1950

నీళ్ళ గ్లాసు అందిస్తున్నప్పుడు తగిలిన ఆమె సుకుమారమైన మునివేళ్ళ విద్యుత్ హఠాత్ స్పర్శా ప్రసారంతో రెడ్డి హృదయం చలించిపోయి విచలితుడయ్యాడు. కాంక్షతో రెడ్డి మానసం ఆమె సమక్షంలో దగ్ధమయ్యిందాక్షణం.

అక్షరాలలో లెనిన్ ధనిశెట్టిని వొడిసి పట్టడం కష్టం. వొంద యెకరాలను దోమలు భూమిని దళితులకు పంచినా, గాలి జనార్ధన్ రెడ్డి ఐన్ వోర్ దొంగ రవాణా మీద కధనం రాసినా జైర్నర్ రా పాలెస్ లో DIVO వోడ్కాను, వోల్డ్ మంక్ రమ్మును సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞుడు. మరుక్షణం అనామకంగా అంచుల్లో అనాధగా సంచరిస్తుంటాడు. తన పూర్వజ్ఞానం నుంచి తాను విముక్తుడయ్యే పనిలో వున్నాడు ప్రస్తుతం. యిప్పటి వరకు 27 కు పైగా కథలు రాసాడు.(అవి గతం చనిపోయాయని అంటాడు) యితని మొదటి కథ గాజుబొమ్మ అయితే యీ మధ్య కాలంలో ప్రచురితమైన  కథ అంతులేని కథ. యెంతో మంది ప్రచురిస్తామని అన్నా వొప్పుకోడు.యేదో శక్తి ఆవహిస్తెేనెే రాసే లెనిన్ యిప్పటికి సరిగ్గా నలభై ఆరేళ్ళ క్రితం నెల్లూరు కన్యకల ఆసుపత్రిలో ప్రపంచాన్ని చూశాడు. తన గురువులు వెంకటగిరి పెంచలయ్య, తిరుపతి భాస్కర్ లకు సదా వినమ్రుడు. వుద్యోగమూ, వివాహములను ఐఛ్చికంగా తిరస్కరించాడు.యెక్కడుంటాడో, యేం చేస్తుంటాడో ప్రాణ పదార్థమైన నాకూ తెలీదు. వో రకంగా The Last Nihilist.

పరిచయం, పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్

 

1.

యీ మేఘావృత సాయంత్రపు నెల్లూరు ఆకాశం నన్ను నా జ్ఞాపకాల తలపోతల్లో ముంచేస్తుంది. క్రమక్రమంగా …యీ నగరాన్ని ఆవరించి ఆవిరయిపోయిన గత స్మృతులను నెమరువేయిస్తూంది. గతం వర్తమానంలో జ్ఞాపకమై నా మనసులో వర్షిస్తూంది..నల్లటి మబ్బుల వర్షాన్ని వెర్రిగా వెంటాడుతున్న యీదురు గాలి విసుర్లకు అటూ…యిటు గుండెలు బాదుకొంటున్న కిటికిల టపటపల రెక్కలు గడిపెట్టాక గదంతా వ్యాపించిన చీకటి…వెలుపల..వుండుండీ వురిమే వురుముల ఘోష నేపధ్యంలో విరిసి కురుస్తున్న అకాల వర్షపుజల్లు హాహాకారపు హోరు …సమాంతరంగా నా మస్థిష్కంలోనూ…

1950

వాయిగుండ ప్రభావంతో వారం రోజులపాటు కర్నాటక తీర మైదానమంతా హోరున కరిసిన ఎడతెగని వానలకు పెన్నమ్మ ప్రవాహం వుప్పొంగి నురగలు కక్కుతూ వురకలేసింది. యీ వరద రోజుల్లో వొక పండగనాటి పవిత్ర స్నానం కోసం పెన్నా నదికి వెళ్ళిన సుందరి అమ్మా నాన్నలిద్దరూ సుళ్ళు తిరిగే ఆ మహాద్వేగపు  ప్రవాహవొరవడిలో కాలు జారిపడి త్రుటిలో కొట్టుకు పోయారెటో??? తమ యిద్దరి ముద్దుల బిడ్డలు సుందరీ, రమణల్ని అనాధల్ని చేసి, యెప్పుడో యేళ్ళక్రితం రైతు కూలీల మూలుగులు పీల్చి బలిసిపోయిన వెంకటగిరి జమీందారీ దివాణంలో బలవంతపు దేవదాసీ వృత్తి భరించలెేక వారి పూర్వీకులు నెల్లూరు చేరింది….యిందుకా??? సుందరి తల్లి అవసరాల మేరకే వేశ్యవృత్తిలో కొనసాగేదని అందరూ చెవులు కొరుక్కునే రోజుల్లో,  తన కులానికే చెందిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంది సుందరి తల్లి. కుటుంబం హాయిగా సాగిపోయే రోజుల్లో ఆకస్మికపు పెన్న అవిరామ ప్రవాహం అక్కా చెల్లెళ్ళ అపురూప అస్థిత్వానికి పరీక్షగా మారింది. రక్త సంబంధీకులూ, బంధువులూ..యిలా నా అనే వారెవ్వరూ లేని సుందరి సరిగ్గా యవ్వనపు ప్రాంగణంలో అడుగిడిన రోజులవి. వొకసారి చూస్తే వెంటాడే సుందరి అసాధారణ అందం సమకాలీన నెల్లూరు యువక సమాజపు హృదయాన్ని నిత్యము అల్లకల్లోలించి అశాంత పరిచేది. సుందరీ, ఆమె సుకుమారపు అందం స్థానికంగా వొక నిరంతర చర్చగా వుండేదానాటి నెల్లూరు నగరవీధుల్లో. తల్లితండ్రులు మరణించాక, జరుగుబాటు లేక బతుకు తెరువుకు తను వుంటున్న యింటిని రెండు భాగాలు చేసి వొక దాంట్లో తనూ, చెల్లెలితో కలిసి వుంటూ మరో భాగాన్ని రాజారావనే మెకానిక్ కు అద్దెకిచ్చింది సుందరి. కార్లు, బస్సులూ నైపుణ్యంగా రిపేరు చేసేవాడు రాజారావు. కాయకష్టపు వృత్తి మూలంగా ధృడకాయుడు. అతను ఎవరో? ఏమిటొో? యెవరికీ తెలీదు. అతను చెప్పుకోడు. యెక్కడి నుండో వుపాధి కోసం నెల్లూరుకొచ్చి యీ వృత్తిలో స్థిరపడ్డాడు. ఆ రోజుల్లోనే తన పనిలో నెలకు వెయ్యి రూపాయల వరకూ సంపాదించే రాజారావు తన సంస్కారయుతమైన ప్రవర్తన, నెమ్మది తత్వం, మంచిమాటతీరు వంటి గుణాలతో అతి తక్కువ కాలంలోనే బస్సు, కార్ల యజమానుల అభిమానాన్ని పొందాడు.

2.

మగదిక్కులేని అక్కా చెల్లెళ్ళకు కాల గమనంలో రాజారావే అన్నిటికీ అసరా అయ్యాడు. వాళ్ళ పనుల్లో శ్రధ్దగా యధాశక్తి సహాయపడే వాడు. హోటల్ తిండితో రాజారావు పడేపాట్లు చూడలేక సుందరి తనే వండి రోజూ అతనికి కారియర్ పంపేది. యిలా కొంతకాలానికి రాజారావు సుందరి యింట్లోనే భొోజనం చేసేంతగా వారి పరిచయం సన్నిహితమయ్యింది. తన అవసరాలు గమనించి సమయానికి సుందరి అప్యాయతగా చేసే సహృదయపు సపర్యాల తాలూకూ అనుభూతి రాజారావు హృదయంలో ఆమె పై ప్రేమగా మారే క్రమంలో వారిద్దరి యవ్వనప్రాయం అత్యంత సహజంగా వారిని సహచరులుగా మార్చింది. యీ సహచరానందపు శాంతి రాజారావు తన జీవితంలో యేనాడూ వూహించినది యిప్పుడు రాజారావు తన సంపాదనంతా సుందరికి యిస్తున్నాడు. ఆమె చెల్లెలు రమణను మంచి స్కూలు లో చదివిస్తున్నాడు. రమణ కూడా రాజారావు పట్ల గౌరవ మర్యాదలతో, అంకిత భావంతొో మెలిగేది. ఆమె లోకమంతా రాజారావుదే. యిలా రెండు సంవత్సరాల తరువాత కాలం హాయిగ గడిచిపోయే రోజుల్లో… యేదో పనిమీద అనుకోకుండా రాజారావు కోసం మొదటిసారి యింటికొచ్చిన రెడ్డి సుందరిని చూసి తన్నుతాను మరచిపోయాడు. సుందరి తాలూకు విప్పారిన సౌందర్యపూరిత నిమ్నోన్నత సౌష్టవపు వొంపుల వెలుగు నీడల మారుమూల లోతుల్లో కరుకు గాలానికి చిక్కిన చేపలా  రెడ్డి ఆత్మ విలవిల లాడింది.

