కవిత 2024 కు కవితలకు ఆహ్వానం
విజయవాడ సాహితీమిత్రులు వెలువరిస్తున్న కవిత 2024 కోసం కవితలకు ఆహ్వానం పలుకుతోంది. జనవరి 24 నుండి డిసెంబర్ 24 మధ్యకాలంలో ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురితమైన కవితలను మార్చి 15 లోగా editor.kavitha2024@gmail.com కు పంపండి. వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపుల్లో పెట్టినవి అర్హమైనవి కాదు. పత్రికలలో ప్రచురితమైన కవితల ఇమేజ్ / పిడిఎఫ్ లు మాత్రమే పంపండి. కవితల ఎంపికలో సంపాదకులదే తుదినిర్ణయం.
ఇందులో ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరాలకు తావులేదు.
-విశ్వేశ్వరరావు, సాహితీమిత్రులు పక్షాన
మంగలి జీవితం మీద ఒక కవితా సంకలనం
మంగలి జీవితం మీద ఒక కవితా సంకలనం తెస్తున్నాను క్షౌవరం వాయిద్యం,వైద్యం మంత్రసాని వృత్తులతో వివిధ సేవలందించిన మంగలి జీవితాలను మీ అనుభవంలో ఒక కవితగా పంపీయగలరని మనవి.
– వనపట్ల సుబ్బయ్య 9492765358
Add comment