Telugu: Mandarapu Hymavathi
Whether the sky has gracefully
Leaned over the ocean in embrace,
Or, the overwhelmed ocean has extended
Its tidal hands to hug the firmament!
What a glorious confluence of the oceans!
A melodic tribute to the universal man
With no bars and barriers!
A boundless excitement of joy!
A vast astounding expanse of dark blue waters!
Lashing his fiery whip all through the day
And suffering people exude streams of sweat,
By the turn of the day
The senile sun, devoid of all his vigour
Lands on his death-bed
Like the legendary old man of Kuru dynasty
Committed to the bed of arrows
relinquishing his arms and his fight.
As my body turns to two eager eyes
I quench my thirst for beauty
Gluing to the occidental horizon
Where, like a beauty spot
On the face of the azure sky,
Like a ball of red, children play,
Like a pot of yummy ice-cream,
There unfolds an everchanging
Colourful spectrum of the dithering disc.
There is red … inevitable at birth!
There is red … inexorable at death!
There is red on the crests of tide
There is a wash of red on people around.
In these blissful moments of
All pervading scarlet milieu
The orb of the sun
Gently melts away
Like
An orange peel in my hand.
*
మరణశయ్య
అంబరమే ఒయ్యారంగా వాలి
సముద్రాన్ని ఆలింగనం చేసికొందా
సముద్రమే పరవశించి అలల హస్తాలతో
ఆకాశాన్ని అక్కున చేర్చుకొందా
మూడు సాగరాల మహాద్భుత సంగమం
సరిహద్దులు విభజనలేని
విశ్వమానవతా గీతం
అనంతానంత ఆనంద సంభ్రమం
వినీల విభ్రమ నీలివర్ణమోహార్ణవం
పగలంతా నిప్పుల కొరడాలు ఝళిపించి
ప్రాణికోటి శరీరాల స్వేద వాహినులు పారించి
సాయంకాలమయేసరికి
రక్తంచల్లారిన వృద్ధాప్య సూర్యుడు
అస్త్రసన్యాసమొనరించి
అంపశయ్యను అధివసించిన
కురుపితామహునిలా
మరణశయ్యను ఆశ్రయిస్తాడు.
ఆకాశం ముఖపత్రమ్మీద
అందమైన శీర్షికలా
పిల్లలాడుకునే ఎర్రనిబంతిలా
చల్లని ఐస్ క్రీం కుండలా
పడమటిదిక్కు ఆవిష్కరించే
క్షణక్షణ వినూత్న సూర్యచిత్రాన్ని
దేహమంతా రెండు నేత్రాల దోసిళ్ళై
సౌందర్యదాహాన్ని తీర్చుకుంటాను
జననంలోనూ తప్పని ఎరుపు
మరణంలోనూ తప్పని ఎరుపు
అలలమీదెరుపు
జనం మీదెరుపు
సర్వం రక్తవర్ణమయమైన
ఒక ఆలౌకిక అనంతక్షణాల్లో
క్షణక్షణం అదృశ్యమయ్యే
అద్భుత సూర్యబింబం
చూస్తుండగానే
అరచేతిలో మాయమైన నారింజకాయ
ఆఖరితొన వైనం.
.
(ఆదివారం ఆంధ్రప్రభ 25, మార్చి 2001)
మందరపు హైమవతి “నిషిద్ధాక్షరి” నుండి
Add comment