ఎవరో చెక్కిన అభద్రతాశిల్పంలా…

తన్ని రోజూ చూస్తూనే ఉంటాను.
వాళ్ళ పూర్వికులు
ఎవరో ఎక్కడో పోగొట్టుకున్న దానిని ఇప్పుడు ఇక్కడ వెతుక్కుంటున్నట్లు ఉంటాడు.
ఎవరో కవి మూడు పాదాలు రాసి
నాలుగోపాదం రాయకుండా వదిలేసిన పద్యంలా ఉంటాడు.
చరిత్రంతా తనదే అంటుంటాడు
ఆచరిత్రలో తాను లేడని తెలుసుకోడు.
అందర్నీ ఆలింగనానికి ఆహ్వానిస్తాడు
తాను మాత్రం స్వీయక్వారంటైన్ లోకి వెళ్ళిపోతాడు.
తనను తానే నిర్వచించుకుంటాడు
అదెంత నేతిబీరకాయో ఎరగడు.
అతనొక విరామచిహ్నంలేని వాక్యంలా ఉంటాడు.
పుస్తకంలో
కాగితాలమధ్య నెమలీకలా ఉండాల్సినవాడు
పుస్తకంలోంచి రాలిపోయి గాలికి కొట్టుకుపోతున్న పాతకాగితంలా ఉంటాడు.
అతను
ఎవరో చెక్కిన అభద్రతాశిల్పంలా ఉంటాడు.
*

రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • విరామ చిహ్నం లేని వాక్యం, రాయబడని నాలుగవ పాదం లేని పద్యం — ఉహకు చిక్కని ప్రతీకలు. 🙏🏽🙏🏽

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు