వైపరీత్యాలు ఊరికే పుట్టవు.

  మంచి విశ్లేషణ, చక్కటి అన్వయం సుబ్బు సార్.

  • మంచి రివ్యూ సార్. పురాణాలను వివిధ దృష్టి కోణాల్లో చూడటం ఇప్పుడు దేశీయ సాహిత్యంలో ఎక్కువగా జరుగుతున్నది. పంపాతీరం మరో మేలిమి చేర్పు.

 • మంచి రివ్యూ సార్. పురాణాలను వివిధ దృష్టి కోణాల్లో చూడటం ఇప్పుడు దేశీయ సాహిత్యంలో ఎక్కువగా జరుగుతున్నది. పంపాతీరం మరో మేలిమి చేర్పు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు