కులం లేని లోకం కోసం…పెద్దన్న “మాలబ్రాహ్మణి”

కొత్త పుస్తకం కబుర్లు

ఇటీవలే వొచ్చిన పెద్దన్న మారాబత్తుల కధ మాలబ్రహ్మణి చదివాను.”ఒకప్పుడు మనుషులుండేవారు”అని కవిత్వమైన పెద్దన్న, ఆ తర్వాత “అనగనగా సీతారాం”అని, ఇప్పుడేమో “మాలబ్రహ్మణి”అనే ఆక్సిమోరాన్ని తెచ్చారు. పెద్దన్న ఏది రాసినా అదునికంగా ఉంటూనే సరికొత్త అనుభూతితో ఆలోచనలతో నిండుకొని తనదయిన శైలితో నిలబడుతుంది. మాలబ్రహ్మణి కథ  వెనక కలిగిన సామాజిక సృహని,ఇటువంటి కధల అవసరాన్ని,కులసమస్యని నిట్టనిలువునా ప్రశ్నించటాన్ని,సెక్స్ రాజకీయాల్ని,అగ్రవర్ణ పురుషుడి కుల రోగాన్ని,బట్టబయలు చేసిన కథారచయిత పెద్దన్నతో ముఖాముఖి.

ఈ కధ రాయడానికి మిమ్మల్ని కదిలించిన విషయం   మీరు అనుభవించింది ఏమైనా చెప్పగలరా?

జ.ఒకటేమిటి? ఎన్నో ప్రత్యక్ష పరోక్ష అనుభవాలు. బహుశా ఈదేశంలో కులమనే జబ్బు బారిన పడని దళితుడు ఉండడేమో.ఇంతటి ఆధునికత నాగరికత పెరిగినా కులపు జాడ్యం సమాజాన్ని ఇంకా వదల్లేదు. మావూళ్ళో sc మాదిగ ఐన బాగా చదివిన ఒక అబ్బాయిని రెడ్డి కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఆ అబ్బాయిని కాళ్ళు విరిచేదాకా పోయింది.ఎన్నో రక్తపాతాలకి కారణం అయ్యింది.పెళ్లి కి కులానికి జీవితానికి ఏంటి సంబంధం అనే ఆలోచన అప్పుటి నుండే మనస్సులో ఏర్పడ్డాయి.

మాలబ్రహ్మణి కథలోని ముఖ్యపాత్ర దీక్షితులు బతికి ఉంటే ఎటువంటి మార్పు జరిగి ఉండేది?

దీక్షితులు బతికి ఉన్నా కులసమస్యలో ఎటువంటి మార్పు సాధికారికంగా జరగదు.ఈ దేశపు పునాదులు కుల ప్రాతిపదికన నిర్మించబడటం అందుకు కారణం. దీక్షితులు కులాంతర ప్రేమవివాహానికి ఒక ప్రతినిధిగా నిలబడి ఉండేవాడు.తనపట్ల alination ఉండేది. కులాంతర వివాహానికి తనచుట్టు ఉన్న ప్రపంచానికి తనలా కులాంతర జీవితానికి దారులు తెరిచే తరానికి ఒక దారిదీపంలా ఉండేవాడు.

మాలబ్రాహ్మణి కధ రాయటం ద్వారా సమాజంలో ఏమి ఆశిస్తున్నారు?కోరుకుంటున్నారు?

కులంలేని సమాజాన్ని,వివాహాల్ని,బంధాల్ని,ఆశిస్తున్నాను.ఇది సాధ్యంకాదు. కానీ,మనిషి కేంద్రక ప్రపంచాన్ని కోరుకుంటున్నాను.

రూతు పాత్ర ద్వారా కులం కాటుకు బలయ్యే వాళ్ళకి ఎటువంటి సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారు?