నీళ్ళ గ్లాసు అందిస్తున్నప్పుడు తగిలిన ఆమె సుకుమారమైన మునివేళ్ళ విద్యుత్ హఠాత్ స్పర్శా ప్రసారంతో రెడ్డి హృదయం చలించిపోయి విచలితుడయ్యాడు. కాంక్షతో రెడ్డి మానసం ఆమె సమక్షంలో దగ్ధమయ్యిందాక్షణం. మంచి లాభాలను తెచ్చే రూట్లలో నడిచే ఆరు బస్సులku యజమాని రెడ్డి. వాటి రిపేరు వ్యవహారాలు చూసే రాజారావుకూ రెడ్డికీ మంచి స్నేహం  వుంది. సుందరి అందమూ, వినయమూ, మాటతీరు మళ్ళీ మళ్ళీ రాజారావు కోసం యింటికి వచ్చేలా చేయసాగాయి రెడ్డిని. యీ రాకపోకల్లో సుందరి పైన రెడ్డి అంతరంగపు లోతుల్లోని కోరికల్లన్నీ అతనిలో దృఢమైన ఆశగా రూపొందాయి. రాజారావు లేని సమయం చూసి రెడ్డి తరచూ ఏదొోవొక వంకతో సుందరిని కలిసేవాడు. ఆమెను తన శృంగారపూరితమైన సరస సంభాషణల్లోకి మర్యాదగా, కొంటెగా, సున్నితంగా దించేవాడు. ఆమె మనసును మాలిమిగా మచ్చిక చేసేందుకు తరచూ ఆమె అహంలో భాగమైన రాజారావు మంచితనాన్ని పరిధులు దాటకుండా వ్యూహాత్మకంగా పొంగుతూ ఆమె సుప్త చేతనలో జడప్రాయంగా వున్నా ఆమె కులవృత్తిని రెడ్డి తన సంపదను ప్రదర్శించే సంభాషణలతొో వొడుపుగా మేల్కొలపాలని యథాశక్తి ప్రయత్నించేవాడు. రమణకు మంచి ఖరిీదైన బహుమతులిచ్చేవాడు. యీ తతంగాన్నంతా యిబ్బందిగా స్తీ సహజమైన మొహమాటంతొో, చపలత్వంతో భరిస్తూ, అనుభవిస్తూ వచ్చింది సుందరి. సుందరి సందిగ్ధత రెడ్డి మానసంలోని చంచలాత్మక ఆశలకు అనుక్షణమూ వూపిరిలూదేది.

తను సుందరికి తెచ్చిచ్చే ఖరిీదైన  సినిమా మాగజైన్లలోని తారల అందంతో సుందరిని సరిపోల్చి పొగడ్తల వొర్షం కురిపించేవాడు. బస్సుల ద్వారా తనకు మంచి సంపాదన వొస్తుందని తనకు నా అనే వారెవరూ లేరని తరచూ వాపోయేవాడు. అతనూ తన లాగే అనాధ అన్న ఆలొోచన సుందరి అంతరంగంలో రెడ్డి ప్రవర్తన పట్ల వొక డోలయమాన మానసిక స్థితిని ప్రజ్వలించింది. యీ అనిశ్చితి ఆమెను క్రమంగా  వొకానొక ఆకర్షణాపూరిత పరధ్యానంలోకి యీడ్చుకు పోయేది. యీ సందిగ్ధ సందర్భాలన్నీ అంతిమంగా సుందరిలో రెడ్డి పట్ల వొకరకమైన స్త్రీ సహజమైన సానుభూతినీ, జాలినీ కలిగించాయి.

సుందరి ఆటవికపు అనురాగ యవ్వన నగ్నసౌందర్యంలో రెడ్డి యధేచ్ఛగా ప్రతీరోజూ తలముకలుగా దగ్ధమయ్యేవాడు. ఆమె ధవళదెేహపు బలిష్ట సౌందర్యపు కాంతి ఛాయలలొో తడుస్తూ… వున్నత్త దగ్ధానంతర ప్రశాంత శాంతిలొో ప్రపంచాన్ని మరిచి నక్షత్రపు దారులలో ఆమె వొంపుల వెలుగు నీడల్లో ఛాయలతొో సహచరిస్తూ విహరించేవాడు. సుందరి సమక్షం, సహచర్యం రెడ్డిని వొక అనిర్వచనీయ తేజస్సుతో ద్విగుణీకృతం చేసిన వుత్సాహపు తమకపు రోజుల్లో వొక మధ్యహ్నాం రాజారావు సుందరి ముందే అగ్నిపర్వతంలా బద్దలయ్యాడు. సుందరిపై యిన్నాళ్ళ అతని ప్రేమ వుక్రోషంతో కూడిన ద్వేషభావ ప్రశ్నలుగా మారి సుందరి మౌనం ముందు కనీస జవాబులకు నోచుకోలేక నిశ్శబ్దమై యెగచిమ్మింది. యీ సన్నివేశమంతా చూస్తున్న రమణ సుందరి మీదకు దూకినంత పనిచేసింది. రాజారావును సమర్థిస్తూ అక్క చాపల్యాన్ని కడిగిపారేసే ధర్మాగ్రహంలొో ఆమెను అడగాల్సినవన్నీ వరసబెట్టి అడిగింది. సుందరిలో చలనం శూన్యం. నేను నిన్ను వొక వేశ్యలా యెప్పుడూ చూడలేదు. నా ప్రేను వమ్ము చేయకు…నన్ను తృణీకరించడం నీకు తగదంటూ ప్రాధేయపడ్డాడు రాజారావు. కారే కన్నీళ్ళను ఆపుకునెే విశ్వప్రయత్నం చేస్తూ. సుదీర్ఘ మౌనం తర్వాత … నువ్వు కుర్రవాడివి. వయసులో వున్నావు…యెవరినైనా మంచి కుటుంబ స్త్రీని పెళ్ళి చేసుకొని హాయిగా బతుకు. నేను చేసేది తప్పయితే నా దగ్గరకు రావద్దనే రెండే రెండు మాటలు చెప్పి తన గదిలోకి వెళ్ళి ఆక్రోశపు విసురుతో తలుపు వేసుకొని గదిలోని తన పూర్వీక వారసత్వపు పురాతన పందిరి మంచంపై బోర్లాపడి తన దుస్థితికి విలపిస్తూ రోదించింది సుందరి. తను ప్రేమించిన వ్యక్తికీ తనను ప్రేమించిన వ్యక్తికీ మధ్య నలుగుతున్న ఆమె మనసులోని అవ్యక్త ఆవెేదన కన్నీటి రూపంలో పెన్న వరదలా సుళ్ళు తిరిగింది. అదే గది… అదే పందిరి మంచం. తన జన్మకు కారణమైన మంచం. తనూ తన చెల్లెలూ యెన్నో ఆటలాడుకొన్న మంచం. అమ్మా… నాన్న అకస్మాత్తుగా దూరమైనపుడు పొగిలి పొగిలి యేడ్చిన మంచం. యవ్వనపు దాహతమకంలో రాజారావు తానూ తనివితీరా వొకటైన మంచం. ధనవంతుడైన రెడ్డి అతిశయం తన సౌందర్యం ముందు కాలి…కరిగి తనపై ప్రేమై ప్రవహించిన అదే మంచంపై స్థలంలో అవధులు లేని వేదనతో … దుఖంతో విలపిస్తుంది సుందరి. సుందరి మాటలకు నిశ్చేష్టుడయ్యాడు రాజారావు. వొక్క గంటలో వృధ్దుడిలా మారిన భావం అతని మనసును నిలువెల్లా ఆవహించింది నిస్తేజించింది. వుబుకుతున్న కన్నీటి చారికలతో అతని చెంపలు తడిచిపోయాయి. యిదంతా చూసి రమణ మనస్సు అతని పట్ల సానుభూతి, ఆపెేక్షలతో చలించి పోయింది. అప్రయత్నంగా వొకడుగు ముందుకేసి తన చేతులతో అతని కన్నీటిని తుడిచింది. నీ తోడుగా నేనుంటాను. రా, వెళ్ళిపోయి పెళ్ళి చేసుకొని హాయిగా బతుకుదాం అన్న రమణ లేప్రాయపు మాటల్లోని దృఢత్వానికి రాజారావు ఆశ్చర్యపోయాడాక్షణంలో. రాజారావు కళ్ళలోకి సూటిగా చూస్తూ మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. యెప్పటి  నుండో నిన్ను యిష్టపడుతున్నాను. యిన్నాళ్ళుగా అది నువ్వు గ్రహించలేదు. నా మనసును అర్థం చేసుకోలేక పోయావు. నీకోసం మా అక్కతో నేను యెన్నిసార్లో పోట్లాడినా నువ్వు ఆ మాత్రం నా మనసును తెలుసుకోలేక పోయావు. చావైనా, బతుకైనా ఏదైనా నీతోనే అంటూ తన పరిష్వంగంలో రాజారావును అనునయించి సేద తీర్చింది రమణ. యిది జరిగిన కొంతకాలానికి రాజారావు రమణ యిద్దరూ ఆ యింట్లో నుంచి వెళ్ళిపోయి, పెళ్ళి చేసుకొని సుందరికి దూరంగా , ఆనందంగా తమ కాపురాన్ని కొనసాగించారు.

