స్థిరమైన ఆచరణ వెనక ఉన్న సైన్స్ ఇదే!

వందల రకాల ఫిట్‌నెస్ ప్లాన్లు చేశావా? డైట్ చార్ట్లు తయారు చేసుకున్నావా? మొదట్లో పూర్తి ఉత్సాహంతో మొదలుపెట్టి, రెండు వారాల తరువాత వదిలేశావా?

అవును, ఇదే కథ చాలా మందిది. కానీ నేడు మనకు చెప్పబోయేది వేరే కథ. విజయానికి కావాలసినది స్థిరమైన ఆచరణ అని అందరికి తెలుసు. అయితే అది అందరికి సాధ్యం కాదు. కాని దాని వెనక ఉన్న సైన్స్‌ని అర్థం చేసుకుంటే దాన్ని ఎలా సాధించగలమో తెలుసుకోవచ్చునని నా ఈ చిన్న ప్రయత్నం.

ఒక్క నీటి చుక్క ఏమీ  చేయలేదు. కానీ అదే చుక్క ప్రతిరోజూ వస్తూ ఉంటే రాయిని కూడా గుంటలు వేస్తుంది. అలానే మన చిన్న చిన్న అలవాట్లు కాలక్రమేణా అద్భుతమైన మార్పులు తెస్తాయి.

జేమ్స్ క్లియర్ తన “అటామిక్ హేబిట్స్” పుస్తకంలో చెప్పాడు –

రోజూ కేవలం 1% మెరుగుపడితే, ఒక సంవత్సరంలో మనం 37 రెట్లు మెరుగవుతారు! ఈ గణితమే స్థిరత్వం శక్తికి రుజువు.

మెదడు ఎలా పని చేస్తుంది?

అలవాట్లు మూడు దశల్లో తయారవుతాయని MIT పరిశోధకులు కనుగొన్నారు. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అంటే మెదడికి ఈ మూడూ అలవాటు చేయాల్సిందే
  1. సూచన (క్యూ)
  2. చర్య (రొటీన్)
  3. ఫలితం (రివార్డ్)

ఉదాహరణకు: పొద్దున్నే నడవాలి అంటే, రారి ట్రాక్ సూట్ సిద్దం చేసుకోవటం అనేది సూచన. నడవటం అనేది చర్య . ఒక ఆ రోగ్యమైన ఫ్రూట్ స్మూతి తాగటం అనేది ఫలితం. కొన్ని వారాల తరువాత, ట్రాక్‌సూట్ చూసిన వెంటనే మన మనసు వ్యాయామం కోసం తహతహలాడుతుంది!

స్థిరత్వానికి 5 మంత్రాలు

1. చిన్నగా మొదలుపెట్టాలి

“మూడు గంటలు చదువుకుంటాను” అనుకోవద్దు. 20 నిమిషాలతో మొదలు పెడితే చాలు. ఫోనులో ఎంటర్తైన్మెంట్ యే కాకుండా రోజు పది నిముషాలు ఏదైనా చద్వటం అల్వాటు చేసుకోవాలి.

2. అనువైన వాతావరణం మనమే సిద్దం చేసుకోవాలి

మన చుట్టూ ఉండే వాతావరణం మన అలవాట్లను నిర్ణయిస్తుంది. చదువు కోసం ప్రత్యేక కార్నర్ సెట్ చేయండి. ఆరోగ్యకరమైన తిండి కోసం కట్ చేసిన కూరగాయలను ఫ్రిజ్‌లో కనిపించే చోట పెట్టండి.

3. మన లక్ష్యాలను వేరే వారితో పంచుకోవాలి

మన లక్ష్యాలను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కోవాలి. వాకింగ్ గ్రూప్ వంటి వాటిలో చేరితే సామూహిక ప్రోత్సాహం ఉంటుంది. ఎవరికైనా కమిట్మెంట్ చేసుకుంటే, వదిలేయడం కష్టం.

4. ప్రగతిని గమనించాలి

విజయాలు కనిపిస్తే, కొనసాగించాలని అనిపిస్తుంది. అందుకే కెలెండర్‌లో రోజూ టిక్ చేయటం లేదా హ్యాబిట్ ట్రాకర్ యాప్ వాడటం చేస్తుంటే అది తెలియకుండా ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది.

5. ఆటంకాలకి సిద్ధంగా ఉండాలి

“ఉదయం వ్యాయామం చేయలేకపోతే, లంచ్ టైంలో 10 నిమిషాలు స్ట్రెచింగ్ చేస్తాను” – ఇలాంటి బ్యాకప్ ప్లాన్ చేసుకోవాలి.

జీవిత రంగాలలో స్థిరత్వం ఎలా సాధించవచ్చు?

కెరీర్‌లో – 

ఇంట్లో ఉండి డబ్బు సంపాదించాలా? రోజూ 20 నిమిషాలు –

ఒక వీడియో చూడండి అచ్చార్లు తయారీ గురించి, మెహంది డిజైన్ నేర్చుకోండి, లేదా మన వంట నైపుణ్యాల గురించి ఒక మెసేజ్ పంపండి. కొన్ని నెలల తరువాత మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, స్కిల్స్ పెరుగుతాయి. ఈ మధ్యే చూసాను భారత ప్రబుత్వము కాటెజి ఇండస్ట్రీకి సంబంధించి చాలా కోర్సులు చాలా తక్కువ ఖర్చులో అందిస్తోంది. ఇందులో, సబ్బుల తయారీ, క్యాందిల్ తయారి, పెర్ఫ్యూం తయారి ఇవే కాకుండా బేకింగ్, పుట్టగొడుగుల పెంపకం వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లేనే నేర్పిస్తున్నారు. అయితే ఏది నేర్చుకోవాలి అన్నా ముందుగా మంచి ఫోను ఉండాలి అంతే.

ఆరోగ్యంలో

కఠినమైన డైట్లు, హెవీ వర్కవుట్లు వద్దు. రోజూ 15 నిమిషాలు నడిచినా, స్ట్రెచింగ్ చేసినా లేదా యోగా చేసినా చాలు

రిలేషన్‌షిప్‌లలో

వారంకొకసారి కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడండి. నెలకొకసారి జంటగా బయటకు వెళ్ళండి. స్నేహితుల జాబ్ ఇంటర్వ్యూ గురించి అడిగి తెలుసుకోండి.

 
అడ్డంకులు – ఎలా దాటాలి?

పర్ఫెక్ట్ కావాలని అనుకోవద్దు

ఒకరోజు మిస్ అయితే ప్రపంచం అంతం కాదు. స్థిరత్వం అంటే 100% కాదు, రెగ్యులర్ గా చేయడం.

వెంటనే రిజల్ట్స్ రాకపోవచ్చు

స్థిరత్వ శక్తి కాలక్రమేణా కనిపిస్తుంది. ప్రాసెస్‌పై దృష్టి పెట్టండి, అవుట్‌కమ్‌పై కాదు.

మోటివేషన్ ఎప్పుడూ ఉండదు

కొన్నిరోజులు ఉత్సాహం ఉంటుంది, కొన్నిరోజులు లేదు. అందుకే సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి, మూడ్‌పై ఆధారపడకూడదు.

మన ప్లాన్ తయారు చేయండి

  1. ఒక రంగం ఎంచుకోండి: అన్నీ కలిసి మొదలుపెట్టవద్దు
  2. మినిమం డిఫైన్ చేయండి: రోజూ కనీసం ఏమి చేస్తారు?
  3. సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయండి: వాతావరణం, స్నేహితులు
  4. అడ్డంకుల కోసం సిద్ధంగా ఉండండి: బ్యాకప్ ప్లాన్
  5. ట్రాక్ చేయండి: సింపుల్ మెథడ్
  6. రివ్యూ చేసుకోండి: రెగ్యులర్‌గా అప్‌డేట్ చేయండి

స్థిరత్వ మాయాజాలం

ఉదాహరణకు ప్రతిరోజూ 30 నిమిషాలు ముందుగా నిద్రలేస్తేమనం నెమ్మదిగా మరింత ఆర్గనైజ్డ్ గా ఉన్నట్లు భావించడం ప్రారంభిస్తాము. ఒక ప్రాంతంలో మనం నిర్మించుకునే స్వీయ-క్రమశిక్షణ మన జీవితంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. మనం ప్రతిరోజూ 50 నిరంతరం ఆదా చేస్తేమనం తక్కువ కూరగాయలను వృధా చేయడంభోజనాన్ని బాగా ప్లాన్ చేసుకోవడం మరియు బహుశా ఇంటి నుండి చిన్న సంపాదన కార్యకలాపాన్ని కూడా ప్రారంభించడం ప్రారంభిస్తారు. క్రమశిక్షణ మంచి అలవాట్లుకొత్త నైపుణ్యాలు మరియు కాలక్రమేణా బలమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా విజయం సాధించడంలో మనకు సహాయపడుతుంది. మన పిల్లలు మిమ్మల్ని చూడటం ద్వారా మంచి అలవాట్లను కూడా నేర్చుకుంటారు. ఇక్కడ అత్యంత అందమైన భాగం – మన పిల్లలు ప్రతిదీ చూస్తున్నారు. మనం మన లక్ష్యాల కోసం స్థిరంగా పని చేస్తున్నట్లు వారు చూసినప్పుడు, తద్వారా వారు నేర్చుకుంటారు. కష్టతరమైన రోజుల్లో కూడా మనం వదులుకోకుండా ఉండటం చూసినప్పుడువారు సహనం నేర్చుకుంటారు. మనం ప్రతిరోజూ చిన్న అడుగులు వేయడం చూసినప్పుడుపెద్ద మార్పులు చిన్నస్థిరమైన చర్యల నుండి వస్తాయని వారు అర్థం చేసుకుంటారు.

 మనం మన కోసం మంచి అలవాట్లను ఏర్పరచుకోవడం మాత్రమే కాదు – మెరుగైన జీవితాన్ని ఎలా నిర్మించాలో మనం మన పిల్లలకు నేర్పిస్తున్నారు. అదే తల్లులు ఇవ్వగల గొప్ప బహుమతి.

*

విజయ నాదెళ్ళ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు