యాడ‌న్నా నాటుకోళ్లు, కోడిపిల్ల‌లు, పిల్ల‌ల కోళ్లు క‌న‌ప‌డ‌తే..

రాయ‌ల‌సీమ ప‌ల్లెల్లో మేం పిల్ల‌ప్పుడు మంచికాలం ఉండ్య‌.

ధ‌ర్మంగా ఉంటాన్యారు పెద్దోళ్లు. ఎవురి జోగా ఆక్ర‌మించుకోవాల‌నే పాడుబుద్ధి ఉండేదికాదు. మాట‌కు ఇలవ ఇచ్చాన్యారు. ఎవురి ప‌నులు వాళ్లు చేసుకుంటాన్యారు. ర‌గ‌డ‌లు, రాజ్యంత్రాలు ఉన్యా.. త‌క్క‌వ ఉంటాండ్య‌. ఒక రైతు ఒక‌రి చేన్లోకి ప‌నికి పోయినాక .. మ‌ళ్ల మ‌ర్స‌నాడు ఇత‌గాని చేన్లోకి అవుత‌లోళ్లు ప‌నికొచ్చేవాళ్లు. అట్ల అంతా ఒక‌రికొక‌రు క‌ల్చిమెల్చి ప‌నులు చేసుకుంటాన్యారు.

ఒక‌నాడు మైటాల‌పూట నేనూ, మాయ‌మ్మ వ‌డ్డివాళ్లింటికాడికి పోయినాం.

‘ఒబ్బా సుబ్బులూ.. కోడి స‌రివాళ్ల‌కు ఇచ్చామంటివే’ అన్యాది మాయ‌మ్మ. ఆయ‌క్క గోళంలో పొదిగిన తెల్ల‌కోడి పెట్ట‌ను, ప‌దకొండు కోడిపిల్ల‌ల‌ను తీస‌క‌పోండ‌న్యాది. కోడి ద‌గ్గ‌ర‌కి పోతానే.. క్కొక్కొ అంటా ముక్కు తిప్పినాది పొడ్చ‌టానికి.  కోడిగుడ్ల‌ను  రెక్క‌ల్లో దాపెట్టుకున్యాది. ఆయ‌క్క కోడిని ప‌ట్టుకోని మాయ‌మ్మ‌కు ఇచ్చినాది. కోడి ఒక‌మైనా క్కోక్కో అని అర్చినాది.  ప‌ద‌హారు కోడి గుడ్ల‌ను గుడ్డచిత్తిలో ఏసిచ్చినారు. కోడిపిల్ల‌లు ఎన్ని బ‌తికినా చెరిసొగం అన్యాది వ‌డ్డివాళ్లాయిక్క‌. అట్ల పిల్ల‌ల కోడిని ఇయ్య‌టాన్ని స‌రివాళ్లు అంటార‌ని ఆ పొద్దు తెల్చింది. ఇంటికొచ్చినాక గోళంలో ఇస‌క తెమ్మ‌న్యాది మాయ‌మ్మ‌. తెచ్చినా.  ముందు మూడు కోడిగుడ్ల‌ను గోళం చుట్టు తిప్పి గూగూడు కులాయిసోమిని ముక్కోని ‘సోమి .. ఈ కోడి పిల్ల‌లు బాగా లేపాల‌. అన్ని బ‌త‌కాల‌’ అని గోళం మింద ఇస‌క‌లో మెల్ల‌గా పెట్ట‌మ‌న్యాది. ఆ త‌ర్వాత మాయ‌మ్మ మిగ‌తా ప‌ద‌మూడు కోడిగుడ్ల‌ను పెట్టినాది. కోడిని కుడినుంచి ఎడ‌మ‌ప‌క్క‌కు మూడుచుట్లు తిప్పినాది. మా కులాయ‌సోమిని ముక్కున్యాది. గోళంమింద కూచ్చోబెట్నాది.  దానికి గడ్డి గంప‌ మూసిపెట్నాది‌. మా నాయిన వ‌చ్చినాక ‘ఔ.. వ‌డ్డివాళ్ల సుబ్బులు ఇంటికాడ‌నుంచి స‌రివాళ్ల‌కు పొదిగిన కోడి తెచ్చినా’ అన్యాది. ‘ఏంటికి కోడిపియ్య ఎత్తిపోసుకోటానికా’ అని న‌సిగినాడు మా నాయిన‌.

నాలుగో త‌ర‌గ‌తి అప్పుడు స‌రివాళ్ల‌కు తెచ్చుకున్న ఆ పిల్ల‌ల కోడిని బాగా చూసుకోమ‌న్యాది మాయ‌మ్మ‌. సూచ్చాండంగానే కోడిగుడ్డులోంచి ముక్కుతో పొడుచ్చా పిల్లలు బ‌య‌టికొచ్చాంటే నేను, మా చెల్లెలు ఎంత‌గా సంబ‌ర‌ప‌డినామో. ప‌ది పిల్ల‌లు లేపినాది.  పిల్ల‌ల‌కోడి రోజూ ప‌ద్ద‌న లేచ్చానే.. మా ఇంటి ఎదురుగా ఉండే మంగ‌లోళ్ల తిరుపాలు యాప‌మానుకాడ‌నో, ప‌ర‌తోట‌లోని కంప‌ల్లోకో, కుంటితిక్కో పోతాన్యాది. దిబ్బ‌ల్లోకి పోయి చిదుక్కోని పిల్ల‌ల‌ను ఇంటికి తొల‌క‌చ్చాండ్య. ఇంటికొచ్చినాక చిన్న రాతి తొట్టిలోని నీళ్లో, ప‌ళ్లెంలోనో నీళ్లు తాగేది. పదిపిల్ల‌లు నీళ్లు తాగుతాండ్య‌. పిల్ల‌ల‌కోడిని సూచ్చానే కొట్రీ ఇంట్లోకి పోయి.. ఇన్ని బియ్య‌మో, జొన్న‌లో పిరికెడుతో తీస‌క‌చ్చి పోచ్చాంటి. కొక్కొక్కో అంట ప్రేమ‌తో పిల్ల‌ల‌కు తినిపిచ్చేది కోడ‌మ్మ‌. పైన గ‌ద్ద‌లో, కాకులో ఎగుర్తాంటే కోకోకో.. అంటా పిల్ల‌లను త‌న రెక్క‌ల‌కిందికి ర‌మ్మ‌ని అర్చి.. నేల‌మింద మోకాళ్లు వ‌చ్చి కూచ్చోని త‌న రెండు రెక్క‌లు గుబురుగా చేసి.. క‌డులో పెట్టుకోని దాపెట్టుకుంటాండ్య పిల్ల‌ల‌కోడి. కోడిపిల్ల ప‌ట్టుకోడానికి పోతే ముక్కుతో పొడ్చ‌టానికి మిందికి ఎగుర్తాండ‌. గాటిపాట ఉండే ఎన‌మ‌ల‌మిందికి పొడ్చ‌డానికి పోతాండ‌. గ‌య్యాళి నాకొడుకుదిరా పిల్ల‌ల‌కోడి అంటాండ్య మాయ‌మ్మ‌.

ప‌‌ర‌తోట‌లోకి పోతే గ‌ద్ద‌లు, పిల్లులు, కాకులు, ముంగీస‌ల భ‌య్యం కోడికి ఉంటాండ‌. అయినా పోతాండ్య‌. బ‌త‌కాల క‌దా. ఒక‌రోజు కోడి మానుకింద సిదుక్కుంటాంది ప‌ద్ద‌న్నే. నా కండ్ల‌ముందే సూచ్చాండ‌గానే గ‌ద్ద వ‌చ్చి ఓ కోడిపిల్ల‌ను కాలితో ఎత్త‌క‌పోయినాది. నేను ఎంట‌బ‌న్యా, కోడి గాళ్లోకి ఎగిరినా.. పిల్ల‌ను కాపాడుకోలాక పోయినాం. కోడి, పిల్ల‌లు ఇంట్లోకి వ‌చ్చి దాక్కున్యాయి. ఒక‌రోజు కాన్వెంటుకు పోయి వ‌చ్చానే రెండు కోడిపిల్ల‌లు గాటిపాట ఉండే గంజుగుంత నీళ్ల‌లో మునిగి స‌చ్చిపోయినాయి. ఒక‌రోజు బ‌య‌టికి పోయినాక ఆరు పిల్ల‌ల‌తోనే కోడి ఇంటికొచ్చినాది. ఏ పిల్లి నా చ‌వితి తిన్యాదో కోడిపిల్ల‌ను అన్యాది మాయ‌మ్మ‌. కొందురు మాతో స‌రిపోనోళ్లు,  కోళ్లు దిబ్బ‌ల్లో చిదుగుతాంటే రాళ్ల‌తో కూడా కొట్టేవారు మేం లేంది చూసి. ఆరు కోడిపిల్ల‌ల్లో రెండు పుంజుకోడిపిల్ల‌లు, నాలుగు పెట్ట‌యి. అయ్యి మైటాల పూట క‌సువు దొబ్బినాక ఇంటికి వ‌చ్చాన్యాయి.  పుంజు పిల్ల‌లు కొట్లాడ‌తాంటే చూడ ముచ్చ‌ట‌గా ఉంటాండ్య‌. ఎర్ర‌, న‌ల్ల పుంజుకోడి పిల్ల‌లు నెత్తిమింద ఎర్ర‌తోలు బిగిచ్చి, మెడ‌మింద ఉండే ఎంట్రిక‌లు నిక్క‌బొడుచోని కొట్లాడేయి. రోంత సేపు పొడ్చుకునేయి. ఆరిట్లో ఒక పెట్ట‌పిల్ల‌ను ఒక‌నాడు తెల్లార్జామున వ‌సార్లోని అరుగుమింద‌కు వ‌చ్చి పిల్లి ప‌ట్ట‌క‌పోయినాది. ఇయ్య‌న్నా బ‌తుకుతాయో లేదో ఇట్ల స‌ల‌ప‌డినాయి పిల్లులు అని మాయ‌మ్మ బాధ‌ప‌డింది. ఐదు ఎడ‌పిల్ల‌ల్లో ఒక‌దానికి దెబ్బ‌త‌గిలినాది. అట్ల‌ రెండు పుంజులు,  మూడు పెట్టలు నిల‌బ‌డినాయి. పెద్ద తెల్ల‌కోడి గుడ్ల‌కొచ్చింది. దాని పిల్ల‌లు గుడ్లకొచ్చినాయి. వసార్లోని రెండు గూళ్ల‌ల్లో, బొగ్గ‌ల‌గూటికాడ‌, పంచ‌గూళ్ల‌ల్లో, కొట్రీ ఇంట్లో ఉండే బువ్వ బుట్టిలో, సంచ‌ల‌మింద‌, గోళంలో.. యాడంటే ఆడ పెట్ట‌కోళ్లు ముడిగేయి. గ‌బ‌క్క‌ని గుడ్డు పెట్టి పోతాన్యాయి. గుడ్డు పెట్నాక యా గుడ్డు యాకోడిదో మ‌తికి పెట్టుకోని జొన్న‌ల డ‌బ్బాలోనో, రాగుల త‌పేలాలోనో, ప్లాస్టీకు బ‌క్కెట్లోనో గ్యాప‌కంగా పైటాల‌పూట దాపెడ్తాంటి.

నాలుగు పెట్ట‌కోళ్లూ పైటాల పూట బువ్వ‌కొచ్చిన‌ప్పుడే అనిగేవి. యాడ‌యినా గుడ్లు పెడ్తాండ‌. గుడ్లకోడి కొక్కొక్కో.. మంటా ఒక‌చాట‌నే నిల‌బ‌డ‌ట‌మో, గూళ్లు ఎతుక్కోవ‌డ‌మో, చాటు చూసుకోవ‌ట‌మే చేచ్చాండ‌. గుడ్ల‌కని క‌నుక్కోవాల‌ని మాయ‌మ్మ చెప్పినాది. అట్ల నేను క‌నిపెడ్తాంటి. మ‌ధ్యానం ప‌న్నెండు దాటినాక‌నే గుడ్లు పెట్టేయి. గుడ్లు ఎట్ల పెడ‌తాయో చూడ‌ల్ల‌ని కాచుకోని కూచ్చుంటాంటి.. గూటికి ఎదురుగా.  అయినా గుడ్డు పెట్ట‌క‌పోయేది. అట్ల ప‌క్క‌కు సూచ్చానే గుడ్డు పెట్టేది. గుడ్ల‌కోళ్ల‌కు తావు సూపిచ్చినా, ప‌ట్టుకోని  గంప‌కింద మూసిపెట్టినా బెరిక్క‌న గుడ్లు పెడ్తాండ‌. గంప మూసిపెట్నాక గంప బ‌క్క‌ల్లోంచి సూచ్చే కోళ్లు అరిచేవి. అట్ల ప‌క్క‌కు సూసినానో లేదో క్ష‌ణాల్లో గుడ్డు పెడ్తాండ‌.  ఎండ‌ల‌కాలం కోడిగుడ్లు గ‌బ్బుకొడ్తాయ‌నీ, పిల్ల‌లు కావ‌ని మాయ‌మ్మ అంటాండె . ఆమ్లేట్‌, గుడ్ల కురాకు సేచ్చాండ్య‌. చ‌లికాలం కోళ్లు పిల్ల‌లు బాగా లేపుతాయ‌ని అంటాన్యాది మాయ‌మ్మ‌.

ఒక‌రోజు మ‌డూరు కాడ‌నుంచి మా పెద‌నాయిన వ‌చ్చినాడు మైటాల పూట‌. ఆరోజు రేత్రి మా ఇంట్లోనే ఉన్యాడు. ప‌ద్ద‌న్నే తెల్ల‌పెట్ట‌కోడిని కోచ్చాం అని మాయ‌మ్మ‌తో మా నాయిన చెప్తాంటే ఇన్యా. నాకు బాధ‌గ‌యినాది. ప‌ద్ద‌న్నే తెల్ల‌కోడికి ఇర్సాకండి అన్యాడు మా నాయిన‌. నేను ప‌ద్ద‌న్నే నిద్ద‌ర‌లేచి అన్ని కోళ్ల‌తో పాటు తెల్ల‌కోడిని ఇడ్చినా. మా నాయిన తిట్నాడు. బ‌య‌టికి పోయి సోప‌క‌చ్చి తెల్ల‌కోడిపెట్ట‌ను ప‌ట్టుకున్యారు మాయ‌మ్మ‌, నాయినా. నేను సీలు తిన‌ను. కోళ్ల‌ను కోచ్చే మ‌హాపాపం అని అనుకుంటాంటి. మ‌నం పెంచిన కోడిని ఏంటికి కొయ్యాల అని మాయ‌మ్మ‌ను అడిగినా. అట్ల‌నుకుంటే ఎట్ల తిక్కోడా అన్యాది మాయ‌మ్మ‌. కోడిపెట్ట‌ను ప‌ట్టుకో.. హ‌లాలు సేచ్చా అన్యాడు మా నాయిన‌. నేను బ‌య‌టికి ఉరికినా ప‌ద్ద‌న్నే. బిక్కిరినాకొడుకు అన్యాడు. మ‌ల్ల లోప‌ల‌కి వ‌చ్చానే మంత్రాలు చ‌దువుకుంటా కాళ్లుచేతులూ, మ‌గం క‌ట్టుకోని బ‌య‌టికి క‌త్తి తీసుకోని వచ్చినాడు మా నాయిన‌. ఒక చేతిలో తెల్ల‌కోడి అరుచ్చాంది. బాయికాడికి రా అన్యాడు. కోడిని ప‌ట్టుకో అన్యాడు. ప‌ట్టుకున్యా. మా నాయిన ఇస‌క‌రాయి మింద సూర‌క‌త్తిని నూర‌తానాడు. కోడి ఇడ్చాల‌ని అనుకున్యా.. తిడ్తాడేమో అని ఊరుకున్యా. త‌ల‌కాయ‌కు బొచ్చు ట‌వాల చుట్టి, బీడీలు రెండు చెవ‌లకు పైన పెట్టుకున్యాడు. ‘కదా.. ‘ అని కోడిని తీసుకున్యాడు. చెవ‌ల‌కు పైన నువ్వు రెండు అగ్గిపుల్లల్లో, స‌న్న‌టి కందిపుల్ల‌లో పెట్టుకో అన్యాడు. ఏంటికీ అన్యా. శాస్త్రం అన్యాడు. కోడి రెక్క‌లు పెనేచ్చా, కాళ్లు రెక్కలు గ‌ట్టిగా ప‌ట్టుకోమ‌న్యాడు. నేను పెంచిన కోడి నెత్త‌ర  చూడ‌లేక మా నాయిన‌కు దూరంగా బ‌డితిక్కు ఉరికినా. బాయి ఎన‌కాల ఉండే గొల్లోళ్ల నాగేంద్ర‌ను పిల్చి కోడి ప‌ట్టుకోమ‌న్యాడు. నేను దూరంగ నుంచి సూచ్చాన‌. కోడినోట్లో నీళ్లు మూడుమాట్లు పోసినాడు. అంద‌రి కోళ్ల‌మాద్దిరే మా తెల్ల‌పెట్ట మింద కోడిమింద సూర‌క‌త్తితో అట్ల‌ని హ‌లాల్ చేసినాడు. హ‌లాల్ చేసినాక కోడిని రోంత సేపు దిబ్బ‌తిక్కు ఇసిరేసినాడు. అది క్వాక్ క్వాక్ అంటా కొట్ట‌కలాడింది. నా గుండెకాయ ప‌గిలిపోయినాది. నేను ఏడ్చినా. చ‌క్కా ను పైకెత్తి కండ్ల నీళ్లు తుడ్చుకుంటా.. మాయ‌మ్మ కాడికి పోయినా. తిక్కోడా.. కోళ్లు కోచ్చే ఏడుచ్చారా అన్యాది. మా నాయిన గ‌బ‌గ‌బా బొచ్చుపీకి, కాల్చి.. కోసినాడు. క‌త్తితో పొట్ట‌కోసి గుడ్లు లోప‌ల ఉండాయి అన్యాడు మాయ‌మ్మ‌తో. ఆ పొద్దు మాయ‌మ్మ పూరీలు చేసినాది కోడిసీల‌ల్లోకి. నేను సీలు తిన‌ను. అందుకే పొప్పు చేసినాది. ఆ రోజు రేత్తిరి నాకు నిద్ద‌ర ప‌ట్టలా. ‘చంపేదెవ‌రూ చంపించేదెవ‌రూ.. ఆ న‌ర‌నారాయ‌ణుడే’ అనే బుక్కులోని మాట గుర్తొచ్చినాది. ఎల్ల‌దిరిగి ప‌డుకున్యా. గ‌ట్టిగా క‌ళ్లు మూసుకున్యా.

ఒక పిల్ల‌ల‌కోడిని వ‌డ్డివాళ్ల‌కు ఇచ్చి వ‌చ్చినాం. దానికి ఎనిమిది పిల్లలు ఉండ్య‌. సూచ్చాండంగానే మా ఇంట్లో కోళ్లు పెంప‌క‌మ‌యినాయి. పైటాల గుడ్ల‌కోళ్ల అరుపులుంటాండ్య‌‌. పైటా‌ల ఎండ‌కు అన్నీ ఒక‌పారే వ‌చ్చి ఇంట్లో యాడంటే ఆడ కోడిపియ్య ఏరుగుతాండ‌. కోడిపియ్య వాస‌న‌కొడ్తాంటే ఈగ‌లు వాలేవి. పాత‌గుడ్డ‌నో, కాళ్ల‌కింద సంచి ప‌ట్ట‌నో తీసుకోని కోడిపియ్య తుడుచ్చాండ మాయ‌మ్మ‌. బువ్వ తినేప్పుడు కోళ్లు ఎదురూగా వ‌చ్చి కోడిపియ్య ఏరిగేవి. మాయ‌మ్మ బూచేత్తో అట్ల‌నే పోయి.. ఎడ‌మ చేత్తో కోడిపియ్య తుడుచ్చాండ‌. ఇంట్లో మంచాల‌మింద‌, ప‌రుపుల మింద కోడిపియ్య ఉంటాండ్య‌. కోడిపియ్య‌‌తో రోత ల్యాకుండా ఇండ్లు చూసుకోవాల, తుడ్చుకోవాల‌ అనేది మాయ‌మ్మ‌. కోడిపియ్య ఏరుగుతాయ‌ని కోళ్ల‌ను ఒక‌నాడు బైటికి తోలినా. అట్ల చేయ‌ద్దు. మ‌న‌కోళ్లు.. మ‌న ఇంటికే వ‌చ్చాయి. పాపం.. మాట‌లు రాని కోళ్ల‌ను కొడితే ఎట్లా. కోళ్ల‌న్యాక గ‌బ్బే అన్యాది మాయ‌మ్మ‌. దాన్ల‌ను బ‌త‌కనియ్యాల‌. అప్పుడు నాకు బుద్దొచ్చినాది. ఆ పొద్దునుంచి కోళ్ల‌ను బాగా చూసుకున్యా.

కోళ్లు, కోడిపిల్ల‌లు అరుపులు, పుంజుకోడి కొట్లాట‌ల‌తో ఇళ్లంతా సంద‌డిగా ఉంటాండ్య మైటాల‌పూట‌. బియ్య‌మో, జొన్న‌లో త‌ట్ట‌లో తెచ్చి చ‌ల్లుతాంటి. ప్ప్ప‌ప్ప‌… అంటా అరిచ్చే కోళ్లు, కోడిపిల్ల‌లు ప‌రిగిత్తుకుంటూ వ‌చ్చాన్యాయి. తినేయి. తిన్యాక ఎన‌మ‌ల తొట్టికాడికి పోయి పెద్ద‌కోళ్లు, చిన్న‌పిల్ల‌లు ప‌ళ్లెంలో నీళ్లు తాగుతాండ్య‌. పొద్దుకునిగేట‌ప్పుడు ఎన‌మ‌ల కొట్టం మింద కోళ్లు వాలేవి. కొన్ని గోడ‌లు ఎక్కి కుంప‌ట్లో ఉండే కుసుమారి, క‌ప్రిల్లాకు మొక్క‌ల్లో ఉండే చిన్న‌ పురుగులు తినేయి. కొన్ని కోళ్లు మిద్దెక్కేయి. అన్నీ సోపి గంప‌ల‌కింద‌, గూళ్ల‌లో మూసిపెడ్తాంటి. సూచ్చాండంగానే ఇర‌వై కోళ్లు పైన అయినాయి. కోడిపిల్ల‌ల‌ను గ‌ద్ద‌లో, ముంగిస‌లో, పిల్లులో, కాకులో ఎత్త‌క‌పోతాండ‌. కొన్ని పిల్ల‌లు గంజుగుంత‌లో ప‌డి స‌చ్చిపోతాండ్య‌. ఎంత బ‌తికిచ్చుకుందామ‌న్య కోడికి ఇర‌వై పిల్ల‌లున్యా.. మూడు, నాలుగు పిల్ల‌లు బ‌తికియ్య‌డం గొప్ప‌. బంధువులొచ్చిన‌ప్పుడు మా నాయిన ఏదో ఒక కోడి కోచ్చాండ‌. తెల్లార్జామున అడివి పిల్లిలు ఇంట్లోకొచ్చి ఎత్త‌క‌పోతాయ‌ని మేం నిద్ద‌ర‌పోయే నుల‌క‌మంచాల‌కింద కోళ్ల‌ను మూసిపెట్టేవాళ్లం. ఈ పిల్లిల‌తో బ‌త‌క‌లేమురా అంటాండ్య మాయ‌మ్మ‌. నుల‌కమంచం కాడ‌నే పంగ‌ల‌క‌ట్ట‌నో, ముల్ల‌బ‌ర్ర‌నో పెట్టుకోని నిద్ద‌ర‌పోతాంటిమి.

నాది నాలుగో త‌ర‌గ‌తి, ఐదో త‌ర‌గ‌తి, ఆరో త‌ర‌గ‌తి అయిపోయినాది. అయినా మా నాయిన  ‘కోళ్లు గ‌బ్బునాకొడుకుయి, ఏరుగుతాయి’ అంటాన్యాడు. నీకేమ‌న్నా అడ్డ‌మొచ్చినాయా.. ఓరుకుండ‌రాదూ అని మాయ‌మ్మ గ‌దిరిచ్చుకుంటాండ్య‌. నువ్వు పెంచ‌లేదులే.. నీ ప‌నికి నువ్వుపో అంటాండ్య మాయ‌మ్మ‌. వాన‌పడినా,చుట్టాలొచ్చినా కోళ్ల‌ను కోచ్చాండ‌. ఎవురిక‌న్నా అమ్ముతాండ్య‌. కోడిని కొయ్య‌టానికి రెక్కలు ప‌ట్టుకోమంటే నేను ఒక్క‌సారి కూడా ప‌ట్టుకోకుండా ప‌రిగెత్తాంటి. అందుకే మా నాయిన ఆ ప‌ని చెప్ప‌టం మానుకున్యాడు. కోళ్లు చానా మంచియి. పిలిచ్చే ప‌లుకుతాయి. కోళ్ల‌ను పొదిగించ‌టానికి గోళంలో, గంప‌లో ఇస‌క తీస‌క‌చ్చేవాణ్ణి. నేనే పొదిగిచ్చేవాణ్ణి. ఎండ‌ల‌కాలం గుడ్లు చెడిపోతాయ‌ని ఆమ్లెట్లో, ఉడ‌కేయ‌మ‌నో మాయ‌మ్మ‌ను పోరు పెడ్తాంటి.

మూడు, నాలుగేళ్ల‌లో చానా కోళ్ల‌ను చూసినా. ఐదో త‌ర‌గ‌తిలో నా మాట ఇనే పుంజుకోడి అంటే నాకు బాగా ఇష్టం. ఎర్ర‌పుంజుకోడి లావుగా, బ‌లంగా, ఎత్తుగా అయినాది సూచ్చాండంగానే. అది పిల్ల‌ప్పుడి నుంచి నన్ను సూచ్చానే ప‌రిగెత్తుకోని వ‌చ్చేది. నా చేతిమిందికి ఎక్కేది. బుజం మింద ఎక్కేది. ఎందుకో నేనంటే బాగా నెర్లు దానికి. ఆ పుంజుకోడిని కొయ్యాల‌నుకోంటే మా నాయిన‌తో కొట్లాడినా. మా నాయిన రెండేట్లు పీకినాడు. పెట్ట‌కోడిని కోసినాడు కానీ నా పుంజుకోడిని ఏమ‌న‌ల‌. ఆరో త‌ర‌గ‌తిలో అనుకుంటా.. బాగా ఎండ‌ల‌కాలం. కోళ్ల‌కు బియ్యం ఎయ్యాకు బియ్యం తెగులొచ్చాది అని మాయ‌మ్మ అన్యాది. బియ్యం తింటే మ‌నం బ‌తుకుతాం.. దాన్ల‌కు ఏమీ కాదుమా అని తెల్చినోడి మాద్దిరి చెప్తాంటి మాయ‌మ్మ‌కు. తాత‌కే ద‌గ్గులు నేర్పియ్యాకు అనేది మాయ‌మ్మ‌. ఎండ‌బెట్ట మ‌న‌మాద్దిరే కోళ్ల‌కు కొడ్తాయి అనేది మాయ‌మ్మ‌. ఎప్పుడ‌న్నా కోళ్లు అట్ల‌నే కింద ప‌డి కొట్ట‌క‌లాడేయి. మా నాయిన ఇంట్లో ఉంటే దాన్ల‌ను హ‌లాలు సేచ్చాండ‌!

ఒక రోజు మామూలుగానే బ‌డికి పోయినా. మైటాల మూడున్న‌ర అయితాంది. డ్రిల్లు కాసుకు పోవాల్ల‌. బ‌డిబెల్లు కొట్టే మా ర‌సూల‌వ్వ నా ద‌గ్గ‌రికొచ్చినాది. ‘రాజావ‌లి.. మీయ‌మ్మ పిలుచ్చాంది. బెరీన పోవాలంట బుక్కులు తీసుకోని’ అన్యాది. నేను సంతోషంగా ఇంటికి ప‌రిగెత్తినా. ఇంటికి పోతానే వాకిలికాడ ఇద్దురు దావుంటిపోయేవాళ్లు, ప‌క్కింటి గొళ్లోల్లాయ‌క్క సూచ్చాంది. గాటిపాట కాడ మా పెద్ద పుంజుకోడి కొట్ట‌క‌లాడ‌తాంది. క్వాక్ క్వాక్ అంటాంటే నోట్లోంచి జొల్లుమాద్దిరి నీళ్లు కార్తానాయి. కండ్లు  గ‌ట్టిగా ఆర్పుతాంది. ముక్కులోంచి నాలిక బ‌య‌ట‌కి ఎల్ల‌పొడుచ్చాంది పుంజుకోడి. అంత పుంజుకోడి రెక్క‌లు కొడ్తాంటే.. మాయ‌మ్మ ఏడ్చినాది. నాకూ ఏడుపొచ్చింది. తెగులొచ్చింది. ఎట్లా స‌చ్చిపోతాది. గొల్లోళ్ల నాగేంద్రను పిల్చ‌మ‌న్యాది. ఆయ‌బ్బి వ‌చ్చినాడు. ‘ఒషీ.. మావాడికి సైక‌లు రాదు. అడ్డ‌పెడ‌లొచ్చాది. నువ్వు సైక‌లు తొక్కు. మావాడు ఎన‌క‌ల కూచ్చుంటాడు.  వీళ్ల నాయిన బాలాడ్డి గారి చేన్లోకి టాక్ట‌రు సేద్యానికి పోయినాడు. స‌చ్చిపోయ్యేలోగా హ‌లాల్ చేపిచ్చ‌మ‌’ ని అన్యాది మాయ‌మ్మ‌. ఇద్ద‌రం సైక‌లు తీసుకోని ఎల్ల‌బారేప్పుడు ఆయ‌బ్బికి వాళ్ల‌మ్మ ఏందో ప‌ని చెప్పినాది. నువ్వు పోతావా అన్యాడు. స‌రే అన్యా.

సైక‌లుకి ముందు సూర‌క‌త్తి క‌ట్టుకోన్యా.  కోడి కాళ్ల‌కు పుర‌పాస‌తో తాడు క‌ట్టుకోని దాన్ని క్యారిమింద క‌ట్టినాది మాయ‌మ్మ‌. పెద్ద సైక‌లు ఆ త‌ట్టు పెడ‌లు మింద కాలు పెట్టి అట్టనే అడ్డ‌పెడ‌లు తొక్కుకుంటా పోయినా. బెరిక్క‌న మా నాయిన్ను ఎతుక్కుంటా పోయినా. చేను బ‌య‌ట దావ‌లో సైక‌లు ఆపి స్టాండేసి కోడి, సూర‌క‌త్తి తీసుకోని మా నాయిన ద‌గ్గ‌ర‌కు ఓన్నా.. ఓ నాయినా.. అంటా అర్సుకుంటా ప‌రిగిత్తినా.  మా నాయిన ఫ‌ర్గూస‌న్ టాక్ట‌రు ఆపినాడు.  చేతిలో క‌త్తి, కోడి చూసి అర్థ‌మైనాది మా నాయిన‌కు. గ‌బ‌క్క‌ని టాక్ట‌రు దిగి బాయిలోకి దిగి ప్లాస్టీకు డ‌బ్బీతో మ‌గం క‌డుక్కోని, చేతులు కాళ్లు అట్ట‌క‌డుక్కోని డ‌బ్బీతో నీళ్లు ముంచుకోని వ‌చ్చినాడు. కోడి పాణం పోల‌. గ‌ట్టినాకొడుకుది అన్యాడు. కోడిని ప‌ట్టుకోమ‌న్యాడు. నేనేమీ అన‌లేదు. బీడీలు చెవ‌ల‌కు ఆ తిక్కు ఈ తిక్కు పెట్టుకున్యాడు. పుల్ల‌లు పెట్టుకోనువ్వు అన్యాడు. నేను దూరంకి ప‌రిగిత్త‌లేక‌పోయినా. రెక్క‌లు గ‌ట్టిగా ప‌ట్టుకోమ‌న్యాడు. మెడ‌ను ప‌ట్టుకోని మూడుమాట్లు నీళ్లు గొంతులోకి పోసి హ‌లాల్ చేసినాడు. కోడి ర‌క్తం మ‌ట్టిపెళ్ల‌మింద ప‌డి పొగ‌రేగిన‌ట్లు అయినాది. హ‌లాల్ అయిపోయినాక‌.. మ‌ట్టిపెళ్ల‌లోకి ఏసినాడు.

అది గ‌ట్టిగా రెక్క‌లు కొట్టుకోని కొట్టుకోని కాళ్లు జాపి స‌చ్చిపోయినాది.
ఆ కోడిని సైక‌లుకు క‌ట్టుకోని ఇంటికి తెచ్చినా. పాపం పెద్ద‌కోడి అంటూ మా నాయిన ఇంటికొచ్చినాక మాయ‌మ్మ‌తో అన్యాడు. చ‌చ్చేబ‌దులు కోసుకుందామ‌ని పంపిచ్చినా. దావ‌లో పోతాద‌నుకున్యా అనింది మాయ‌మ్మ‌.
ఎందుకో ఆ పొద్దునుంచి కోళ్లను ప్రేమ‌గా పెంచ‌కూడ‌దు అనుకున్యా.
ఆ పొద్దు రాత్రి రాగిసంగ‌టిలోకి పుంజుకోడి సీలు తిన్యారు.
మా నాయిన ఎప్పుటిమాద్దిరే అరుగుమింద కూచ్చోని ఎల్ల‌నూరు మామిడికాయ బీడీ తాగినాడు. నా మ‌న‌సంతా బాలేదు. ఆ రోజు నిద్ద‌ర‌ప‌ట్ట‌లేదు. కోళ్లు ఏంటికిలేమా అని మాయ‌మ్మతో అన్యా.
కొన్నాళ్లకు పాత‌మిద్దె ప‌డ‌గొట్టి కొత్త‌గా క‌ట్టియ్యాల‌ని మాయ‌మ్మ నాయినా అనుకున్యారు.
సూచ్చాండంగానే మా నాయిన మూడు ఎనుములు.
ఏంటికి కోళ్లు.. రోత‌నాకొడుకుయి అని కోళ్ల‌ను అమ్మినాడు మా నాయిన‌. కొన్ని కోసుకోని తిన్యారు.
ముప్ఫ‌యి న‌లభై కోళ్లు ఎట్ల‌పోయినాయో నాకైతే తెల్దు.

ఇప్పుటికీ బ‌య‌టోళ్లు కోళ్ల‌ను తెచ్చే మా నాయిన హ‌లాలు సేచ్చాంటాడు. మా నాయిన‌కు ముందునుంచి ఓ గుణం ఉంది. కోళ్ల‌ను, కుందేళ్ల‌ను, పొట్టేళ్ల‌ను, బెల్ల‌గాళ్లు, పావురాల‌ను హ‌లాల్ చేసినా రూపాయి లెక్క తీసుకోడు. ఏంటికి తీసుకోవు.. టౌన్ల‌ల్లో తీసుకుంటారు అని ఓ పారి అడిగినా. నేను ఇద్య నేర్చుకున్నా. అది అమ్ముకునేది కాదు. నా పాణం పోయేంత వ‌ర‌కు లెక్క తీసుకోను అన్యాడు. ఎవుర‌న్నా లెక్క ఇచ్చే.. మా ఇంటికాడికి ఈ తూరి రావాకు అంటాడు. వాళ్లు వెంట‌నే జోబీలో ఏసుకుంటారు. జోబీలో డ‌బ్బులు లేకున్యా, అవ‌స‌ర‌మున్యా.. హ‌‌లాల్ చేయ‌డానికి మా నాయిన ఇప్పుటికీ లెక్క తీసుకోడు.

యాడ‌న్నా నాటుకోళ్లు, కోడిపిల్ల‌లు, పిల్ల‌ల కోళ్లు క‌న‌ప‌డ‌తే.. మా కోళ్లు మంచుకొచ్చాయి. ఎందుకంటే కోళ్లంటే నాకు పాణం!

*

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శానా బాగ రాశారు సర్ మీరు

    అభినందనలు

  • రాళ్లపల్లి రాజా వలి గారు రాసిన కథ నేడు సాహిత్యంలో మాండలిక భాష తో కథలు కవితలు చాలా అరుదు గా వస్తున్నాయి, సాహిత్యకారులు పరిశోధకుడు మాండలిక భాషను కాపాడుకోవడం చాలా ముఖ్యం. భావితరాలకి మాండలిక భాష అంటే ఏమిటో తెలియాలంటే ఇలాంటి రచనలు చాలా అవసరం ఉంది అని భావిస్తున్నాను, ప్రఖ్యాత రచయిత ఎగుగీ వా థియోంగో తన రచనల్లో మాండలిక భాషకు ప్రాధాన్యమిచ్చాడు. తేనెలొలుకు రాయలసీమ మాండలిక భాష, ఇతర మాండలిక భాషలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీరు రాసిన కథలో రాయలసీమ మాండలిక భాషను చాలా కళాత్మకంగా ఉపయోగించారు. పల్లె సీమ లో ఉన్న పాత తరం వయో వృద్ధులు దగ్గర మధురమైన రాయలసీమ మాండలిక పద జాలం దాగి ఉంది పరిశోధిస్తే చాలా పదజాలం బయటికి వస్తుంది. మీ కథారచనలో ఇలాగే మాండలిక భాషను కొనసాగిస్తారని ఆశిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను.

    • Rao
      July 2, 2020 at 11:12 pm
      రాళ్లపల్లి రాజా వలి గారు రాసిన కథ “‘ యాడ‌న్నా నాటుకోళ్లు, కోడిపిల్ల‌లు, పిల్ల‌ల కోళ్లు క‌న‌ప‌డ‌తే.””
      నేడు సాహిత్యంలో మాండలిక భాష తో కథలు కవితలు చాలా అరుదు గా వస్తున్నాయి, సంఖ్య రీత్యా చాలా తక్కువే అని చెప్పాలి. సాహిత్యకారులు , పరిశోధకులు , కనుమరుగు అవుతున్న భాషను కాపాడుకోవడం చాలా ముఖ్యం. భావితరాలకి మాండలిక భాష అంటే ఏమిటో తెలియాలంటే ఇలాంటి రచనల అవసరం చాలా ఉంది అని భావిస్తున్నాను, ప్రఖ్యాత రచయిత ఎగుగీ వా థియోంగో తన రచనల్లో మాండలిక భాషకు అత్యధిక ప్రాధాన్యమిచ్చాడు. తేనెలొలుకు రాయలసీమ మాండలిక భాష, ఇతర మాండలిక భాషలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీరు రాసిన కథలో రాయలసీమ మాండలిక భాషను చాలా కళాత్మకంగా ఉపయోగించారు. పల్లె సీమ లో ఉన్న పాత తరం వయో వృద్ధులు దగ్గర మధురమైన రాయలసీమ మాండలిక పద జాలం దాగి ఉంది , పరిశోధిస్తే చాలా పదజాలం బయటికి వస్తుంది. మీ కథారచనలో ఇలాగే మాండలిక భాషను కొనసాగిస్తారని ఆశిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను.
      9494052775

  • Type here to search…
    SEARCH

    2020 సంచికలుసంచిక: 1 జులై 2020
    యాడ‌న్నా నాటుకోళ్లు, కోడిపిల్ల‌లు, పిల్ల‌ల కోళ్లు క‌న‌ప‌డ‌తే..
    రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

    VIEW ALL POSTS
    ఇవాళ వర్షం కూడా..
    చారిటీ-ఎన్జీవోలు-అరిస్టోక్రసీ ఆఫ్ లేబర్
    3 comments
    Comment

    Name *
    Manchala Achyutha Satyanarayana Rao
    Email *
    mas_satyam@yahoo.co.in
    Website
    Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
    Save my name, email, and website in this browser for the next time I comment.

    Notify me of follow-up comments by email.

    Notify me of new posts by email.

    Avatarగుత్తా హరిసర్వోత్తమ నాయుడు
    July 2, 2020 at 6:46 am
    శానా బాగ రాశారు సర్ మీరు

    అభినందనలు

    Reply
    AvatarRallapalli rajavalli
    July 2, 2020 at 8:18 am
    Thankive so much anna

    Reply
    AvatarManchala Achyutha Satyanarayana Rao
    July 2, 2020 at 11:12 pm
    రాళ్లపల్లి రాజా వలి గారు రాసిన కథ “‘ యాడ‌న్నా నాటుకోళ్లు, కోడిపిల్ల‌లు, పిల్ల‌ల కోళ్లు క‌న‌ప‌డ‌తే.””
    నేడు సాహిత్యంలో మాండలిక భాష తో కథలు కవితలు చాలా అరుదు గా వస్తున్నాయి, సంఖ్య రీత్యా చాలా తక్కువే అని చెప్పాలి. సాహిత్యకారులు , పరిశోధకులు , కనుమరుగు అవుతున్న భాషను కాపాడుకోవడం చాలా ముఖ్యం. భావితరాలకి మాండలిక భాష అంటే ఏమిటో తెలియాలంటే ఇలాంటి రచనల అవసరం చాలా ఉంది అని భావిస్తున్నాను, ప్రఖ్యాత రచయిత ఎగుగీ వా థియోంగో తన రచనల్లో మాండలిక భాషకు అత్యధిక ప్రాధాన్యమిచ్చాడు. తేనెలొలుకు రాయలసీమ మాండలిక భాష, ఇతర మాండలిక భాషలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీరు రాసిన కథలో రాయలసీమ మాండలిక భాషను చాలా కళాత్మకంగా ఉపయోగించారు. పల్లె సీమ లో ఉన్న పాత తరం వయో వృద్ధులు దగ్గర మధురమైన రాయలసీమ మాండలిక పద జాలం దాగి ఉంది , పరిశోధిస్తే చాలా పదజాలం బయటికి వస్తుంది. మీ కథారచనలో ఇలాగే మాండలిక భాషను కొనసాగిస్తారని ఆశిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను.
    9494052775

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు