గులాబీ పువ్వును
పిడికిట బందించట మంటే
దాని రక్షణ కోసమే !
అది ముళ్ళ మధ్య
నివసిస్తుంది గదా ?
ఇంకాస్త భద్రతను పెంచాం .
దాని ముక్కు పుటలు
మూసేయడం కాదు
అవసరమైతే ఆక్సీజన్
శ్వాసను అందిస్తాం !!
రక్షణ కవాతు చేస్తున్న
మేజర్ మాటలు
అతిసున్నితం గా పలుకుతుంటాడు .
భిన్న జాతుల
పూల తోట
ఎలా నిరసిస్తుంది !?
( ఇటీవల కాశ్మీర్ ప్రాంతానికి అదనపు భద్రత పై )
*
హనీఫ్ గారు కవిత బావుంది. కాశ్మీర్ పరిస్థితి కళ్ళ ముందుకి తెచ్చారు . ఇంతకు ముందు విశాల మైన జైల్లో ఉన్న కాశ్మీర్ దేశభక్తి ముదిరి ఇరుకు జైల్లోకి మారింది.
Good one