మిత్రులు, సాహిత్యాభిమానులకి దసరా పండుగ శుభాకాంక్షలు.
మీ ఆశీర్వాదాలు, ప్రోత్సాహంతో ముందడుగు వేసిన మా ప్రయత్నం ఫలించిందని తెలియజేస్తున్నాము.
ఈ దీపావళి పర్వదినాన, సాహిత్య సేవలో అంకితభావంతో సమాజంపై తమదైన ముద్రవేసిన నలుగురు మహనీయులను శ్రీ శారద సత్యనారాయణ స్మారక సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరించబోతున్నాము.
సామాజిక స్పృహతో, సమాజ ఆశయాలను ప్రతిబింబిస్తూ, పిన్నలను, పెద్దలను ప్రభావితం చేసే రచనలు చేసిన ఆఁ మహనీయుల ఇంటికి వెళ్ళి మా బృందం చేత పురస్కారాన్ని అందజేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాము.
సత్కార గ్రహీతల వివరాలను ఇక్కడ వెల్లడిస్తున్నాము చూడండి. అలాగే పురస్కార గ్రహీతలకు మీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేయగలరని ఆశిస్తూ…, ఈ తరహా మా మొదటి ప్రయత్నానికి మీరు చూపిన ఆసక్తి, ప్రోత్సాహాలకి మేము ఎప్పటికీ కృతజ్ఞులమని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.. త్వరలో మరిన్ని పోస్టులు, వీడియోలు మీ ముందుకు రానున్నాయి మీరందరు తప్పక చూడగలరని మనవి.
అలాగే ఈ కార్యక్రమంలో మాకు సహాయ, సహకారాలను, సలహాలను అందించిన మా మిత్రమండలికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
నిర్వాహకులు
ఉమాభారతి కోసూరి & ప్రమీల సూర్యదేవర
Add comment