These Hands..

Naveen Kumar hails from Kadiri in Anantapuram. He’s holds an MSc and has also studied History, Polity and Economic to write the Civil Services Exams. His affinity towards literature grew in the past five or six years and has been on a learning curve since. In his free time he listens to music, sings, reads and writes. He is currently working as a Sericulture Officer for the Government of Andhra Pradesh.

 

!?

It is still quite hazy

Sheets of snow melt away one-by-one
A blade of grass gently opens up

The wind moves the branches of a tree
To create a little space

From far away, one can hear
The songs of a bird unknown
Which blend with the ebbing sounds of the roaring sea
That I had drowned myself in just yesterday

On the other side
Turning red and white
A sky that sends vague signals

Then
To start my walk
I bend to tie my shoelace
A notification rings on my phone
Curious to see what it was
There was a text that read, “what’s up?”

 

!?

ఇంకా కాస్త మసగ్గానే ఉంది

మంచుపొరలు ఒక్కొక్కటే కరుగుతూంటే

మెల్లిగా తేరుకుంటోంది గడ్డిపోచ

మధ్యలో కాస్తంత చోటు చేసుకుందామని

చెట్లకొమ్మల్ని కదుపుతోంది గాలి

దూరాల నుంచి వినవస్తూ

ఏదో గుర్తు తెలియని పక్షి పిలుపు

అందులో కలిసిపోయీ సన్నగా దూరమవుతూ

నిన్న నే మునిగి వచ్చిన సముద్రపు హోరు

అవతలి వైపు నుండి

ఎర్రబడుతూ తెల్లబడుతూ

అస్పష్ట సందేశాన్నేదో పంపుతోంది ఆకాశం

యిక,

నడక మొదలు పెడదామని

షూ లేస్ బిగించుకునేంతలో,

మొబైల్లో ఏదో నోటిఫికేషన్ వచ్చిన చప్పుడు

చూద్దునుగదా,

‘ఎలా ఉన్నావు?’ అని రెండు టెక్స్ట్ మెసేజెస్!

These Hands

The feeling of something creeping beside me
I startle from deep slumber
I felt my hair caressed gently
By these hands

In a time when my dreams remained arid
The rivers that poured out of my eyes
Poured into the depths of the cup formed
By these hands

When the rains swell up canals
And reach my cheeks cold
The depth of the sea that rests inside were drenched
By these hands

Moving here and there
Pulling out a spectrum of colours
I was made into a butterfly
By these hands

Come, stretch these hands out for me
I can never feel their touch again
What else is left to ask?
Stand up
And stretch these hands out for me
I want to kiss them
I want to revere them
I want to imprint them in my heart
Enough to remember for a lifetime
Stretch these hands out for me

 

చేతులు

 

పక్కనేదో జరజరా పాకినట్లయ్యి

నిద్రలోంచి దిగ్గున లేచి కూచున్నపుడు

నా జుట్టును సుతారంగా నిమిరిన చేతులు

 

కలల్లోనూ ఎడారులు విస్తరించిన కాలంలో

కళ్ళలోని నదుల్ని

దోసిలితో ఒంపిన చేతులు

 

వానలు కాలువలై పొంగినపుడు

చల్లగా చెంపలమీదకు చేరి

లోపలి సముద్రాల లోతుల్ని తడిమిన చేతులు

 

అటూయిటూ కదిల్చి

రంగులేవో తీసి

నన్ను సీతాకోకను చేసిన చేతులు

 

ఏవీ, ఆ చేతుల్ని ఇలా చాపవూ..

ఇంకెప్పుడూ ముట్టుకోలేను గదా

మరింకేమీ అడగను

ఒక్కసారి లేచి

నీ చేతుల్ని ఇలా చాపవూ

ముద్దుబెట్టుకుంటాను

కళ్లకదుముకుంటాను

మిగిలిన జన్మకి తోడుగా

గుండెపై ముద్రించుకుంటాను

ఒక్కసారి…

*

The translation was done by Maithri for Chaaya Resources Centre, Hyderabad.

 

Maithri

I'm a 20 year-old Literature student on the verge of tasting what life has to offer. Curious lover of finding stories in almost anything and everything.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Your words are bubbling with new wave of energy…at it’s best combination of reflection.Kidos.Best wishes.

  • నీ రెండు కవితలూ బాగున్నాయి. చేతులు కాస్త ఎక్కువ బాగుంది నాకు. వాటి అనువాదం కూడా అంతే బాగుంది.👍

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు