You have begun your journey
Flapping, flailing and tapping away
Making dreams, two or twelve a day
Of sweet tunes, voices and familiar echoes
I heard the music of your heart
A miraculous sign of life in sway
Overwhelmed! My mind runs hither and thither
Troubled as I am of this world’s ways
There shall be no mysteries left
Nothing of the world left unknown
I shall grab them all by the horns
And make them my own
For what parent would I be
Inept, indolent and forlorn
When I don’t even try to listen to
The tune our mother earth has shown
The firefly that lights up its butt
And sea turtles that carry their own hut
Intricate the dance of plant and seed
Intuition quite beyond our heed
Indus, Greek and the mighty Mayans
Of Egyptians, Mexicans and their days
Kingdoms and people of life varied
And that one French guy who drew in caves
Your growth is exceptional
But your curiosity, more so
Like an instrument newly made
Your sweet rhythm should never fade
Stories of adventures sensational
You and I will create
Of miners, sages, elephants, pirates
And a mother “irate”
You sleep on the shoulders
Of many a human great
This newness in you
History wasn’t able to replicate
There is no time left
It’s all going to fall in place
For I heard the music of your heart
A miraculous sign of life in sway.
—
పుట్టబోయే బిడ్డ తండ్రి కోణం నుంచి
తెలుగు అనుసరణ: ఎమ్. శ్రీధర్
రెక్కలెగరేసుకుంటూ, కొట్టుకుంటూ,
తట్టుకుంటూ
రెండో, పండ్రెండో తీపి రాగాలతో,
స్వరాలతో, సుపరిచితాలైన ప్రతిధ్వనులతో
తీపి కలలను సృష్టిస్తూ
నీ పయనాన్ని నువ్వు మొదలెట్టావు!
నీ గుండె చపుళ్ళ సంగీతాన్ని విన్నాన్నేను
ఒక మహాద్భుత జీవం తాలూకు గుర్తుల్ని
పసిగట్టాను
ఉప్పొంగిపోయాను! నా మనసు
ఇటునటుగా పరుగెడుతోంది
ఈ లోకపు తీరుల్ని తలచి తలచి వేసారి.
ఈ లోకంలో తెలియని రహస్యాలంటూ
ఏ కోశానా ఉండబోవిక
వాటినన్నిటిని కొమ్ముబట్టి సాధించి
నావిగా మలచుకోగలనిక
భూమి తల్లి చూపించిన రాగాల్ని
వినిపించుకోవటానికి ప్రయత్నం కూడా
చేసేందుకు అశక్తుడను, సోమరిని, అభాగ్యుడిని ఐన నేను తండ్రినై ఉండాలి!
తన పృష్ఠభాగాన్ని వెలిగించుకునే
మిణుగురూ
తమ గూళ్ళను మోసుకునే సముద్రపు
తాబేళ్ళూ
మొక్కలూ, విత్తులూ, వాటి విన్యాసాలూ,
వాటి సంక్లిష్టతా
మనమందుకోలేని వాటి అంతర్దృష్టీ
సింధు, గ్రీకు, మాయన్,
ఈజిప్షియన్, మెక్సికన్ నాగరికతలు,
అట్టి రోజులు
సామ్రాజ్యాలు, వేర్వేరు ప్రజల బ్రతుకులు
గుహల్లో చిత్రాలు గీసిన ఒకే ఒక ఫ్రెంచ్ కళాకారుడూ
అసాధారమైన నీ పెరుగుదల
అంతకుమించిన నీ ఉత్సుకత
కొత్తగా తయారుచేసిన పనిముట్టులా
నీ శ్రావ్యమైన శబ్దం అరిగిపోరాదు
నువ్వూ, నేనూ కలసి
గని కార్మికుల, తపోజ్ఞుల, ఏనుగుల, సముద్రపు చోరుల,
ఓ “కోపోద్రిక్త” తల్లి వంటి
అనన్య సామాన్య సాహసాలను సృష్టిద్దాం
నువ్వు ఎందరో గొప్ప మనుషుల
భుజాలపై నిదురపోతావు
ఈ నీ కొత్తదనాన్ని
ఏ చరిత్రా తిరిగి రాయలేదు
మరింక సమయం లేదు
అన్నీ సానుకూలంగానున్నాయి
ఎందుకంటే నీ గుండె చప్పుళ్ల సంగీతాన్ని విన్నాన్నేను
ఒక మహాద్భుత జీవం తాలూకు గుర్తుల్ని
పసిగట్టాను.
—
Add comment