అచ్చే దిన్     

కొందరికి నూకలు చెల్లగొడితే గానీ దేశాన్ని మార్చలేడు.మార్చలేడు.

    రోజూ గంట సేపు మోర్నింగ్ వాక్ చేసి, యేవేవో యెక్సర్సైజులు చేసి,చేసి, ఇంటికి వెళ్ళేముందర కాసేపు సూర్యనమస్కారం చేసి ,తర్వాత పార్క్ లో కూచుని ముక్కు మూసుకొని యోగా చేస్తుంటాడు మా శంకరనారాయణ. యోగా అయ్యాక అప్పటికి అక్కడికి చేరిన మాలాంటి వాళ్ళకు యేవేవో ఊసులు చెప్తుంటాడు. శంకరనారాయణ చేసేది పోలీస్ ఉద్యోగం!  గానీ ఆయన కాకీ బట్టలు వేసుకున్న రుషి! రుషి గారు మమ్మళ్ని కూచోబెట్టి – అచ్చేదిన్ – వస్తున్నాయనేవాడు. తొలిరోజు – యేవో కంపెనీ దినుసులనుకున్నామ్. కాదన్నాడు. అచ్చే దిన్ అంటే మంచి రోజులట!ట! దాదాపు డభ్భయ్యేళ్ళుగా యెదురు చూసి చూసి అలిసిపోయేడట. అతనొక్కడే కాదట… భారతీయులంతా చూసి చూసి అలిసిపోయేరట. ఇన్నాళ్ళకి అచ్చే దిన్ వస్తున్నాయి అవిగో – అనన్నాడు. యెదురుగా చూస్తే – యెర్రటి యెండ కళ్ళమీద పడి కళ్ళు బైర్లు కమ్మాయి. ఆయన తర్వాత ఇలా కొనసాగించేడు –

భారతీయులంతా ఆయన్ని నమ్మాలి. ఆయనేది చేసినా…తన కోసం కాదు, ఇతరుల కోసం చేస్తాడు. ఆయన – మాటల్ని కత్తుల్లా విసురుతాడు ( కత్తులు కూడా విసురుతాడు లెండి).. కొందరికి కుత్తుకలు తెగిపోతాయి…దుష్ట సంహారమన్నమాట ( ప్రతిపక్షులంతా దుష్టులేనర్రా..). ఇంతకాలం మనమెన్ని బాధలు పడ్డాం? ( మనమంటే హిందువులం). అవినీతి, అక్రమాలు, ధరలు పెరగడం, నిరుద్యోగం,పేదరికం, అనారోగ్యం… ఆయన చెప్తుంటే -అబ్బబ్బా ఇన్ని బాధలు పడ్డామా అననిపించింది నాకు. మన బాధలు ఆయనకి తెలుసు. మన ఆశలు తెలుసు. మనకేటి కావాలో ఆయనకు తెలుసు. అంచేత మనం ఆయన్ని నమ్మాలి. నమ్మినోళ్ళకి ఆయన అన్యాయమ్ చేయడు. మీకు అనుమానముంటే – అంబానీని గానీ ఆదానీని గానీ అడగండి.

ఆయనని కాదన్నవాళ్ళకి – పుట్టగతులుండవర్రా. అనుమానముంటే అద్వానీనో,మురళీ మనోహర్ జోషీనో అడగండి. వాళ్ళకంటే గుజరాత్ ముస్లిం లు బాగా చెప్పగలరు. దుష్ట శిక్షణకు పూనుకున్నాడంటే – క్రిష్ణపరమాత్ముడు చాలడు. గోవుకి అపకారం చేసినా సయించడు. ఆళ్ళ  తోలు తీయించినాడు. అసలకి మన హిందువుల కోసం ఒక దేశాన్ని తయారు చేయడానికే ఆయన నాయకుడయ్యాడు. అందుకనే ఆయన దేశదేశాలు తిరుగుతన్నాడు.అతను భిన్నంగా ఆలోచిస్తాడు,,భిన్నంగా ఆచరిస్తాడు. చరిత్రని కూడా భిన్నంగా రాయిస్తాడు చూస్తుండండి. ఇప్పుడిదాకా – దేశానికి స్వాతంత్ర్యం గాంధీ, నెహ్రూ, ఇంకెందరో కాంగ్రేసోల్లూ తెచ్చారని చరిత్ర చదువుకున్నామా? ((నక్సలైట్లు స్వాతంత్ర్యం కాదు అధికార మార్పిడి అంటారనుకోండి. అది వేరే టాపిక్). కాదు, కాదని – పటేల్ నీ, పరివారాన్నీ చరిత్ర లోకి తీసుకు రాలేదా?? గాంధీ, నెహ్రూలు దేశానికి కీడు చేసారేమో ఆలో చించాలంటాడు. కాకపోతే…గాడ్సేకి గాంధీని చంపాల్సిన కోపమెందుకొస్తాదంటాడు. ఆయన భిన్నంగా ఆలోచిస్తాడర్రా.

దేశమిలా తగలడ్డానికి కారకులయిన యెవర్నీ వొదలనంటాడు. దేశమవతల దాచీసిన ధనాన్నే వొదల్ను,తీసుకొచ్చి తీరతానన్నవాడు, దేశానికి అపకారం చేసినోల్ని వొదుల్తాడా?వొదులడు. మనం నమ్మాల. నమ్మి అతగానికి బలం ఇవ్వాల. అతగాను యెన్నికల్లో నిలబెట్టిన వాళ్ళని గెలిపించాల. సాధుల్నీ, సన్నాసుల్నీ, కాషాయం కట్టుకున్నోళ్ళనందర్నీ ఖద్దరుగుడ్డలకి పోటీగా గెలిపించి అసెంబ్లీలకీ, పార్లమెంటుకీ పంపాల.పంపాల. ఆళ్ళందర్నీ కలుపుకొని అతగాను దేశం లోని రాజ్యాంగాన్ని మార్చేస్తాడు. రాజ్యాంగానికి బదులు భగవద్గీతని పెడతాడు, సూస్తుండండి.

యేమంటారూ? దేశం వొప్పుకోదా? వొప్పిస్తాడర్రా..! అర్ధం గాని రాజ్యాంగం కావాలా… మోక్షం ఇచ్చే భగవద్గీత కావాలా…దేనికి మీ వోటు అనడుగుతాడు…మనళ్ని. హిందువన్నవోడు…దేనికోయ్ వోటేస్తాడు?

యేమంటారూ? దేశం అవతల దాచిన డబ్బు ఊసెత్తకుండా…దేశం లోని పేదారోదాని ఇబ్బంది పెట్టినాడంటారా? నోట్లరద్దుతోనంటారా?                                              అదేమరి…ఆయనకీ, మనకీ తేడా! ఆయన మెట్టు,మెట్టు యెక్కుతాడు. ఒక్కసారి పై మెట్టు యెక్కాలనుకొని బోర్లాపడిపోడు. ఆయన పార్టీలోని మెట్లే యెలాగ యెక్కాడు? ఒకనాడు అద్వానీకి మైక్ పట్టుకున్న వాడు…ఇపుడు అద్వానీకి మైకు అందకుండా చేసీలేదా? ఓపిక పట్టండి…ఒస్తాయి! తెస్తాడు! అచ్చే దిన్ రాస్తా మే హై!

ఈలోపు జనాలు చస్తన్నారంటారా?

ఓయ్! మీకు తెలీదుగానీ…ఆయన వలన చాలా మందికి నూకలు చెల్లిపోతాయి. సూస్తూ ఉండండి. కాంగ్రేసోళ్ళకి చెల్లిపోతాయి.తరాత కమ్యూనిస్టులుకి…పరాయి మతస్తులుకి, పరాయి పార్టీలవాళ్లకి…పరాయి గ్రూపువాల్లకి నూకలు చెల్లిపోయే దిన్ ఆతా హై!హై! ఇవి అచ్చే దిన్ కి ముందరే వస్తాయి.  రాకపోతే ఆయన తెప్పిస్తాడు. సీబీఐ ని వొదుల్తాడు. సీఆర్పీ ని వొదుల్తాడు. ఈళ్ళింకా చాలరంటే  ఆరెస్సెస్ సైన్యముంది…!…! ఇలాగ కొందరికి నూకలు చెల్లగొడితే గానీ దేశాన్ని మార్చలేడు.మార్చలేడు…

ఇలాగ శంకరనారాయణ ఉపన్యాస ప్రవాహం సాగుతోమ్ది.

మా రూల్సు గాడు అడ్డుతగిలి – దేశిం మార్సడం సంగతి పక్కన బెట్టువోయ్. దేశిం లోని జెనం తలుసుకుంటే ఇలాంటోళికి యెందరికో నూకలు చెల్లిపోతాయి. ఆ తలుసుకొనే రోజే అచ్చేదిన్…అవి జెనం తెస్తారు…నువ్వూ, అతగానూ తేలేరు…అంతదాకా ముక్కు మూసుకు యోగా చేసుకోవోయ్ . .. అనేసి దెబ్బగొట్టేడు..!

అట్టాడ అప్పల్నాయుడు

అట్టాడ అప్పల్నాయుడు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాయుడుగారు అదరగొట్టేశారు.అసలోడికి తెలుగు అర్దమై చావదుగా!అయినా అన్నీ వదిలేసినోడికి సిగ్గా ఎగ్గా!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు