As an editor, creative and complex poet, Devipriya has published nine volumes of poetry and his collection ‘Gaali Rangu’ won the Kendra Sahitya Academy Award. Apart from being a creative writer, he is a creative director. Devipriya’s poetry is known for its variety of thought and peculiar and complex style of expression.
Telugu original: Devipriya
Translation: Vijay Koganti
A Wintry Night
~
The unexamined life is not worth living – Socrates
Even when you lie wrapping yourself
Under a very soft half an inch thick woolen rug cozily
you cannot sleep
When the thought of people
Struggling on the snowy wet floor of roads at Eleven degrees celsius
Pulling the movie posters and thrown out gunny bags on to themselves
Comes to your mind
You fail to sleep and your eyelids do not come closer
Even when you roll on the bed
With the softest velvet pillow pressing on to your cheek
When the distant destination of the dream for the red star studded galaxies of those undespaired warriors
Who struggle under the shriveled green canopies of trees in the chilly air and snow drenched forests
Embracing the cold guns as fire
In the tents of plastic sheets
Moves before your eyes.
In a community
Where you are taught not to question but only listen to
In a society where the lighting of a bonfire is a crime amidst
darkness of controlled thoughts for ages together
In the context of our own protective soldiers start fighting everyday
Within the borders of our country with us directly
How can our eyes sleep in any season
When they are worrying and when they are pierced by questions?
A Sprout of Hope
~
Don’t know who will be lost and where
Don’t know who on what equatorial line
Will vanish when and why
Don’t know when our home will burn down to ashes without any trace
‘Cause of a thunderbolt without any thunder and lightening
Don’t know which happily flowing river
Will freeze when and how and will get static where
Not at all known even to sages and seers
Anything about what the arriving moment is going to do
Even he who is emaciated
Beneath The Great Pipal
Should get suffocated in the ocean of ignorance
Even a great swimmer
Should prostrate and sink down in front of the miracle of that Winner
When the tide surges up and surrounds suddenly like a python
A sprout of hope
Is your final assurance
Either to crawl on the floor
Or to float on the water
Or to fly in the air
That alone is your final remnant help.
Magic
~
I will make the brook stand vertically tall
Will make the fire burn with water
Will make the elephant walk on the trunk
Will make the Everest flat like a cake and
Will also make something else that can’t be done by others
I will paint the wind with colours….!
(దేవిప్రియ ‘ఇంకొకప్పుడు’ నుంచీ రెండు కవితలు)
చలిరాత్రి
***
The unexamined life is not worth living – Socrates
అర అంగుళం మందమున్న
అతి మెత్తని ఉన్ని దుప్పటి కప్పుకుని
నులివెచ్చగా పడుకున్నా నిద్రపట్టదు,
వీధుల్లో సినీమా పోస్టర్లు, గొనె సంచులూ
పైకి లాక్కుంటూ పదకొండు డిగ్రీల చలిలో
మంచుతదినేల మీద తన్నుకు లాడుతున్న
మనుషుల ఆలోచన వచ్చినప్పుడు
మృదు ముఖమల్ దిండుని చెంపకి
హత్తుకుని అటూ ఇటూ ఎంతసేపు
పోర్లాడినా నిద్రరాదు; రెప్పలు అటుక్కుపోవు,
మంచు తడిపిన అరణ్యాలలో చలిలో
ముడుచుకున్న హరిత వృక్ష మండపాల కింద
ప్లాస్టిక్ పరదాల గుడారాలలో
చల్లపడిన తుపాకులను కవోష్ణoగా
కుగాలించుకుని అరుణ నక్షత్ర మండలాలని
స్వప్నిస్తున్న నిరాశ తెలియని వీరుల
సుదూర గమ్యం కళ్ళముందు కదలాడినప్పుడు ,
పాఠo వినడమే తప్ప
ప్రశ్నలడగడం నేర్పని సమూహంలో
యుగయుగాల నియంత్రిత యోచనల చీకట్లలో
నెగళ్లు వెలిగించడం నేరమౌతున్న సమాజంలో
దేశపు సరిహద్దులలోపలె మన భద్రతా బలగాలు
మనతోనే నిత్య ప్రత్యక్ష యుద్ధాలకి దిగుతున్న సందర్భంలో
కలవరపడుతున్న కళ్ళకి , ప్రశ్నలు గుచ్చుకుంటున్న
కళ్ళకి నిద్ర ఎలా పడుతుంది ఏ రుతువులోనైనా?
చిగురాశ
~
ఎవరు ఎక్కడ తప్పిపోటారో తెలియదు;
ఎవరు ఏ భూమధ్య రేఖ మీద
ఎప్పుడూ ఎందుకు మాయమై పోతారో తెలియదు,
మన ఇల్లు ఎప్పుడు ఉరుములు మెరుపులు లేని పిడుగుపడి
నామరూపాలు లేకుండా భాస్మి పతలమిపోతుందో తెలియదు,
గలగలా ప్రవహిస్తున్న ఏ నది ఎప్పుడు
ఎట్లా గడ్డకట్టుకు పోయి ఎక్కడ నిశ్చేష్ట మవుతుందో తెలియదు,
మహాద్రష్టలకీ, మహా జ్ఞానులకీ కూడా
రానున్న క్షణం ఏమి చేయబోతున్నదో అస్సలు తెలియదు,
మహాబోధి కిందఎముకలు బయటకు వచ్చినవాడు కూడా
తిమిరసముద్రంలో పడి ఊపిరాడక తన్నుకులాదవలసిందే ,
ఉన్నట్టుండి ఏరు పొంగి వచ్చి కొండచిలువలా
చుట్టుముట్టినప్పుడు గజఈతగాడైనా
జగజ్జేత మిత్తి ముందు మొక్కి మునిగిపోవలసిందే;
చిగురాస ఒక్కటే నీకు
చివరి భరోసా,
నేలమీద పాకడానికైనా
నీటిమీద తేలడానికైనా
గాలిలో ఎగరడానికైనా
అదే నీకు మిగిలిన ఆఖరి ఆసరా
గారడి
(‘గాలిరంగు’ నుంచీ)
ఏటిని నిట్టనిలువునా నిలబెడతా
నిప్పుని నీతితో మండిస్తా
ఏనుగుని తొండం మీద నడిపిస్తా
ఎవరెస్టుని చపాతీలా చదును చేస్తా
ఎవరూ చేయలేనిది ఇంకొకటి కూడా చేస్తా
నేను గాలికి రంగులేస్తా ….!
~ ~ ~
Photo by jean louis mazieres on Foter.com / CC BY-NC-SA
Add comment