ఎంత
అదే గాలీ
అదే నీరూ
అదే ఆకాశాల్ని పంచుకున్నా
నా స్వభావం వేరు
నా భావాలు వేరు
నా అనుభవాలు వేరు
నా స్వప్నాలు వేరు
నా స్వాప్నిక లోకాలు వేరు
నేను స్పందించే దారులు వేరు
నేను సొంతం చేసుకునే తీరులు వేరు
నా పలుకులు వేరు
నా కలం కులుకులు వేరు
నా సంతకం వేరు.అందుకే
ఇది
నా
అదే గాలీ
అదే నీరూ
అదే ఆకాశాల్ని పంచుకున్నా
నా స్వభావం వేరు
నా భావాలు వేరు
నా అనుభవాలు వేరు
నా స్వప్నాలు వేరు
నా స్వాప్నిక లోకాలు వేరు
నేను స్పందించే దారులు వేరు
నేను సొంతం చేసుకునే తీరులు వేరు
నా పలుకులు వేరు
నా కలం కులుకులు వేరు
నా సంతకం వేరు.అందుకే
ఇది
నా
సొంతకం.
*
2
ప్రేమ
నిరంతరం
నిన్ను నువ్వు
నిరూపించుకోవాల్సిందే
నువ్వు
వాళ్ళనెంత ప్రేమిస్తున్నావన్నది
వాళ్ళకనవసరం
నువ్వింకొకళ్ళకి చేసింది
ఇంతింతై
తూగుతుంది
పోలికలు
తేడాలను ఎత్తిచూపడం
ఎంత ఆశ్చర్యమో
బహుశా అంతే సహజమేమో
నిజమైన ప్రేమను
నిరూపించుకోవడానికి
పిడికెడు అటుకులు కూడా కాదు
ఒక్క తులసిదళం సరిపోలేదా!
*
Add comment