అమెరికా తెలుగు సాహితీ సదస్సు ప్రకటన

మిత్రులారా,

రాబోయే ఆగస్టు 16-17, 2025 తేదీలలో హ్యూస్టన్ మహానగరం లో జరిగే 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కి మిమ్మల్ని  సాదరంగా ఆహ్వానిస్తూ పూర్తి వివరాలతో సమగ్ర ప్రకటన జత పరిచాం.

క్లుప్తంగా..

ప్రతిపాదనలకు ఆహ్వానం

ఈ సదస్సులో ప్రత్యక్ష వేదిక మీద పాల్గొని సాహిత్య ప్రసంగం చేయదల్చుకున్న వక్తలు, స్వీయ రచనా విభాగంలో  స్వీయ కవిత, చిన్న కథ సభాముఖంగా చదివి వినిపించ దలచుకున్న రచయితలు, తదితర ప్రక్రియలలో పాల్గొన దల్చుకున్న వారు ఈ క్రింది లింక్ లో తమ ప్రతిపాదనలు పంపించ వచ్చును.

అన్ని ప్రతిపాదనలకీ గడువు తేదీ : July 31, 2025

ప్రతిపాదనలు పంపించవలసిన లింక్

(Proposals received in the following format before due date only will be considered)

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfhtp5ZUfYeJrqCYHxMXupalrbSc70hvsN4Ht7ECqB5GuA8Iw/viewform

వీక్షకులకు (ప్రతినిధులు) ఆహ్వానం

ఈ సదస్సులో వీక్షకులుగా పాల్గొని రెండు రోజుల పాటు తెలుగు భాషా, సాహిత్య సౌరభాలను ఆస్వాదించి, ఆనందించదల్చుకున్న వారు ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకుని సహకరించమని కోరుతున్నాం.

Registration & Donation Form Link (నమోదు పత్రం)

https://docs.google.com/forms/d/1o0ozvSCSbGxUNf5yasH_vqLJchH2z100x6x9ODvtpQs/edit

Last Date to Register: August 10, 2025

సదస్సులో పాల్గొనే వారికి సమకూరే వెసులుబాట్లు

(Benefits to speakers and other delegates)

సదస్సులో పాల్గొనే వారి పారితోషికం, స్థానిక ఉచిత వసతి తదితర వివరాలకు జత పరిచిన సమగ్ర ప్రకటన చూడండి.

దయచేసి ఈ ప్రకటన మీకు వ్యక్తిగత ఆహ్వానంగా భావించి, ఆసక్తి ఉన్న మీ సాహితీ బంధువులకి పంపించి మాకు సహకరించండి.

భవదీయులు,

14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వాహకులు

వంగూరి చిట్టెన్ రాజు, శ్రీకాంత్ రెడ్డి, శాయి రాచకొండ, సుధేష్ పిల్లుట్ల, కావ్య రెడ్డి, ఇంద్రాణి పాలపర్తి, దీప్తి పెండ్యాల, శ్రీనివాస్ పెండ్యాల, ఇందిర చెరువు, లక్ష్మి రాయవరపు, రామ్ చెరువు, అరుణ గుబ్బా, కర్రా శ్రీనివాస్, కిషోర్ కమలాపురి, శ్రీ సూరెడ్డి, మైథిలి చాగంటి, లలిత రాచకొండ, వాణి దూడల, కోటేశ్వర శాస్త్రి కృష్ణావఝ్ఝల

  మన తెలుగు భాషా, సాహిత్యాలని ఆస్వాదించండి, ఆనందించండి, ఆదరించండి

సమగ్ర ప్రకటన -1 Final June 28, 2025

వంగూరి చిట్టెన్ రాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు