చీకటి రాత్రి నేలకి దిగుతోంది
చుక్కల చీరకట్టుకుని
చంద్రదీపం చేతబట్టుకుని
భూమ్మీద శవాల స్థావరం దర్శించి
శాంతి చిరునామా కోసం అన్వేషిస్తుంది
గులాబీలు పూచే మట్టిమీద
ఎర్రని చారికల చారిత్రక సత్యాలనుండి
నిద్రలోనే శవాలై పోయిన అమరుల దేశభక్తికన్నా
హింసోన్మాద నేపథ్యం వర్ణనీయ దృశ్యం
మనిషిని మనిషి ద్వేషించే రుతువులో
ఏ పూలు పూస్తేనేం .?
ఏ వెన్నెల కాస్తేనేం ..?
ప్రేమకు నిర్వచనం మరచిన తోటలో
గాలినిండా ఆర్తనాదాలే
గుండెల్లో నాటుకున్న విషబీజాలు
పెనువృక్షాలై వీచే తుఫాను గాలుల్లో
తల్లి రొమ్ము నుండి పెకలించబడుతున్న
నిర్దోష పుష్పలతలన్నీ నిర్జీవ కుసుమాలే
సముద్రం మరుభూమిగా మారిపోయింది
ప్రాణాలు సమాధులపై పూచే పూలైపోయాయి
మానవతప్పిదం రణక్షేత్రం
ఉగ్రవాదం భస్మాసుర హస్తం
శాంతి శవాన్ని వూరేగిస్తున్న శత్రుసేన
ఇక్కడ నిద్ర కూడా మరణమే
జాగృతి మాత్రం కాలం చెప్పాల్సిన సత్యం ..!
*
Thank you for presenting dear editors