రూతు కథలో కేవలం ఒకపాత్ర మాత్రమే.వాస్తవప్రపంచాన్ని అర్థంపట్టే పాత్ర.ఐతే కులాంతర వివాహం లో  ఉండే ఘర్షన్ని అర్థంచేసుకుంటే వివాహం తరువాత ఉండే జీవితాన్ని balanced జీవించవొచ్చు. అన్ని కులాలవాళ్ళు అర్థం చేసుకోవాల్చింది ఏంటంటే ఏ ఒక్కకులం వల్లనో సమాజం నడవనప్పుడు, ఏ ఒక్కకులమో గొప్పదో తక్కువదో ఎలా అవుతుందని?

మరిన్ని కోణాల్లో కులంపై మీ కవనాన్ని గొంతును  వినపిస్తారా?లేదా కులం అనేది మచ్చగా భావించి వదిలేస్తారా?

రావలసినంత సాహిత్యం,రాయాల్చినంత కులదిక్హార రచనలు అన్ని ప్రక్రియల్లో వొచ్చాయి.ఎన్ని వొచ్చినా కాలానుగుణంగా ఇంకా రాయాల్చింది ఎంతోఉంది. సాహిత్యం ద్వారానైనా కులం చూపులేని మనుషుల్ని సమాజాన్ని సృష్టించాలి.ఆ దిశగానే  కలాన్ని సరిదిద్దుకోవాలి.

*

Avatar

పేర్ల రాము

21 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • చాలా కృతజ్ఞతుడ్ని అఫ్సర్ సర్ మాలబ్రహ్మణి కధ ని మరోసారి కదిలించినందుకు….రాముకి థాంక్స్…

  • చాలా చాలా ధన్యవాదాలు అఫ్సర్ సర్💐💐💐 పెద్దన్న ధన్యవాదాలు💐💐😍.

 • పెద్దన్న గారి ఇంటర్వ్యూ చదివాక
  ఆయన రాసిన మాలబ్రాహ్మాణి
  కథ చదవాలనే కోరిక మొదలైంది.
  ఈ కథ చదివే అవకాశం
  కల్పించన్డి.
  .____డాక్టర్.కె.ఎల్వీ.ప్రసాద్
  హనంకొండ.

  • డాక్టర్.కె.ఎల్వి.ప్రసాద్ గారు…మీ కామెంట్కి కృతజ్ఞతుడ్ని…మీ అడ్రస్ ఇవ్వండి పుస్తకాన్ని పంపుతాను…

 • పెద్దన్నగారు అన్నట్లు కులమతాల సమస్య భారతదేశంలో నరనరాన జీర్ణించుకుపోయింది. ఓ పట్టాన తీరని సమస్యే… ఇక్కడ కాళ్ళకు చెప్పులు లేని మాసిన గుడ్డల నల్రవాడి పక్కన వైట్ కాలర్ జాబ్ ఆంగ్లేయుడు ఏ అభ్యంతరం లేకుండా కూర్చోవటం ముచ్చటించటం చూసినప్పుడల్లా నా దేశ ప్రజలమనసుల్లో నాటుకుపోయిన మత వైరమ్యాల వ్యవస్థకు కుమిలిపోతుంటాను….
  కథ లింక్ ఇచ్చివుంటే బావుండేది

  • సాహిత్యం వీటన్నింటిని బట్టబయలు చేసే స్థాయి నుండి..కుల నిర్ములన కార్యాచరణ రచించాల్చి ఉంది…మామ్.. tq..

 • ఇంత గొప్ప సాహిత్యాన్ని సమాజానికి అందించిన పెద్దన్నకు ధన్యవాదాలు… పేర్ల రాము గారి,పెద్దన్న విశ్లేషణ చాలా బాగుంది… విశ్లేషణ చదివిన తర్వాత పుస్తకం తప్పకుండా చదువాలనిపిస్తుంది..ఇలాంటి గొప్ప సాహిత్యం ఇంకా రాసి సమాజాన్ని చైతన్య పరచాలని మనస్ఫూర్తిగా కోరుకునున్నాను…

 • పెద్దన్న రాసిన మాలబ్రహ్మణి కథపై నేను చేసిన ఈ చిన్న ముఖాముఖి ని సారంగలో చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కథ రాసిన పెద్దన్నకు ఈ ముఖాముఖి ని పత్రికలో ప్రచురించిన అఫ్సర్ సర్ కి మరియు సారంగ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు.

  _పెద్దన్న రాసిన కథపై కథ గురించి చిన్న అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను.

  మనిషిని మనిషిగా చూడలేని మనుషుల మధ్య రాయబడిన కథ. ఎన్నో ఎన్నోన్నో
  చీకటిదృశ్యాలకి అక్షరాలతో వెలుగునిచ్చే కథ.
  నువ్వు నేను చూస్తున్న కథనే కానీ నీకు నాకు కనపడి కనపడనట్లు ,తాకి తాకనట్లు తగిలే వాస్తవాలతో నిండిన ఆధునిక మాలబ్రహ్మణి కథ.
  నిజానికి ఈ కథకి ఊపిరి నడిపించే రచన విధానం .పాత్రని కథకి అనుకూలంగా సృష్టించుకోవడం. కావాల్సినన్ని మాటలను పాత్రలకు అనుకూలంగా కథలో చెప్పడం.కావాల్సినన్ని వర్ణనలు, పోలికలు ఓ కవి,రచయితగా వ్రాయడం. ఒక ఉన్నతవంతమైన కులానికి చెందిన వ్యక్తి దీక్షితులు పాత్రతో మొదలైన ఈ కథ చదువుతూ ఉంటే మన ముందే జరుగుతున్నట్టుగా ఉంటుంది. మాల కులంలో పుట్టిన బాయమ్మ పుట్టగానే అమ్మ చనిపోతుంది. తల్లి లేని బాయమ్మను తండ్రి ఏసుపాదం పనిచేసుకుంటూ బిడ్డని సాదుతూ ఉంటాడు. బాయ్యమ్మ కూడా పెరుగుతున్న కొద్దీ కూలీ నాలికి పోతూ దండ్రికి అండగా నిలబడుతుంది. కథలో పరిస్థిలను కళ్ళముందే కదిలేలా రాయడం రచయిత ఎంచుకున్న మార్గం మరింతగా ముందుకు నడిపిస్తుంది అని చెప్పుకోవచ్చు.
  ఈ క్రమంలో కథలో బాయమ్మకు బుజ్జమ్మ ,మరియమ్మ పాత్రలు పరిచయం అవుతాయి.బాయ్యమ్మ అమ్మకు స్నేహితురాలు మరియమ్మ . మరియమ్మ బాయమ్మకు కష్టమొచ్చినప్పుడల్లా దైర్యంగా నిలబడుతుంది మంచి చెడ్డలన్ని చెపుతుంది. దీక్షితులు మనసును మార్చే ప్రయత్నం చేసేవాడు రంగయ్యబాబు కులం ఎక్కడ నాశనం అవుతోందో. ఎక్కడ మైలబడుతుందో అని దీక్షితులుకు బాయమ్మ మీద ఉన్న ప్రేమని చేరిపేయాలను చూసే వ్యక్తి. పెళ్ళి కాకముందే దీక్షితులకి బాయ్యమ్మకు పుట్టింది బ్రాహ్మణి.
  ఇలా కథని పాత్రలను మీకు పరిచయం చెయ్యడం కన్న చదువుతే ఒక లోతైన అనుభూతిని, దీర్ఘమైనఆలోచనలను , కొంత తీరని భాదను అనుభవిస్తారు.
  పెద్దన్న కథను రాయడానికి తీసుకున్న వస్తువు పాతది కావొచ్చు కానీ కథను కదిలించే తీరు సరికొత్తగా ఉంటుంది.ఏళ్ళకి ఏళ్ళుగా బతుకుతున్న చీకటి బతుకులను చూపించే ఈ కథలో దీక్షితులు ఎలా చనిపోయారో?? ఎందుకు చనిపోయారో పాఠకుడే గ్రహించాల్సి ఉంటుంది. రూతు చిన్న దొరల కథను మరియమ్మ ద్వారా చెప్పడానికి కారణం ఈ రోజుల్లో చనిపోతున్న అనేక కులాంతర వివాహాలు చేసుకొనే వాళ్ళను పరిచయం చెయ్యడం కోసం కావొచ్చు. ఎన్నో కులానికి సంబంధించిన రచనలు వొచ్చినప్పటికి ఈ కథ కి కావాల్సిన ప్రత్యేకత దానికదే ఉన్నది అని చదివిన ప్రతీ వాళ్ళు అనుకోవచ్చు. కథలో కొన్ని చోట్ల అనుభూతిని కదలికను ఇచ్చినప్పటికి మరికొన్ని చోట్లా భాదను కొన్ని చోట్లా కోపాన్ని కూడా తెస్తుంది. ప్రతీ మనిషి చుట్టూ అనేక కథలుంటాయి వాటిని అక్షరాల్లోకి ఒంపుకుంటే ఇలాంటి కథలే పుడతాయి. చిన్నప్పుడు తాత చెప్పిన కథలను విని అలవోకగా సృజనాత్మకంగా కథలు రాయడం నేర్చుకున్న పెద్దన్న మొదటగా తీసికొచ్చిన కథ పుస్తకం ఇది. కథను ముందుకు నడిపించే క్రమంలో సన్నివేశాల్ని పాత్రలను బలంగానే ఉన్నప్పటికీ కొన్ని కొన్ని చోట్లా మరింతగా ట్విస్టులు లేకపోవడం కథలో గమనించవొచ్చు. ఇలా అనేక కోణాల్లో ఆలోచనలను కలిగించే ఈ కథను ఈ తరం తప్పకుండా చదివి ఆకళింపుచేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. మరెన్నో కథలతో పెద్దన్న ముందుకు నడవాలని ఆశిస్తూ… మాల్లోక్క సారి అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న.💐💐

