మనంచూడని,తెలియని, తెలుసుకొనివాటి పట్ల మనకు అపోహలుoటాయి. అనుమానాలుంటాయి.ఆ అపోహల్ని అనుమానాల్ని బట్టి ఆవిషయాల్ని తర్కించుకోకుండానే వాటిని విశ్వసించి, వాటినే అంతిమoగా మన నమ్మకాలని బలంగా నమ్మి అంతే బలంగా వాటిని ఆచరిస్తాం.కొన్ని వందలఏండ్లు గడిచినా వాటిని నమ్మటం మానుకొము సరికదా వాటిని నమ్మని వ్యక్తుల్ని నమ్మమని బలవంతపెడతూనో, నమ్ముతున్న వారిపై సందేహాల్ని వెళ్లగక్కుతూనో తిరుగుతుంటాం.వాళ్ళని వింత జీవులని ముద్రవేస్తాం.వంకరగా ఉండటాన్ని సరైనదిగా ఆమోదించం.లేదా సరైనదాన్ని వంకరగా వక్రీకరిస్తాం.
సందేహించకుండానే సానుకులతని వ్యక్తం చేస్తాం. అది అదే అంటే అదే అని నమ్ముతామేగానీ అది అదేందుకయ్యిందో ఇంకోటి ఎందుకు కాలేదో బిన్నంగా ఆలోచించం.కొట్టుకుపోవటo మనకు అలవాటే.ఒకడు ఎదిచేస్తే అదే మనం చేయటo మన డిఎన్ఏలో భాగం అయిపోయింది.update ,update అంటూనే outdatedగా సాగిపోతున్నాం.భిన్నంగా ఉండటాన్ని ఆలోచించటాన్ని అంతతొందరగా ఒప్పుకోo.ఒక school of thinking కి అలవాటుపడి నూత్నత్వాన్ని సరికొత్త జీవన విధానాన్ని ఆహ్వానించం.ఒక గొర్రె మేస్తూ మేస్తూ ఒక భావిదగ్గరకి వోచ్చింది.బావిలోకి తొంగి చూస్తే తనరూపం తనకే కనిపించింది.లోపలేవరో ఉన్నారనుకొని నీళ్లలోకి దూకింది.ఇట్లనే ఉంటుంది మనవ్యవహారం చాలాసార్లు.బాగానే చదువుతాం .జ్ఞానం కూడా ఉంటుంది
ఐనా అజ్ఞానం రెచ్చిపోయి జ్ఞానాన్ని ముందుకు రానివ్వదు.
ఒక కొత్త ఆలోచన్నీ ఆచరణలో పెట్టాలి అంటే అంతకు ముందున్న ఆలోచన్నీ బద్దలుకోట్టాలి.అలా బద్దలుకొట్టే వాళ్లదే జీవితం. నాకులం నా మతం నాప్రాంతం అంటూ రానున్న తరాలకు కూడా అదే ఆలోచన ధోరణిని అలవరుస్తాం.తరాలు గడిచినా కాలం ఎంతముందుకు పోయినా వాటిని దాటి ఆలోచించటం చేయకపోతే progrees ఉండదు.వాడు మనోడే వీడు మనవాడే అంటాం వర్గాన్ని బట్టో కులాన్ని బట్టో.the whole universe is my native land అని చెప్పిన కల్పనా చావ్లా మాటను కొద్దిగానన్న హృదయంలోకి తీసుకునేందుకు ప్రయత్నిద్దాం.ఆలోచించే శక్తి కేవలం మనిషి మాత్రమే చేయగలడు కాబట్టి.నాకెందుకో ఇవ్వాళ ఇలాంటి ఆలోచనలు వొచ్చి కొన్నింటిని గమనించేలా చేశాయి.అవేంటో ఒకసారి కన్నుపెట్టoడి.
1.ఆడపిల్లలు నిప్పులా ఉండాలి అంటారు.సరే,మరి మొగపిల్లలు?
2.సచిన్ టెండూల్కర్నో,సానియా మీర్జానో ఇష్టపడతాం. మనపిల్లలు ఆటలు ఆడుతుంటే మాత్రం చదువు పాడవుతుందని బాధపడతాం.(నిజమా కాదా..)
3.మనం పూజించే దేవుళ్ళకు ఇద్దరేసో ముగ్గురేసో భార్యలుండొచ్చు.ఇద్దరు భార్యలున్నవాడు లేదా ఇద్దరు
మొగవాళ్ళతో శారీరక సంబంధం ఉన్న ఆడంగి ఒక మహా పాపి లేదా యదవ.(అంటే వాడు దేవుడనికాదు ఉద్దేశ్యం, దేవుడుకి
ఒక న్యాయం మనకి ఇంకొన్యాయం ఎందుకని?.. అనే సందేహం.)
4.మన తల్లితండ్రుల్ని మనం వృద్ధాశ్రమాల్లో చేర్చవొచ్చు. మన పిల్లలు మనల్ని పళ్ళెత్తి మాటా అనకూడదు.
5.జంతువుల్ని చంపటం పాపమని చదువుకుంటాం. చికెన్ తినటం మాత్రం మానుకోము.
6.చదువులు బాగా రావాలని సరస్వతిదేవికి మొక్కకుతాo..సరస్వతీ దేవి ఏమి చదువుకుంది అని ఆడిగినవాడ్ని పిచ్చోళ్లా లెక్కగడతాం.
7.తండ్రి bluefilms చూడొచ్చు.కూతురుగానీ మరొకరికి ప్రేమలేఖ రాసినా భరించలేము.
8.దిష్టి నిజమైతే చందమామకు ఎన్ని సార్లు దిష్ట తీసుండాలి.
9.డబ్బు అవసరమే లేదు అంటారు.రోడ్డుమీద రూపాయి దొరికినా కళ్లకద్దుకోకుండా వదలం.
10.ప్రేమ గొప్పదే కానీ బిచ్చగతెని ఆదరించడానికి అది పనికిరాదు.
11.ఆకలి అందరికి ఉన్నప్పుడు అన్నం అందరికి ఎందుకులేదు (త్రిషులంలో ఒక డయలాగ్)
12.ఇతరుల్ని ఓలిచి విచ్చదీసి వాళ్ళవాళ్ళ రంగులన్నింటిని బహిర్గతం చేసేమనం.మనల్ని మనం ఎందుకు పరీక్షించుకోo?
13.ఎప్పుడో వందల ఏండ్లక్రితం నరకాసురుడు చనిపోతే ఇప్పుడు బాంబులు రూపాన ప్రకృతికి పొల్యూషన్ ని రాయటం ఎందుకు?ఇంకా ఆతరహాలో థింక్
చేయకనా?ప్రభువా వీరు ఏమి చేయుచున్నారో వీరు నిజంగా ఎరుగరు..?కనుకనా..?
14.భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కాపురం చేస్తున్నప్పుడు పిల్లలు కలగకపోవటానికి స్త్రీని మాత్రమే కారణంగా చూపి వేదించటం అజ్ఞానమా?అంధకారమా?
అజ్ఞానం ఆయుధమైనప్పుడు జ్ఞానం మరణించే వస్తువు కావటం సర్వసాధారణం
అబద్ధం నిజమైనప్పుడు నిజం అబద్ధం అవటo కూడా అనివార్యమే
ప్రేమ వెలిగుతున్నప్పుడు ద్వేషం ఆ వెలుగు ఆరటాన్ని కలగoటుందని వేరే చెప్పాలా?
కులం నశించాలి మతం నశించాలి ప్రాంతలింగ భాషా భేదాలు నశించాలి…నినాదాలు వొద్దు అంటే మన విధానాలు కావాలి అంటాయి.నినాదాలకాడే మనం ఆగిపోవటం దారుణం.
మనిషే అన్నిటికీ మూలం.మరి మనిషికి మూలం ఏంటి
డబ్బు ఆస్తి ?మూలాలు మారుతాయి మనుషుల్లానే.
అంతులేదు అన్వేషణకి ఆరంభం తప్ప ప్రతి కాలంలో ప్రతి తరంలో…?
ఇద్దరు తత్వవేత్తలు కలుసుకున్నారు.మొదటివారు రెండోవారిని నువ్వు ఎవరు? అధివిని రెండోవారు మొదటివారిని అదేనేను అడిగేది నువ్వు ఎవరు?సరే వదిలేద్దాం. నువ్వు భూమిమీద ఏంచేయబోతున్నావు?అదే నేను అడుగుతున్నాను నీకిక్కడ ఏంపని?సరే ఇదీ వదిలేద్దాం.నీ గమ్యం ఏంటి?నీప్రయానం ఎటు?నాదీ అదే ప్రశ్న.ఉదయం సాయంత్రం పగలూ రాత్రి ఒకరికొకరు ప్రశ్నలు సందించుకుంటూనే ఉన్నారు.కాలమంతా ప్రశ్నలతోనే గడిచింది.ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు.
ప్రశ్నలు పుట్టింది ఎదుటివారిని ప్రశ్నించటానికి కాదు నిన్నునువ్వు ప్రశ్నించుకోవడానికి అని వాళ్ళిద్దరికి ప్రశ్నించుకోవటం మూలానే అర్ధమైoది.నీ ప్రశ్నలు నువ్వేసుకో నాప్రశ్నలు నేనేసుకుంటా.నువ్వు నీజీవితానికి అర్థం ఏమైనా ఉందొ లేదో నువ్వు కనుక్కో.నా జీవితానికి దారేంటో నేను కనుక్కుంటా.ప్రశ్నిస్తే ప్రశ్నలే వొస్తాయి.అదే ప్రశ్న వేసుకుంటే సమాధానాలు దొరుకుతాయి అని తెలిసి ఎవరికివాళ్ళు జీవితవేటకి ప్రయాణమయ్యారు.నిన్ను నువ్వు తెలుసుకో..నన్నుకాదు నిన్నునువ్వు పరీక్షించుకో నన్ను పరీక్షించకు.నిన్నునువ్వు స్వచ్చం చేసుకో నన్నుకాదు.నువ్వు విన్నావినకపోయినా కోకిల పాడినట్లు,నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా నది నాట్యమాడుతున్నట్టు.నువ్వు కదలాలి.అనేషకుడివై అంతరాత్మల్ని వెలిగించు.అంటూ ఇద్దరు తత్వవేత్తలు సాగిపోయారు.
అంతరాత్మల్ని చీల్చకుండా అంతర్మధనం చెందకుండా పరిశోధించకుండా పరిశీలించకుండా ప్రపంచం అనేది ఒకటి ఉందని నీకు జ్ఞానంలోకిరాదు.నువ్వు అనేవాడివి ఒకడివి ఉన్నావుకాబట్టి నీకంటూ వేరే ప్రపంచం ఏర్పడుతుంది.ఆప్రపంచమే మరో వ్యక్తికో వ్యక్తులకో లేదా పూర్తి వ్యవస్థకో ఉండదు.నిన్ను నువ్వు తెలుసుకొని నేను అంటే ఇదే అని నీకు నువ్వు వ్యక్తికరించుకోవటమే జీవిత అర్ధం.
Nakoka vishyam ardam kaadu…ilanti topics e site lo discussion ki pedite..asalu comments section mottam kaali(nil)🤔🤔… hypocrites..
Hypocrite కాకపోవొచ్చు సర్,ఆ తరహాలో think చేయొచ్చు అని తెలిసికూడా think చేయకపోవడం
👌👌👌👌🙏🙏🙏