With my people
I can’t speak
in my own language
I can’t write
in my own language
I can’t think
in my own language
I can’t love
in my own language
Now
I am writing
in another language
I am thinking
in another language
I am viewing
through another language
Even though
you
have suppressed
for years my writing
for years my existence
for years my very breath…
Now
I am learning your language
Now
I am sharpening your language
Yes, now
I can raise slogans in your language
I can abuse too in your language
I can threaten in your language
I can oppose too in your language
Not just this
From now on
I can love all
including you in your language
You can imprison me in an anda
How can you imprison my extraordinary love?
Note: There is word play in the last two lines of the Telugu original where I use “andam” and “brahmandam”
(Translation of my poem in memory of Saibaba)
అపర ప్రేమ
–ఎమ్. శ్రీధర్
నా వాళ్ళతో
నా భాషలో పలుకలేను
నా భాషలో రాయలేను
నా భాషలో ఆలోచించలేను
నా భాషలో ప్రేమించలేను
నేనిప్పుడు పర భాషలో రాస్తున్నాను
నేనిప్పుడు పర భాషలో ఆలోచిస్తున్నాను
నేనిప్పుడు పర భాషతో చూస్తున్నాను
నువ్వు
ఏళ్ళ చెరలో నా రాతనూ
ఏళ్ల చెరలో నా ఉనికినీ
ఏళ్ల చెరలో నా ఊపిరినీ తొక్కిపట్టినా…
ఇప్పుడు పర భాషను నేర్చుకుంటున్నా
ఇప్పుడు పర భాషకు పదునుపెడుతున్నా
ఔను!
ఇప్పుడు పర భాషలో నినదించగలను
పర భాషలో నిందించనూగలను
పర భాషలో బెదిరించగలను
పర భాషలో ఎదిరించనూగలను
ఇంతే కాదు
ఇకపై
నీతో సహా అందరినీ
పర భాషలో ప్రేమించనూగలను
నువ్వు నన్ను అండంలో బంధించగలవు
నా బ్రహ్మాండ ప్రేమనెలా బంధించగలవు!
(Published in my poetry collection, Neneppudoo Inte, Hyderabad: Chaya Publications, 2022, pp.70-71.)
Add comment