 • మన భారత దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో వివిధ రూపాల్లో ఒక మనిషి ఇంకో మనిషిని ద్వేషించడం, ఒక తెగ వారు ఇంకో తెగని, ఒక ప్రాంత వారు ఇంకో వారిని, ఒక జాతి వారు ఇంకో జాతిని, అలాగే మన దేశంలో కూడా ఒక కులం వారు ఇంకో కులాన్ని, కానీ ఇంకొంచెం మనిషి తత్వంలోకి తొంగి చూస్తే ఒకరి అవసరం ఇంకొకరికి ఉన్నప్పుడు, ఇటువంటి అడ్డుగోడలు ఉండవు, ఇటు వంటి అడ్డుగోడలు కూలిపోవాలి అంటే ఆర్ధిక పరమైన సంబంధాలే వాటిని పడగొట్టగలవ్. ప్రతి ఒక్కరు ఇంకొకరు మనకు ఏ విధంగా ఉపయోగపడగలరో లేదా వారితో మనం ఎంత సంతోషంగా ఉన్నామో అని ఆలోచించి కొన్ని కొన్ని విషయాల్లో సర్దుకొని పోతారు,మాల బ్రాహ్మణి కథలో చెప్పినట్టు పెళ్లి లాంటి విషయాలు వచ్చినప్పుడు మాత్రం ఎంత సాన్నిహిత్యం ఉన్న కానీ కులం అనే అడ్డుగోడ వాళ్ళ మధ్యలో వాలిపోతుంది. ఆర్ధిక పరంగా ఉన్నతంగా ఉన్న వాళ్ళ విషయాల్లో మాత్రం డబ్బు అనే ఆయుధం ముందు గొడలేంటి హిమాలయాలైన కూలుపోతాయి. అన్ని సందర్భాల్లో కచ్చితంగా 90% ఆర్ధిక పరంగా ఉన్నతంగా ఉన్న వాళ్లలో కులానికి సంబంధించి పెళ్లి విషయాల్లో ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని నా అభిప్రాయం, ఇంకా కథ విషయానికి వస్తే పెద్దన్నయ్య ఈ కథ ద్వారా అందరూ కులం అనే పదం లేని సమాజాన్ని ఆశిస్తున్నారు, కానీ అది మానసికంగా రావాల్సిన మార్పు, అటు వంటి మార్పు మన సమాజంలో ఇప్పట్లో రాదేమో, కానీ ఆర్ధిక పరంగా ఉన్నతంగా ఉన్న వాళ్లలో మాత్రం కులనికి సంబందించిన విషయాలలో అభ్యంతరం ఉండదు.
  కథలోని రంగయ్య బాబు పాత్ర కులానికి knight లా భావించి దీక్షితులు మాల బాయమ్మకి మధ్య ఉన్న సంబంధాన్ని వ్యతిరేకిస్తాడు.ఒకవేళ మాల బాయమ్మకి 1000 కోట్ల ఆస్తి ఉంటే ?. రంగయ్య బాబే దగ్గర ఉండి మరి పెళ్లి చేసే ఉండేవాడేమో అని నా అభిప్రాయం.

  • మానవ సంభాదాలన్ని ఆర్ధిక సంబంధాలే అన్నారు మర్క్స్..ఈ సూత్రీకరణ మనుషులు ఎక్కడున్నా వాళ్ళు ఉన్నంతవరకూ వర్తిస్తుంది..కులగొడలు కూలాలన్నా,కులం రూపం మారిపోవాలన్నా,అది అంతరించాలన్నా
   ఆర్థిక స్థితిగతులలో మార్పులు రావాలి..తమ్ముడు అదే నువ్వూ చెప్పావు…tq..

  • మానవ సంబందాలన్ని ఆర్థికి సంబంధాలే అన్నారు మర్క్స్.నిజమే మనుషులు ఉన్నంతవరకు వాళ్ళు ఎక్కడున్నా ఈ సూత్రం వర్తిస్తుంది.కులమను రక్కసి అంతరింపుకు ఆర్థిక సమానత్వం సరైన మందు.అదే నువ్వూ చెప్పావు…tq.. తమ్ముడు

 • మాలబ్రాహ్మణి పుస్తకం గురించి తమ్ముడు రాము చెప్పినప్పుడే పుస్తకం చదవాలనే ఆశక్తి కలిగింది .ఇంటర్వ్యూ చదివాక ఆ ఆశక్తి మరింత పెరిగింది .నైస్ ఇంటర్వ్యూ .

 • మాలబ్రాహ్మణి పుస్తకం గురించి తమ్ముడు రాము చెప్పినప్పుడే చదవాలనే ఆశక్తి కలిగింది.ఇంటర్వ్యూ చూసాక ఆ ఆశక్తి మరింత పెరిగింది .నైస్ ఇంటర్వ్యూ .ఇరువురికి అభినందనలు .

 • మానవ సంభాదాలన్ని ఆర్ధిక సంబంధాలే అన్నారు మర్క్స్..ఈ సూత్రీకరణ మనుషులు ఎక్కడున్నా వాళ్ళు ఉన్నంతవరకూ వర్తిస్తుంది..కులగొడలు కూలాలన్నా,కులం రూపం మారిపోవాలన్నా,అది అంతరించాలన్నా
  ఆర్థిక స్థితిగతులలో మార్పులు రావాలి..తమ్ముడు అదే నువ్వూ చెప్పావు…tq..

 • ఈ దేశం ఎప్పటీకి కులం లేని దేశం కాబోదు . కులం
  ఒక ఊసరవెల్లి

  – పగిడిపల్లి వెంకటేశ్వర్లు

 • కుల రహిత సమాజం కొరకు ఇప్పటి వరకు చాలా కథలు వచ్చాయి ఐనా ఇప్పటికి అగ్ర కులాల దాడులు జరుగుతూనే వున్నాయి అంటే సమాజ మార్పుకొరకు సాహిత్యపరమైన Dosage సరిపోలేదన్న మాట కాబట్టి ఇంకా మరింత అగ్రకులాల దాడులపైన ధిక్కార సాహిత్యం రావలసిన అవసరం ఎంతైనా వుంది. పెద్దన్న గారు ఇంకా మంచి కథలు రాయాలని కోరుకుంటున్నాను.

  • ఈ Interview బాగుంది పేర్ల రాము గారికి అభినందనలు

   • ధన్యవాదాలు సర్💐💐💐 సంతోషం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు