ఒకరోజు – కొన్ని దృశ్యాలు

రోడ్డు మూలమలుపులో

గుంపులు గుంపులుగా మనుషులు

వాళ్ళది

తలలు లేని మొండాల నడక

 

కొన్ని పిడికిళ్ళు

మరికొన్ని గొంతులకు గొలుసులు

వేసి తీసుకుపోతూ

తలకిందులగానున్న సులీపో వాహనం

 

నిశ్శబ్దాన్ని ప్రతిధ్వనిస్తూ

ఎప్పుడూ శబ్దాన్ని చేసే ధర్నా చౌక్

 

చలికి తాళలేకమో

మంట పెట్టుకున్న గుంపు

దగ్గరికి పోయి చూస్తును కదా

మంటల జాగలో తలలు

తలలుండాల్సిన చోట మంటలు

 

సాకీ

యహాః సోచ్నా మనా హై

సోచ్ కో అభీ గైర్ ఖానూని బనాదియా

 *

 

 

అరుణాంక్ లత

అరుణాంక్ లత

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు