అద్దం ముందు నుంచున్నప్పుడు…
అద్దంలో నా ముఖాన్ని చూచుకోవడమంటే
ఎందుకో నాకంత ఇష్టం లేదు.
అయినా పొద్దున్నే పళ్ళుతోముకోవడానికి
అద్దం ముందు నుంచున్నప్పుడు…
అప్పుడప్పుడూ
ఇష్టంలేని నా తోబుట్టువునే చూస్తున్నట్టనిపిస్తుంది.
ఇష్టంలేని నా తోబుట్టువునే చూస్తున్నట్టనిపిస్తుంది.
నలుపుకంటే ఎక్కువ తెల్లని
అదే నెరిసిన జుట్టుతో
నాముందు నిలవడం…
నాముందు నిలవడం…
అరే! అదే బట్టతల కూడా!
ఎంత వద్దనుకున్నా ఆ ముఖాన్నే ప్రతిసారీ చూడడం
ఎంత ఆశ్చర్యం!
ఎంత ఆశ్చర్యం!
నన్ను నేను నిజంగా చూచుకోవడానికి
నాకిష్టంలేనితనాలవసరమేమో!
*
As I stand in front of the mirror…
*
I don’t know why
I don’t quite like to look at my own face in the mirror.
Even so
as I stand in front of the mirror to brush my teeth
now and then
I feel I am looking at the face of the sibling I don’t particularly like
standing in front of me
with the same grey hair–
more white than black.
The bald head too!
How amazing to see again and again
the same face I don’t like to see!
Perhaps such dis-likes are necessary
for me to dis-cover my self!
—
“నన్ను నేను నిజంగా తెలుసుకోటానికి” – అని ఉంటే బాగుండేదేమో. ఊరకే నా కనిపించింది. మీ ఇష్టం .
Nice!