3

రెడ్డి మీద కలిగిన జాలి సానుభూతిగా మారి సుందరిని నిలువెల్లా ఆవహించి దహించే అమాయకపు రోజుల్లో …. వొక సాయంత్రపు మసక చీకట్లకు మునుపు సుందరి దగ్గరకు వచ్చి యథాప్రకారం సంభాషణలు కొనసాగించాడు రెడ్డి. యీ క్రమంలో చీకటి పడుతోంది. యింటికి వెళ్ళమని రెడ్డికి గుర్తు చేసింది సుందరి. వినీ విన్నట్టుగా మళ్ళీ మాటల్లో పడ్డ రెడ్డి బయలుదేరే సమయానికి ప్రారంభమైన స్వాతికార్తె వాన చినుకుల చిరుగాలి వాతావరణం రెడ్డి మనసును పలు విధాల స్వైరవిహారం చేయించింది. యీ తలపుల వున్మాదకత నుంచి జనించిన మొండి ధైర్యంతొో రెడ్డిపై హఠాత్తుగా సుందరిని తటాలున తన కౌగిట్లోకి లాక్కొని… కాదంటే మరణమే శరణ్యమని దీనాతిదీనంగా పెదవులను వొణికించాడు. వొకానొక అనిర్వచనీయ సందిగ్ధతలో … అవ్యక్తపు తడబాటులో … పాపభావనలో … రెడ్డిపై ఆమె మనసులో యేర్పడిన దైన్యత క్షణాలలో కరుణగా మారి తృటిలో అతనితో అయిక్యమైపోయిందామె. ఆ గదిలోని పురాతన ఎర్రచందనపు పందిరి మంచంపై … వెలుపలి వొర్ష తీవ్రత  విద్యుత్ ను ఆర్పి వేసింది… అంతా వొక క్షణకాలంలో జరిగి పోయింది. ఆ క్షణాలలో రెడ్డికీ తెలుసు రాజారావు వూర్లో లేడని… సుందరికీ తెలుసు రమణ ట్యూషన్లో వుందని. ఆమె శరిీర సమక్షంలో రెడ్డి అంతరంగం వెల్లువెత్తిన సంపూర్ణ సుఖంలో ఆనందపు అంచులు చూచింది. యీ సుఖంలో వోలలాడుతూ రెడ్డి కాలాన్ని మరిచిపోయి చాలా నెలలు గడిచాక క్రమంగా యిద్దరి మధ్య పెరుగుతున్న చనువూ… చొరవ రమణకు తన వయస్సుకు మించిన రహస్యాలను అర్థం చేయించాయి. వొకానొక భరించలెేని స్థితిలో అక్కను నిలదీసింది రమణ. యిది నీచం… దారుణం…ఘోరం…ద్రోహం …అంటూ ఆవేదనతో ఆక్రోశించింది. సుందరి మౌనంగా వుండిపోయింది. అక్కమౌనం రమణ హృదయంలో రాజారావు పట్ల రోజు రోజుకూ అనిర్వచనీయ సానుభూతిగా మారేకాలంలో వొకరోజు….

4

యీ వ్యవహారంపై రమణ సూటిపోటి మాటలతో అక్క మనసును గాయాలపాలు చేసే సమయంలోనే హఠాత్తుగా రెడ్డి రావడంతో ఆ ఘట్టం అర్థాంతరంగా ముగిసింది. అదే రోజు మధ్యాహ్నం రమణ గదిలో పరీక్షలకు చదువుకొంటుండగా అనుకోకుండా ఏదో పనిపై యింటికి వచ్చిన రాజారావు సుందరీ, రెడ్డి మధ్య సానిహిత్యాన్ని చూసి నిశ్చేష్టుడై మారు మాట్లాడకుండా గిర్రున తిరిగి వేగంగా వెళ్ళిపోవడం  రమణ గమనించింది. ఆ తరువాత రెండు రోజులపాటు రాజారావు ఇంటికి రాలేదు. మూడో రోజు వచ్చిన అదే మౌనం … అంతా తెలిసిన మౌనంగా వుంటున్న రాజారావు సంస్కారం రమణ హృదయాన్ని భరించలెేని వేదనతో నిత్యమూ చిత్రవధ చేస్తూంది. అతని పట్ల అపారమైన జాలితో రమణ హృదయం నిండిపోయింది. యీ మానసిక సంఘర్షణలోనే నలిగిపోతూ యేదో పరీక్షలు రాసాననిపించుకొని…వుండబట్టలేక వొక రోజు రాజారావు  మెకానిక్ షెడ్డు వెనుక వేపచెట్టు నీడలో రాజారావు చేతుల్లో ముఖం దాచుకొని జరిగింది చెబుతూ నిష్కల్మషంగా తన వేదనను వొర్షించి తనను వెంటాడే అపరాధపు దుఖం నుంచి విముక్తించింది రమణ.

 

5

సుందరి మౌనం … రాజారావు నిర్లిప్తత …రమణ నిర్లక్ష్యం…. ఆ యింట్లో రాజ్యం చేసే నిరాశాపూరిత దిగులు కాలంలో ..

6

కాలం ప్రవాహంలో జరిగే సంఘటనలను నిర్లిప్తంగా గమనిస్తూంది సుందరి. యింట్లో తనకు అడ్డులెేక పోవడంతో రెడ్డి మనసులోని అపరాధ భావన స్థానంలో యెక్కడ లేని స్వేచ్ఛ పొడచూపింది. ఫలితంగా సుందరిపై రెడ్డి వ్యామోహం ప్రేమ స్థాయిని దాటి మహోద్వేగ అనురాగంగా మారింది. యిద్దరి మధ్య యెటువంటి భెేధాభిప్రాయాలు, అరమరికలూ లేకపోయినా సుందరి అచంచల సుకుమార సౌందర్యపు శరిీరంలోని మానసిక దృఢత్వం వొక్కోసారి రెడ్డిని భయపెట్టెేది. ఆమెతో జరిపే శృంగారభరిత వున్నత రసోద్రేకమోహపు కలయికల తమకంలో తన సుప్తచేతనా భయాలెన్నిట్నో మరచిపోయేవాడు రెడ్డి .  క్రమంగా అతని ఖరిీదైన జీవితపు అలవాట్లు ఆమెను ఆవహించాయి. ఖరిీదైన చీరలూ, నగలూ, మేకప్ సామాగ్రి, ఆడంబర జీవితమూ, వున్నత వర్గాలతో నిరంతర కాలక్షేపకలయికలు, వ్యాపకాలూ అలా ఆమె రెడ్డి తో పాటు గుర్రపు రేసులకు మద్రాసు వెళ్ళేది. రెడ్డి సంపద ఆమె అద్వితీయ సౌందర్యాన్నీ మరింత యినుమడింప జేసింది. ఆమె పొందుకోసం మద్రాసు కులీన సమాజం కాంక్షతో కొట్టుమిట్టాడేది. సుందరి అందం వారి మతిని అనేకానేక భ్రమల్లోకి నెట్టేది. తమ కుటుంబాలను సైతం వొదిలి, నిర్లక్షించి వారి తాతముత్తాతలు దోపిడి చేసి ఆర్జించిన కోట్లాది విలువ గల ఆస్థిపాస్తులను సుందరితో వొక్కసారి పొంసుకోసం ఆమె పాదాల చెంత కుమ్మరించెేందుకు క్షణాలలో సిధ్దపడేవారు. నాటి మద్రాసు గవర్నరు  సైతం సుందరి గౌరవార్థం విందు యిచ్చాడని నెల్లూరంతా చెవులుకొరుక్కొంది. ఖరిీదైన హోటళ్ళలో విడిది…. గుర్రపు పందాల్లో కొత్తపరిచయాలూ, కోటీశ్వరుల, జమీందారుల యిళ్ళలో పార్టీలకు ఆహ్వానాలు. ఆమె తన నల్లటి చలువ కళ్ళద్దాలలో నుంచి చల్లటి ప్రపంచాన్ని దర్శిస్తున్న అనుభూతిలో సోలి తేలిపోయింది. ఆమె చుట్టూ ఆవరించిన కొత్త బంగారులోకంలోని జమీందారుల, కోటీశ్వరుల కోర్కెలూ రెడ్డికి తెలియకుండా తీరుస్తుందనే పుకార్లు మద్రాసు క్లబ్బుల్లో నుంచి నెల్లూరు ట్రంకురోడ్డు దాకా షికారు చేశాయి. యీ సంగతులు రెడ్డికి చూచాయగా తెలిసిసినా సుందరిని పల్లెత్తు మాట అనకపోవడం విచిత్రమేమీ కాదు. ఆమె రెడ్డి అహంలో వొక భాగం. యీ కాలంలోనే తనదైన ఆర్థిక స్వతంత్ర్యం ఆమెలోని స్వేచ్ఛకు రెక్కలు తొడిగింది. తన మనసునూ …శరిీరాన్ని పరిపూర్ణంగా అర్పించుకునే సందర్భాలలో ఆమె చూపే నిస్వార్థమైన, నిజాయితీలతో కూడిన ధార్మిక ఆవెేశం రెడ్డినే కాదు ఎంతో మందిని ఆమె వెంట మళ్ళీ….మళ్ళీ.. ఆకర్షితులయ్యెేటట్టు చేసేది. యెంతో తీవ్రమైన అహం సైతం ఆమె సౌందర్యం సమక్షంలో చేష్టలుడిగి పసిబిడ్డలా మారేది. కొత్తబంగారు పైపూతల లోకపు జీవన ఫలితమో … యేమో? వొక ఆకస్మిక దినాన ఆమెకు తెలియకుండానే ఆమె లోదుస్తులు రక్తంతో తరచూ తడుస్తూ వున్న విషయాన్ని వొక ఆకస్మిక క్షణాన గ్రహించింది సుందరి. ఆ తర్వాత ఆమె శరిీరం క్రమంగా పాలిపోవడం ప్రారంభించింది. యెన్నో పురుష మానసాల్లో వొక భ్రమాజనిత తాత్కాలిక వున్మాదపు ఆవెేశాన్ని కల్గించి తన పాదాలకు చేర్చిన ఆమె అద్భుత మహామోహపూరిత దేహసౌష్టవం వుడిగిపోతూ వుంది. వొళ్ళంతా సూదులు గుచ్చుతున్నట్టుగా వొక్కటే పోట్లు ….. ఆమె మంచం పట్టింది. ఆమె నిస్సత్తువను మద్రాసు

డాక్టర్లు క్యాన్సర్గా నిర్ధారించినపుడు అణుమాత్రం చలించలేదు సుందరి.విరక్తితో నవ్వుకుంది ఆ నవ్వులో విరిసిన శూన్యత రెడ్డి హృదయాన్ని దైన్యంతో…. దిగులుతో చిత్రవధ చేసేది. సౌందర్యం వసంతంలా ఆమె నుంచి వడి… వడిగా నిష్క్రమించింది. శ్రధ్దాపుూరితమైన రెడ్డి సపర్యలు ఆమెలో తరచూ వొకానొక అపరాధిత వ్యాకులతను కలిగించేవి. వొక రోజు రెడ్డి రెండు చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తో రమణనూ రాజారావునూ చూడాలని వుంది పిలుచుకు రమ్మని చిన్నపిల్లలా ప్రాధేయపడింది. యిందుకు రమణ రాజారావులు వొప్పుకోలేదు. రెడ్డి బతిమాలి..బతిమాలి….వారిద్దరిని వొప్పించి ఎట్టకేలకు సుందరితో కలిపాడు.

7

ఆ క్షణంలో సుందరి స్థితిని చూసి రమణ రాజారావుల హృదయం ద్రవించి పోయింది. మానవ మనస్తత్వంలోని వైచిత్రో …యేమో … ఆమె పట్ల వారిలో సుధీర్ఘకాలంగా ఘనిీభవించిన ద్వేషం … తీవ్రమైన సానుభూతి గా క్షణాలలో కరిగిపోయింది  రమణ ప్రేగు బంధపు ప్రేమాస్పద సపర్యలు రాజారావు ధైర్యం, ఖర్చుకు వెనకాడని రెడ్డి అచంచల సహనం…. తన బలంగా మార్చుకొని క్యాన్సర్‌తో క్షణక్షణం పోరాడుతోంది  సుందరి దేహం.తనవారిపట్ల స్వార్థంతో… తలపొగరుతో ప్రవర్తించినందుకే, తనకీ శి అని తలచుకొని తనలో తాను కుమిలిపోయేది తరచూ. రెడ్డిని పదే పదే తన దగ్గరకు రమ్మని అతని వొడిలో పడుకొని కన్నీళ్ళు కారుస్తూ గంటల తరబడి దుఖించేది. క్షమాపణ అర్థిస్తున్నట్టుగా ఆయన కళ్ళకేసి తీక్షణంగా… దీనంగా…చూస్తూ…చూస్తూ…వుండుండీ కన్నీరు కార్చేది. రెడ్డి ఆమెను తన పరిపూర్ణ హృదయంతో శాంతంగా అనునయించి వోదార్చేవాడు. ముగ్గురూ సుందరికి మానసికంగా యెంత వెన్నుదన్నైనా …. ఆమె చూపులు, తలపులు, ఆమె  గతం జీవితంలోని నిరాశలనూ, అసంతృప్తులకు కారణాలను అన్వేషించేవి అవిశ్రాంతంగా … సమాధానం దొరకక వర్తమానంలో ఆవెేదనతో కుమిలి పోయేవి. వొక రోజు వుదయం తనకు దగ్గరగా రమ్మని పిలిచి తన మెడలోని నాలుగు పేటల బంగారు గొలుసు రమణ మెడలో వేసి అప్యాయంగా రమణ తల, మెడ నిమిరింది. తన దగ్గరకొచ్చి తలనిమురుతున్న రాజారావు ప్రతిరూపాన్ని ఆమెలో వుబికిన కాస్తా కన్నీళ్ళు మసకబార్చాయి….అతని ముఖంలోకి నేరుగా చూడలేక పోయింది. రెడ్డిని దగ్గరకు రమ్మని సైగ చేసి అతని చేతుల్లో రాజారావు చేతుల్నుంచింది….కొన్ని క్షణాలకు ఆఖరి శ్వాస వొదిలింది. అనాయాసంగా తన ప్రేమికుల సమక్షంలో … మరుక్షణంలో రెడ్డి రాజారావు రమణ కడుపుల్లో నుంచి పెగిలిన దుఖపూరితమైన విదారక యేడుపు ఆ గదిలో మానవ హృదయ దైన్యతనూ, దుర్భలత్వాన్నీ, నిస్సహాయతనూ వొక్కసారిగా వుద్ధీపించి మరుక్షణంలో తేలికపరిచింది.

8

నిండుగా ప్రవహిస్తున్న పెన్నానది వొడ్డున రెడ్డి సంప్రదాయ సిద్ధంగా సుందరి శవానికి దహన సంస్కారాలు జరిపాడు. ఆ మధ్యహ్నసాయంత్రపు సంధి సమయంలో అద్భుతమైన సౌందర్యానికి వుపాధి అయినా సుందరి పార్థివ దేహం స్మశానాన్ని విచిత్రంగా  వెలిగిస్తున్నా ఆ కార్తీక మాస సాయంత్రపు బంగారు నీరెండల కాంతుల నీడల్లో కట్టెలమంటల మధ్య కణకణా కాలిసురసురా కరుగుతూ సుళ్ళు తిరిగే కమురు కంపు పొగలయ్యి నింగికెగసి బూడిదయదయ్యింది. రెడ్డి అరిచేతుల మీదుగా ఆమె అస్థికలు పెన్నలో లీనమయ్యి ప్రవహించాయి. ఆ తర్వాత రెడ్డి  రాజారావు రమణలతోనే చాలా కాలం కలిసి జీవించి మరణించాడనీ, రెడ్డి మరణం తర్వాత రమణ రాజారావులు నెల్లూరు వొదిలి యెక్కడో వుత్తరాదిన స్థిరపడ్డారని విన్నాను నేను.

9

బయట వొర్షం నెమ్మదించింది. వర్తమానంలో నా గత విహారమలా ముగిసింది. నెల్లూరనే పేరుతో పిలువబడే యీ ప్రదేశంలో అస్థిత్వంలో వుండి కాల గర్భంలో గతించిపోయిన యెన్నో ఘటనలకు నా సుధీర్ఘజీవన అంతశ్చేతన వొక నేల మాళిగల మారింది. అందులో నుంచి యెన్నెన్నో జ్ఞాపకాలు సచేతనంగా మారే క్రమంలో …నాకు సుందరే యెందుకు గుర్తొచ్చింది? యీ వర్షాకాలపు దీర్ఘ సాయంత్రం యీ గదిలో నా మదిలో సుందరి గురించిన ఆలొోచన సామాన్య పునరావృత్తానికి కారణం సుందరి దేహసౌందర్య. విశేషమే వొక కారణమా? యేమో?

మూలకథ : స్వర్గీయ వేములపాటి అనంతరామయ్య గారు

కథనం : డా. లెనిన్ ధనిశెట్టి

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్

కథా సారంగ కొత్త లోగో: మహీ  “Artio”

లెనిన్ ధనిశెట్టి

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Katha Saranga kathanika kosam dr Dhanisetti Lenin aksharalanu rokatlo vesi danchi kammani padaalanu chesi yerchi koorchi vaatiki chamakkulu addi naati Nelluru mandalikaanni melavinchi Nellore chepala pulusu la masaala nimpi manaku naadu jarigina yadaarda gadha idi ani anipinchelaa manalni manthra mugdulanu chesaadu thana bhaashaa pada prayogaalatho. Aathani nundi marinni kathalanu aasistunnanu. Mudrinchina yajamanya brundaaniki, moola katha nirdeshikadu Anatharamaiah (late) gaariki, Kathanikudu Dr Lenin Dhanisetti gaariki, naa abhinandana chandanaalu.. Srimanthudu Gurram from Nellore

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు