విచ్చుకుని
మూడువంకర్లు తిరిగి ముడుచుకుని
పుటుక్కున రాలిపడే పూలలా
ఒకటో రెండో “hey, what’s up?”లు తప్ప
ఉదయానికి సాయంత్రానికి మధ్యన పెద్దగా ఏమీ జరగదు.
ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔటో
లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔటో
బబుల్ సార్టో
Heap సార్టో…
ఏ వరుసా లేకుండా
పిలిచినా పిలవకపోయినా
నిక్కి చూసే జ్ఞాపకాల algorithm లో
variable లా మారిపోయి…
పరిచయమున్న పరిమళాల మధ్య
interface లేని package లా
program కి program కి మధ్య సిగరెట్ లా dispose అవుతూ…
ఎమోషన్ కి ENTER Key కి మధ్య సయోధ్య కుదిర్చి
Mouse ను చేయిజారిపోకుండా పట్టుకుని
void Life(){} ని private గా implement చేసుకోవడం తప్ప…
ఇక్కడ
ఉదయానికి సాయంత్రానికి మధ్యన పెద్దగా ఏమీ జరగదు.
***
పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్
బావుంది రవి గారూ
Hmm.. such a sad reality
మరే… ఇదొక automation program
//Daily loop()
Login తో start అయ్యి {
Meeting లతో మోతెక్కి;
Coffee తో break ఇచ్చి ;
Logout తో end అవుతుంది }
#IT life ఒక automatic life