కవిత్వం

 బ్రహ్మకమలాల వాన 

ఎన్ని కల్పాలు చిలుక్కుని చిలుక్కుని ఎవరెగరేసుకున్నారో – ఆకాశానికి ఉట్టి కట్టుకున్న రాత్రి చల్లకుండలో వెన్నముద్దలా తేలుతోంది చలువచందనాల పంజరంలో నేలనేలనంతా బందీ చేసుకుపోతోంది   మునిమాపు వంకల్లో పూబంతులాడుకుంటున్న వేళ...

అమావాస్య సుందరి!

ఆమె చీకట్లో శరీరాన్ని వ్రేలాడదీస్తుంది వేళ్ళతోనూ కాళ్ళతోనూ కుళ్ళబొడుస్తుంది బస్కీలు తీస్తుంది- నన్నూ తీయిస్తుంది ఆమెది ప్రళయ భీకర మహదానందం అంతా క్షణికం అయినా భయంకరం-   బీభత్స రసాస్వాదనలో ఆమె ఒక వెర్రినవ్వు...

నిష్క్రమించిన రాత్రి

ముడుచుకున్న గొంగళిపురుగులా చలిని ధిక్కరిస్తుంది కురుస్తున్న మంచువానలో మల్లెతీగ వణుకుతూ పాకుతోంది అదేపనిగా కదుపుతున్న నిద్ర కనుపాపలపై కమనీయ ద్రుశ్య కావ్యమయింది కల కలవరిస్తూ కట్లపాములా వొంకర్లు తిరుగుతోంది పగలు రాత్రి...

దేశ ద్రోహితో… స్నేహం

రంజాన్ నాడు వాడు దారాలు దారాలుగా ప్రేమ పాయసం అయ్యేవాడు. బక్రీద్ దినాన దం బిర్యానీ రుచి చూపేవాడు. నెత్తిన పెట్రొ మాక్స్ లైట్లు మోస్తూ, కందిల్  తీసుకొచ్చే గుర్రం కళ్ళకు దారి చూపుతూ ట్యూబ్ లైటై రాత్రంతా సోంద్ షాహెద్ దర్గా...

రిగ్రెట్

1 నువ్వూ అదే అన్నాక ఏదో లోపలిప్పుడు ఓ పేరు తెలియని భయం  మొదలౌతుంది.. ఎక్కడికైనా, ఎవరూ నన్ను గమనించని చోటుకు  దూరంగా వెళ్లిపోవాలి అనిపిస్తుంది. ఎంతకీ కావాల్సినంతగా నాకు నేను దొరకడం లేదని మెల్లగా అర్థమౌతోంది బయటకి...

ఆ గది

లా వ్యవధి తర్వాత ఈ గది తలుపులు తీస్తుండగానే వెచ్చటి కిరణాలు లోపల నిండుకున్నాయి   చెమ్మగిల్లిన కళ్ళతో పసిదాన్ని ముద్దాడినట్లు తడుముతూ ఏదో నింపుకుంటున్న అనుభూతి   ప్రేమగా కొట్టుకున్న మేకుల వలన తడి అంటని...

రివిజన్ ప్రేమ

  వాళ్లిధ్దరూ ఉన్నట్లుండి ఎదురు పడ్డట్టపుడు ఆమె అనుకుంది ఇదేదో ఏప్రిల్ ప్రేమ రివిజన్ లా ఉందీ అని. ఆమెకు తెలుసు తన తప్పు సముద్రమేమీ గుటకలు మింగదనీ తెలుసు   అపుడు బీచ్ లో ఇద్దరూ ఉన్నపుడు సముద్రమంత తడీ  అతని తన...

ఎన్ని న్యూరెంబర్గ్ లు కావాలి!

మనిషిని బానిస చేసి కొరడా చేపట్టిన యాజమాన్యాలు రాజ్యం తమ భోజ్యానికేననుకున్న భోగలాలసలు అనుబంధాలన్నిటినీ సరుకులుగా మార్చిన దురాశలు దేశదేశాలను కబళించిన సామ్రాజ్య కాంక్షలు కుల, వంశ రక్త పవిత్రతా ఆభిజాత్యాలు నేల అడుగున దాగిన...

ఆ ఆకాశం నీ ఉనికి  కదూ!!

ఉన్మత్త కెరటమొకటి ఒడ్డు మీంచి నన్ను సముద్రంలోకి లాక్కెళ్ళింది, ఊపిరాడలేదు, ముంచి, తేల్చి నలిపి, ప్రాణాల్ని కుదిపి ఒక్క విసురుతో ఒడ్డున పడేసింది నీరు నీ  జ్ఞాపకమా !!   తేరుకున్నానో లేదో సుడిగాలి చుట్టుముట్టి...

సాయంత్రం పువ్వు

రాకపోకల అనుభూతిలా సుతిమెత్తని అరుణిమ లోకపు కోపాన్నంతా జారవిడిచి తేటగయ్యింది. కొరికేస్తే మిగిలిపోయిన ఓ చందమామ మిగుల్చుకున్న నిశ్శబ్దాన్ని పంచిపెడుతుంది. అమాయక పసి ఆకాశాన్ని పక్షి రెక్కలతో నిమురుతోంది. నవ్వులన్నీ...