గుర్రపు డెక్కల అడుగుల్లో
నిలిచిన నీళ్ళల్లో చంద్రుడు
గుర్రం కదలగానే చెదిరింది
చంద్రుడి నీడ.
దేశికాచారి బీచ్ లో నడుస్తూ
అంతకుముందు మాట్లాడిన
మాటలకు నవ్వు ముఖం,
జవాబుగా.
సుందరం గాడి అమ్మ పెట్టింది
అప్పం
కింద కాస్త మాడింది,
శివుడిచేతిలో పెట్టిన
అప్పం.
చదువులో వివక్షతకు గుర్తా?
రాత్రి కాగానే చిమ్మెటలూ కప్పలూ
ఒకటే రొద.
రాత్రి బయటికొచ్చి పోస్తాడు
మూత్రం
కాస్సేపు ఆ శబ్దానికి
నిశ్శబ్దం.
మళ్ళీ మొదలూ చిమ్మెటలూ కప్పలూ
ఒకటే రొద.
బయటినుంచి పడుతున్న
ఎండని
వడగడుతున్నది, కిటికీ!
*మినీ కథలకి తరగని గని పూడూరి రాజిరెడ్డి కి కృతజ్ఞతలతో
చిత్రం: తిలక్
Add comment