The Footprints of a Butterfly

Telugu Poetry of Resistance -1

Born into a Muslim family in 1971, Mahmood’s journey as a poet began in 1994. His brother motivated him to read the Telugu literature and since then Mahmood became a voracious reader and he started reading about Sufism which made a huge impact, however, he connects the Sufi world with contemporary politics, most importantly, Muslim discourse. Grew up amidst hundreds of dargahs and sufi shrines around him in Rayala Seema, Mahmood openly says, “Sufism is in my DNA.”

 

All I asked for was  one night’s companionship

and you nodded.

 

As if a life force had been poured into my body

suspending me

from the cliff of death’s very tongue

– That’s how the agreement felt.

 

They say you came from a faraway land,

that such long distances too are butterflies upon your feet.

 

When I slept with you the cup of life was empty,

I had no idea what would happen after.

 

You woke up, me too.

 

The dawn was

like the kiss of sun on the beloved’s palm.

 

The water you sprinkled on your face

— a rain showered in the heaven.

 

I too washed my face,

and then I found that

an ocean of enthusiasm was bubbling inside me.

 

Thereafter

You continued your walk

I followed you.

 

Many followed us.

 

We removed ourselves of all the pain

about the destination,

it was the moment the entire path

happily bore the footprints of many lower castes;

 

The moment

when I forgot the pain of my own self.

All this life force, my lord,

is the breath you’ve blown into this balloon.

 

Whenever I lost the hope in the life

you would sprinkle confidence,

— the pure water left after the ablution,

 

does life mean- to keep travelling;

or is it a faceless stream we invite into ourselves?

 

All the rest houses turned into deserts

and I became an oasis

 

Yet, lost the thirst forever.

 

All your destinations turned into wild forests

and me

– a quiet green tree.

 

The plains that crossed your feet

turned into a green lush of crop.

 

You sing now and then,

— a sound of a sarod,

leaving me in an absolute trance.

 

The ocean turns into a stage

as I touch the sky as a wave.

 

Your footprint has hooked me up with the world.

The entire world then found a rest house in me.

 

The element of wandering

that makes all directions submit to you

and then what the world can do,

except to follow your footprints.

మిగిలిన ఊపిరి మీద వాలిన ప్రాణపు సీతాకోక

– మహమూద్

నీతోడ ఒక్క రాత్రి నిద్దురను అభ్యర్థించాను

మరణపు అంచు నాలిక మీద నర్తిస్తున్న వాడికి
పునంఃప్రాణం లో దించి వెళ్ళినట్టైంది
నీ అంగీకారం

ఏదో దూరాభారం నీవచ్చావన్నారెవరో,
దూరం నీ పాదంమ్మీది సీతాకోక అని కూడా అన్నారు

బతుకు మధుపాత్ర ఖాళీ గా ఉన్న నేను
ఈ నిద్దుర తర్వాతి కాలాన్ని ఊహించనే లేదు

నిదుర లేచావు
నీతో పాటు నేనూ

సూర్యుడు తన ప్రియురాలి
అరచేతి మీద పెట్టిన
ముద్దులాగుంది ఉదయం

నువ్వు నీ
ముఖమ్మీద చిలకరించుకున్న నీళ్ళు
స్వర్గపు దాపున కురిసిన వర్షంలా అనిపించింది

నీ చేతులను స్పృశించిన నీళ్ళతోనే
నేనూ కడిగాను నా ముఖాన్ని
ఉత్తేజపు సముద్రం నాలోనూ ఉన్నట్టు
కనుగొన్న క్షణమది

తదుపరి నీ నడక మొదలైంది
నీ వెనుక నేనూ నడుస్తున్నాను
నా వెనుక ఇంకొందరూ
గమ్యం గురించిన దిగులు వొదిలించుకున్న
తొలి ప్రయాణమది
నిమ్నజాతుల పాద ముద్రలను సంతకాలుగా స్వీకరించిన దారది

కాలం నేనొక్కణ్ణి ప్రత్యేక అస్థిత్వం ఉన్నవాణ్ణనే దుఃఖ కారణాన్ని మరువనిచ్చింది..

అక్కడ నుంచి జహాపనా!
ఆయుష్యంతా ఈ బూరలోకి
నీవు ఊదుతున్న నీ ఊపిరే!

ప్రాణం మీద ఆశ చచ్చిన నాకు బతుకు పై భరోసాని ఊజూ చదివిన నీళ్ళలా చల్లావు

జీవతమంటే ప్రయాణించటమా..దిశలెరుగని ప్రవాహాన్ని మనలోకి ఆహ్వానించటమా

నీ విడుదులు ఎడారులయ్యాయి
నేను ఒయాసిస్సునైపోయి
దాహం నా దరికి చేరడం మానేసింది

నీ గమ్యాలొకసారి అరణ్యాలయ్యాయి
నేను చెట్టునై చల్లబడడం ప్రారంభించాను

నీ పాదాలొకసారి మైదానాలను ముద్దాడాయి
పంటచేనై పచ్చబడిపోయాను

నువ్వపుడపుడూ పాటలు పాడావు
నేను సరోద్ నాదంలా మూర్ఛనలు పోయాను

నీ నడక నదీ తీరమైనపుడు
నేను ప్రవాహాన్నై పరుగులిడాను

నీ వేదిక సముద్రమైంది
నేను కెరటాన్నై నింగిని తాకాను.

నీ పాదముద్ర నాకు ప్రపంచాన్ని పరిచయం చేసింది
ప్రపంచం నాలో విడిది ఏర్పాటు చేసుకుంది

బైరాగీతనం దిశలను తన వైపు తిప్పుకుంటుంది
లోకం వెనుకెనుక రాక ఏం చేస్తుంది?

*

Afsar, Rohith

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • What a powerful translation of a wonderful poem.
    More power to Shaikpeerla Mahamood, Afsar Mohammed bhai and Rohit.

  • అభినందనలు💐💐.అనువాదం, చాలా చాలా బాగుంది.,,♥️.అభివందనలు రోహిత్ Afsar ji!

  • Nice poem, well translated, I believe. At least it reads well in Eglish, except for one or two places where the language is ackward like “.that such long distances too are butterflies upon your feet. “

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు