మావఁ జెప్పింది ఇన్నాక ఎలవరపొయ్యి తలెత్తి ఆయిన మొకంలోకి సూసినాను. పసిబిడ్డ నవ్వు నవ్వినాడు మావఁ. నా ఈపున సెయ్యేసి మాలివిఁగా నివఁరతా, నామాటిని పో నాయినా, ప్యాప్తం ల్యేనోట్ని తలుసుకుంటా ఎంతకాలం యల్లీదినా యాం లాబం సెప్పో ...
కధలు
నీళ్లు…నీళ్లు..
నీళ్లు…నీళ్లు…ఊరు మొత్తాన్ని మహా సముద్రం ఏదో కావలించుకుందా అన్నట్టుగా ఉన్నాయి ఆ నీళ్లు. రెండేళ్ల తర్వాత…..హైదరాబాద్ నుంచి తన సొంత ఊరికి బస్సులో వస్తున్న సోమయ్యకు …. పొలి మేర లోకి రాగానే….నేల మీద అద్దం...
రెక్కలు మొలవక ముందు మా కథ
చీకటంటే నాకు భయం. చీకటి రాత్రంటే ఒళ్ళంతా పాములు పాకుతున్న కంపరం. సాయంకాలం సంధ్య వాలిపోయి, ఆకాశం చీకటి పరదా చుట్టుకున్నప్పుడు నా మనసు కూడా దిగులుతో కూడిన భయంతో లుంగలు చుట్టుకుపోతుంది. అంబరాన చుక్కలు మిలమిలమన్నా, వెన్నెల...
అదండీ మేస్టారూ…!!!
“మా ఊరి పెసిరెంటు సారూ… మాగొప్ప మనిసి సారూ!!” “నిజమా!!” “అయిబాబోయ్ తఁవరికి తెల్దేటండీ! ఈ సుట్టుపక్కల పొలాలూ, తోటలూ; గరువులూ, దొడ్లూ, ఊర్లో రైసు మిల్లూ, టౌన్లో సినేమాహాలూ… అన్నీ ఆరియ్యే కదండీ” అవునా...
దేశం బోయిండ్రు
ఉత్తర తెలంగాణలో ఓ ఊరు. జిల్లా కేంద్రానికి కొన్ని కిలోమీటర్లే. కొలిస్తే ఎనిమిది! మనుషుల అస్థిపంజరాలు ఒక్క తీరుగా ఉన్నట్టే, ఆ ఊరి రూపురేఖలు అన్ని ఊర్లతీర్గనే! గుడి-బడి, మసీదు-బస్టాండు, చర్చీ-సర్పంచి కుర్చీ, పొలాలు...
మేం… కంటుగాదు
ఒక్కపూట నాఖా పెట్టి పట్నంలోని ఆకొన గచ్చిబౌలి నుంచి ఈ కొస ఎల్బీనగర్ కొచ్చేసరికి గీయాల్ల అయ్యింది. టైమ్ పావుతక్కువ నాలుగైంది. మూడున్నరకు వచ్చే లక్ష్మాపుర-హైదరాబాద్ వయా సిరిపురం బస్సు ఇంకా రాలేనట్టుంది. మా ఊరోల్లు...
కోడి బువ్వ
శేఖరయ్య… ఓ శేఖరయ్యా.. ఆ.. అంటూ పరధ్యానంగా బదులిచ్చాడు బ్నిమ్ సైకిల్ మార్ట్ ఓనర్ శేఖర్. “ఈరోజు సొగం దినం సెలవు కావాలయ్య, మా సీను గాడి పుట్టినరోజు ఇయ్యాల.. మా ఇంటిది రాత్రికి కూరాకు వండుతా కోడి తీసుకరమ్మంది.. “...
చిన్నమ్మ
చిన్నమ్మ పనికి రాక అవాల్టికి నాలుగు రోజులు. ఫోను చేస్తే ఎత్తలేదు. ఇల్లెక్కడో సరిగ్గా తెలీదు. పని చేసుకోలేక విసుగ్గా వుంది లావణ్యకి. చివరికి వచ్చింది. జ్వరంవచ్చి, లంఖణాలు చేసిన దానిలా, మొఖం అంతా పీక్కుపోయి. ఏదో గట్టిగా ...
ఫారిన్ రిటర్నడ్
“ఏమి కుచేలక్కా, నీ కొడుకు బాగున్నాడా?” అని అడిగింది సావిత్రక్క. “బాలేక ఏమి సావిత్రీ … టెంకాయ చెట్టు మాదిరి పొడుగ్గా పెరిగినాడు. ‘నీళ్ళు’ పోయలేక చస్తా ఉండా!” అని ముక్కు చీదింది కుచేలక్క. “అంత నిష్టూరం ఎందుకక్కా...
సుహాసిని నవ్వు
ఫంక్షన్ హాలులో విజ్జుగాడిని వెతుకుతున్నాను. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళినవాడు ఎంతకీ రాలేదు. వాడి కోసం అటూ ఇటూ పరికించి చూస్తూ తిరుగుతున్నాను. ఇంతలో నవ్వొకటి లీలగా గాలిలో తేలుతూ నన్ను మృదువుగా తాకింది. అదే నవ్వు...
రక్తమోడిన పాదాలు
రాజయ్య మనసు చిత్తడి చిత్తడిగా ఉంది. ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. మనసు స్థిరంగా ఓ చోట నిలవడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ప్రారంభమై చాలా రోజులే అవుతున్నది. తెలంగాణ వస్తుందా, చస్తుందా అనేవాళ్లు కనిపిస్తూనే...
ఆమె నిర్ణయాలు
కారైకల్ బీచిలో, సాయం సంధ్యా సమయంలో స్నేహితురాలుతో కలిసి తీరికగా నడుస్తున్నహేమ చటుక్కున ఆగి, యిలా అంది. ” చూడు సౌజన్యా, అలలు ఉవ్వెత్తున ఎగసి పడి తీరాన్ని చేరి మెల్లగా వెనక్కి జారుకుంటాయి. మన సమస్యలు కూడా అంతే...
నాయినమ్మతో సినిమా
ఎండాకాలం సెలవులకు పిల్లలు ఇంటికి వచ్చారు . అయితే టీవీలో పోగో, బాలభారత్, పిల్లల కార్టూన్లూ లేకుంటే సెల్లులో ముచ్చట్లు పొద్దు పొద్దు అంతా చూస్తున్నారు. నాకు ముగ్గురు మనవరాళ్ళు ఒక మనుమడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్...
కృత్రిమ బింబం
“ప్రతిరోజూ నువ్వు నిద్రలేచింది మొదలు, రోజు గడిచేలోగా నీకళ్ళముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో నువ్వు స్పందించి, గుర్తించుకునేలా చేసేవి కొన్నైనా ఉంటాయి. అవి కలిగించే అనుభూతుల కారణంగా, నీ మనసు ఆనందంతో పులకించనూ...
మీనూ సెల్వా
“సెల్వా, ఇక్కడ ఎంత హాయిగా వుందో చూశావ్ , పచ్చగా, రంగురంగుల పూల మొక్కలూ, వాటితో పోటీ పడే సీతాకోక చిలుకలు, పైన దూది మబ్బులు నిండిన నీలి ఆకాశం, నిర్మలమైన గాలీ” ” ఔను మీనూ, ఇక్కడ మనకి అడ్డు చెప్పే...
పరిష్కారం
అక్కడ చూపులు పారే అంత మేరా పచ్చని పొలాలు. వాటి మీద వాలుతూ కొన్ని, ఎగిరి పోతూ కొన్ని, చక్కర్లు కొడుతూ కొన్ని పక్షులు వింత శబ్దాలు చేస్తున్నాయి. తడిని తాగిన పైర్లు ఎంత అందంగా తయారైనావో చూడ్డానికే అన్నట్లు ఆకుల ద్వారా...
సాధిక
‘కారణాలు బోలెడు చెప్పచ్చు. కొంతకాలము తరువాత ఆమెకు ఆ బంధం ‘తనది’ గా అనిపించిక పోయి ఉండొచ్చు లేదా మళ్లీ తను అలాగే ఉండాలేమో అనే ఆలోచన వచ్చినప్పుడు కూడా కావచ్చు. బయటి నుంచి చూసేవాళ్లకు వాళ్ళదేమిటి చక్కటి సంసారం అనిపించినా...
నీలి తోకచుక్క
“అతను కాగితాలపై బొమ్మలు వేసి ఇచ్చేవాడు. ఆకాశంలో చుక్కల గురించి కథలు చెప్పేవాడు. రాత్రుళ్ళు నన్ను జోకొడుతూ పాటలు పాడి నిద్రపుచ్చేవాడు. యిద్దరం కలిసి పెదవాగు వెంట రంగురాళ్ళని ఏరే వాళ్ళం. అతడెప్పుడూ ఊరు దాటివెళ్లడం నేను...