Malligoda (Ganga Prasad) hails from Arsapalli, Nizamabad Zilla. He’s pursued his Bachelor’s in Telugu Literature and went ahead to do his Masters, M. Phil & PhD in the same field from Hyderabad Central University. He continued to work as Guest Faculty at Hyderabad Central University after. He’s penned several poems, lyrics and short stories too; he has also dabbled in editing books, one of which titled ‘Athadu Kesavareddy’ got immense praise.
~
if to leave one’s native is migration
mother was the first migrant
if to leave one’s home is death
mother is the first to have no condemnation
if to give jowar for rice is an exchange
mother’s life is a barter
if to work without money is slavery
everything mother does is bonded labour
the songs of pain during childbirth
who but, mother will sing?
the clot of blood that turns into a sea of milk
who but, mother could change?
the hungry pangs that scream
mother satiates with the burps of her children
the darkness that resides in her heart
mother forgets in the gentle embrace of her children
what does mother know,
apart from the abuses thrown at her by father?
what does mother know,
apart from swallowing the insults thrown her way?
cooking food,
nourishing her children,
when she remembers her loved ones,
she weeps, holding onto her saree
when her children are away from her,
she stifles her tears in her eyes
what does mother know,
apart from this?
what does mother know
but to play with her grandchildren
for a fistful of rice?
but to bury her praises in her soul?
but to bear her sons and their wives?
if to step into fire is the ultimate sacrificial test
mother is truly Sita Devi
if to bear the brunt of a mistake is the path to salvation
mother is truly the goddess of the Earth
—————————————————————————-
ఊరిడిచిపోవడం వలసైతే
అమ్మే తొలి వలసజీవి
సొంతింటిని వదలడం మరణమైతే
అమ్మే తొలి జీవచ్ఛవం
జొన్నలకు బియ్యం బదులివ్వడం మారకమైతే
అమ్మ జీవితం ఒక వస్తుమార్పిడి
పైసారాకున్నా పనిచేయడం వెట్టి అయితే
అమ్మ చేసేదంతా వెట్టిచాకిరి
మృత్యు కేకల మధ్య ప్రసవ గీతం
అమ్మతప్ప ఎవరు పాడతారు
రక్తపు మడుగును పాల సంద్రంలా
అమ్మకాకుండా వేరెవరు మారుస్తారు
తన పేగుల ఆకలి కేకలను
బిడ్డల త్రేన్పులతో చల్లార్చడం అమ్మకే సాధ్యం
తన గుండెల చీకటి ఘోషను
బిడ్డల ఆలింగనంతో మర్చిపోవడం అమ్మకు సాధనం
అమ్మకేం తెలుసు
నాన్న చేత తిట్లో, తన్నులో తినడం తప్ప
అమ్మకేం తెలుసు
అవమానాల్ని దిగమింగడం తప్ప
కలో, గంజో ఉడకబెట్టడం
బిడ్డల్ని సాది సవరించడం
తనని కన్నోళ్ళు గుర్తొచ్చినప్పుడు
కొంగడ్డం బెట్టుకుని ఏడ్వడం
తన బిడ్డలు దూరమైనప్పుడు
కన్నీళ్ళను గుడ్లలో కుక్కేసుకోవడం
తప్ప అమ్మకేం తెలుసు
అమ్మకేం తెలుసు
మనమళ్ళను, మనమరాళ్ళను ఆడించి
పట్టెడన్నం కోసం పంచన చేరడం తప్ప
ఆత్మాభిమానాన్ని అంతరాత్మలో పాతేసి
కొడుకులు, కోడళ్ళను సహించడం తప్ప
నిప్పు తాకడం అగ్ని పరీక్షయితే
అమ్మ నిత్యం సీతాదేవే
తప్పును సహించడం ధర్మమార్గమయితే
అమ్మ నిత్యం భూదేవతే
-మల్లెగోడ
The translation was done by Maithri for Chaaya Resources Centre, Hyderabad.
అనువాదం చాలా బాగా చేశారు!👌👍..,Miss.💐అభినందనలు.., అనువాద ప్రక్రియ లో మరింతగా పేరు తెచ్చుకోవాలని..దీవిస్తూ..
Really hearttouching sir…and the translation by Maithri is also wonderful…and ofcourse I really astonished to know that she is such a little girl with a great literary touch.
Thank you maithri garu. Such a beautiful translatio.
Very good poem, excellently translated!
beautiful & nice translation..
కవిత, అనువాదం రెండూ బాగున్నాయి. తెలుగు కవిత ఆసాంతం గొప్పగా అమరలేదు. చాలామట్టుకు బాగున్నా, రెండు మూడు వాక్యాలు కొంచెం బలహీనంగా ఉన్నాయి. అమ్మ కథావస్తువుగా చాలా కవితలొచ్చాయి. అమ్మను తొలి వలస జీవిగా చూపెట్టిన మొదటి కవిత ఇదేనేమో. హృదయ స్పర్శి ఈ కవిత, అమ్మను పెడిస్టల్ మీద ఎక్కించడాన్ని కాసేపు పక్కన పెడితే.
అనువాదము బాగుంది. రక్తం మడుగును బ్లడ్ క్లాట్ అనడం తప్పించి.
తనను కన్నోళ్ళు గుర్తొచ్చినపుడు
కొంగు అడ్డంబెట్టి ఏడ్వడం- ఎన్ని సార్లు ఇష్టంగ చదువుకొని కంటనీరు బెట్టానో అన్నా.అమ్మ,నాన్నల మీద కవిత్వం ఎంతో మంది రాసివుంటరో కానీ అమ్మనాన్నలమీద కవిత్వం రాయడం చాలా కష్టమని నా అభిప్రాయం.ఇది ఇంతకుముందుకు వచ్చిన అమ్మకవితలకు చాలా భిన్నమైనది.ముగింపు ఎంతో గొప్పగా వుంది.ఇంతగొప్ప కవితను అనువాదం చేసినందుకు ధన్యవాదాలు మేడం.అద్భుతమైన అనువాదం.
Excellent !
తన పేగుల ఆకలి కేకలను
బిడ్డల త్రేన్పులతో చల్లార్చడం అమ్మకే సాధ్యం
పిండాన్ని బిడ్డగా మలిచే సృష్టికర్త అమ్మ. అలాంటి ఓ అమ్మ
కన్న బిడ్డ సృజించిన కవితలో శిఖరాయమానం ఈ
పంక్తులు. కవికీ, అనువాదకురాలికీ అభినందనలు!
— వి-రాగి
Excellent poem in mothers sacrifices and greatness….Equally good translation 👌👌👌
My best wishes to both poet and translator💐💐