The Second Coming

Telugu: Iqbal Chand
The good man has no shape.
– Wallace Stevens
1
The soot cannot be washed away
even with milk,
the nature of human that remains
is the utter poison in a bottle of milk.
2
A twisted story
is no longer a prank.
To deceive with enticements
or to whet a knife
before
                slitting the throat
is an excuse necessary?
A shadow is all you need
to trick and behead.
3
My foxy ally!
The thief in the
burial ground!
Your sardonic metaphors
neither suit nor brighten
this language of heart.
Despite the aesthetics
a white lie can not be true.
4
The inhumanity of the non-believers
is such that
                        they would test the liveliness
of the crucified one by
darting a spear,
while bringing down the body.
The world that has been shrunk
with sinning
cannot be cleansed in a single life.
5
Oh, Great Prophet!
You cannot forgive when you
return!
The calling for your second coming
should be to Punish.
పునరాగమనం
————–
“The good man has no shape”
—Wallace Stevens.
1.
పాలతో కడిగినా మసిపోలేదు –
ఇంతేకదా!
సమసిపోని మనిషి నైజం,
పాలసీసాలో పచ్చి విషం –
2.
వక్రీకరించి
చిత్రీకరణ
ముమ్మాటికీ తుంటరితనం కానేకాదు –
కుట్రకు ముందు కవ్వించడం
కుత్తుకక కోయడానికి ముందు కత్తి నూరడం –
నెపానిదేముంది ?
నీడను చూపి
నమ్మించు
నరకవొచ్చు –
3.
కపటమిత్రుడా ! కాటి చోరుడా !
వ్యంగ్య ప్రతీకలు
హృదయభాషకు వొదగవూ శోభించవు !
అత్యంత అందమైనదైనా
శ్వేతీయ అబద్దం సయంగా రాణించదు –
4.
శిలువ నీంచి దింపుతూ
మరణ నిర్ధారణకు
బరిశెతో పొడిచి పరీక్షించే
అవిశ్వాసుల అమానవీయమిది –
కుంచుంచుకొని పోయిన
పాపలోకాన్ని
పరిశుధ్ధపరచడానికి
వొక్కజన్మ సరిపోదు –
5.
మహాప్రవక్తా !
ఈసారి క్షమించడానికి కాదు,
శిక్షించడానికే
నీ ఆగమనం
ఇప్పుడు చాలా అవసరం.
*

Afsar, Rohith

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Afsar &Rohit: A very beautiful translation of Wallace Stevens lovely poem. Congratulations. V R Veluri.

  • చాలా బాగుంది. మనసును చీల్చి చండాడింది. పరిశుద్ద పరచటానికి ఒక్క జన్మచాలదు! క్షమించడానికి కాదు శిక్షించడానికి నీ ఆగమనం! అంతటి రాక్షసత్వం తాండవమాడుతూందా!!!నీడను చూసి నమ్మించొచ్చు నరకవచ్చు!!😢

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు