అనుకున్నట్టే అయ్యింది
మట్టిని నమ్మి బతికే రైతును మన్ను పాలు చేస్తరని అనుకున్నట్టే అయ్యింది
అనుకున్నట్టే అయ్యింది
ఛాయ్ ని ఏ ప్లాట్ ఫామ్మీదా అమ్మకుండానే
అబద్దాలు చెప్పి వోట్ల బేరం చేసినోడు రేపు దేశాన్ని బ్యారానికి పెడ్తడని అనుకున్నట్టే అయ్యింది
అంతా అనుకున్నట్టే అయ్యింది
కుర్చీ కోసం మనుషులను చంపినోడు
తనను నమ్మినోళ్లను నట్టేట ముంచినోడు
తప్పకుండా నూట ముప్పై కోట్ల మందిని ఏమారస్తడని అనుకున్నట్టే అయ్యింది
అందరూ అనుకున్నట్టే అయ్యింది
సాగు చేసే చేతులకు బేడీలు యేసి
సేఠ్ జీ భట్ జీలు దళాల్ ఔర్ బడివేలూ కలిసి
తిమ్మిని బమ్మిని చేస్తారని అనుకున్నట్టే అయ్యింది
చివరాఖరికి అనుకున్నదే అయితంది
నడిరోడ్డు మీద గుండె పగిలి రైతు కన్నుమూస్తే, సంతోషంతో ఆదానీ అంబానీలకు పూలపాన్పు పరిచే తోడేలును
తన్ని తరమడానికి చర్నాకోలా చేతబట్టి కర్షకులు ముందుకు ఉరుకుతారని
అనుకున్నట్టే అయితంది.
*
Superb
Very nice. Great expression
Greater imagination. Also , please enlighten me about the consequences of Green Revolution. Especially about the changes in the land holding pattern. If possible about the changes in the social strata ( Caste, they call it). Also about the magnitude of mechanisation ; World Vs Punjab and Punjab Vs Other states and the aftermath. Please also tell me why is today’s talk about organic farming . Where How and to What extent Chemical farming started and spread . And and more particularly about exploitation of ground/ underground / overground water ? Say per acre usage of water? Please write a poem , Sir. You can
ఛాయ్ అమ్మటం
స్వామి భక్తి
దేశాన్ని అమ్మటం
దేశభక్తి.
బాగా చెప్పారు. అనుకున్నది అనుకున్నట్టు చేయటమే కదా రాజకీయం. మనం అనుకునేది ఒకటి .రాజకీయం అనుకునేది మరొకటి.
బావుంది సర్
Powerful expression .