తిమ్మాపురం స్మారక తొలి కథల పోటీ గడువు: నవంబరు 1

కథలు పంపించడానికి గడువు: నవంబరు 1 , 2020

తిమ్మాపురం బాలకృష్ణ రెడ్డి కుటుంబ సభ్యులు – “సారంగ” నిర్వహణలో కథల పోటీకి ఆహ్వానం

ఒక్కో కథకు పది  వేల రూపాయల ( 150 యూఎస్ డాలర్లు)  చొప్పున, మూడు ఉత్తమ కథలకు 30 వేల రూపాయలు బహుమతి

కథలు పంపించడానికి గడువు: నవంబరు 1 , 2020

కథలు పదిహేను పేజీలకు మించకూడదు. యూనీకోడ్ వర్డ్ డాక్యుమెంట్ లో మాత్రమే పంపించాలి.

కథలు పంపించాల్సిన ఈ- చిరునామా:  tbkr.sahityam@gmail.com

ప్రచురణ: “సారంగ” పక్ష పత్రిక నవంబర్ సంచికలు

 

తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి
ఫిబ్రవరి  24, 1926 – నవంబర్  1, 2015

ప్రముఖ న్యాయవాది, కమ్యూనిష్టు తిమ్మాపురం బాలకృష్ణ రెడ్డి గారి జీవిత వివరాలు ఇవీ:

కమ్యూనిస్ట్ బాలకృష్ణ రెడ్డి గా ప్రసిద్ధి పొందిన తిమ్మాపురం బాలకృష్ణ రెడ్డి చిత్తూరు దగ్గిర  సంతపేట గ్రామంలో 1926లో  జన్మించారు. ప్రాథమిక అభ్యాసం చిత్తూరులో, తరువాత మదనపల్లెలోని బీసెంట్ థియొసాఫికల్ కాలేజీలో చదువుకున్నారు. ఈ సమయంలోనే ఆయన రాజకీయ భావాలు కాంగ్రెస్ నుంచి కమ్యూనిజం వైపు మళ్ళాయి. 1950-1952 కరువు సమయంలో సంతపేటలో గంజి కేంద్రాలు నడిపారు.

దాదాపు రెండు ఏండ్లు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన తరువాత మదరాసు లా కాలేజ్ నుంచి న్యాయవాదిగా పట్టభద్రులయ్యారు. జొన్నపాడు గ్రామంలోని కృష్ణ జిల్లా ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు వంగపాటి రంగారెడ్డి (పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు సహచరుడు) గారి కుమార్తె లలిత ను 1954 లో  ఆదర్శ వివాహం చేసుకున్నారు.

చిత్తూరులో లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తరువాత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని రెండు సార్లు చిత్తూరు మునిసిపల్ కౌన్సిలర్ గా కమ్యూనిస్ట్ పార్టీ టిక్కెట్టుపై ఎన్నికయ్యారు. మునిసిపల్ కార్మిక, ప్రింటింగ్ ప్రెస్ కార్మిక సంఘాలను సంఘటితపరిచారు. చిత్తూరు జిల్లా కమిటీ సభ్యుడిగా రాష్ట్ర నాయకులతో కలసి ఉద్యమాలలో పనిచేసారు. రైతులపైన సెస్ పెంచినపుడు  జరిగిన నిరసనలలో పాల్గొని, అరెస్ట్ అయి రాజమండ్రి  జైలుకి వెళ్లారు. 1964 లో కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా విడిపోయిన తరువాత పార్టీ అభిమానిగా న్యాయ సేవలందించారు. తిరుపతి కుట్ర కేసులో కమ్యూనిస్ట్ నాయకులూ,  మదనపల్లె స్పిన్నింగ్ మిల్ కార్మిక సంఘాల  తరపున వాదించి వారికీ విజయం చేకూర్చారు.

పులిచెర్ల ప్రాంతంలోని భూస్వాములు అక్రమంగా వేసిన పలు కేసులలో పార్టీ సభ్యులకి అండగా నిలిచారు.  పౌరహక్కుల విషయంలో పనిచేసి  అక్రమంగా అరెస్ట్ అయిన అనేకమందిని ఆదుకున్నారు. వివిధ గ్రూపులుగా విడిపోయిన పార్టీ ఏకం కావాలని, సామ్రాజ్యవాద  వ్యతిరేక  పోరాటంలో కలవాలని అనేవారు.

సోవియెట్ యూనియన్ విచ్చిన్నమైనప్పుడు తాత్కాలికంగా ఆశాభంగం చెందారు, కానీ చివరి వరకు మార్క్సిస్ట్ గానే బతికారు . వ్యవసాయం అంటే బాగా ఇష్టపడేవారు. న్యాయవాది వృత్తిలో వుంటూనే సంతపేటలో   వ్యవసాయము కూడ చేసేవారు.  తెలుగు సాహిత్యం పై మక్కువ తో ఎన్నో పుస్తకాలు చదివి బంధుమిత్రులతో చర్చించేవారు.

బాలకృష్ణారెడ్డి  జీవితాంతం నమ్మిన , ఆచరించిన అభ్యుదయ భావాలను , ఆదర్శాలను  ప్రోత్సహించే దిశగా వారి కుటుంబం  ఈ స్మారక కథల పోటీలు నిర్వహించటం ఒక మంచి  తొలి అడుగు.

*

 

 

ఎడిటర్

ఎడిటర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • We are an ordinary people.we know to write story’s by using pen& paper .as per your computation, using system is difficult today life.if you are given the chance of pen and paper I will give 5 more story’s. This is my request.
    Dhanyavaadamulu.

    • sir meeku paper lo katha raayadam alavaatu kaabatti ee technology theliyadhu kaabatti simple ga oka pani cheyyocchu… meeru raasina kathani yedhanna dtp shop ki velli akkada aa papers ni dtp chepinchi vaaditho okka maata matladi aa file ni potee peduthunna vaallaku mail chepinchandi… chaala easy asalu… try cheyyandi… shop ki velli dtp cheyinchi shop vaadini bathimilaadi mail cheyinchadam chaala risk anukuni oorkokandi… all the best

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు