సారంగ పాఠకులకు, వీక్షకులకు ఉగాది ముబారక్. రంజాన్ శుభాకాంక్షలు. ఈ పండగల వేళా విశేషం ఈసారి సారంగని ఆడియో, వీడియో వైపు కూడా తీసుకువెళ్లడం!
ఇది కొత్త ఆలోచనేమీ కాదు, సారంగ పత్రిక కంటే ముందు సారంగ ప్రచురణలు మొదలు పెట్టినప్పుడే తెలుగు సాహిత్యానికీ, సంస్కృతికీ సంబంధించి ఒక ఆన్ లైన్ వేదిక వుంటే బాగుణ్ణు అనుకున్నాం. అప్పుడప్పుడూ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆడియోలూ, వీడియోలూ పెడుతూ వచ్చినా, అటు వైపు సారంగ పూర్తిగా దృష్టి పెట్టలేదు. అనేక కారణాలు- మొదటిది: మేం ముగ్గురం మా మా వుద్యోగాల్లో తలమునకలుగా వుండడమే!
ఒక యూట్యూబ్ చానెల్ అంటే కేవలం కొన్ని వీడియోల సమాహారం మాత్రమే కాదు. అక్కడ ప్రచురించే ఆడియో వీడియోలకు కొంత సహేతుకత, సార్థకత వుండాలని మా నమ్మకం. అయితే, మొదటి నుంచీ సారంగ లక్ష్యం ఒక్కటే: మంచి సాహిత్యం, సాంస్కృతిక విలువల వెంట నడవడం! మేం ఇక్కడ ప్రచురించబోయేవి కూడా అదే దారిన సాగాలని మా నమ్మకం. దీనికి మీ నుంచి పూర్తి సహకారం కోరుకుంటున్నాం.
ముందుగా మీ నుంచి సారంగ కోరుకునేది : మీరు ఈ చానెల్ కి subscribe చేయడం, నలుగురితోనూ ఇది పంచుకోవడం!
ఇక రచనల విషయానికి వస్తే: ఇదీ విషయ క్రమం-
కథలు:
స్వాతి కుమారి కథ ” చెరువు- చింతచెట్టు”
ఆచంట శారదాదేవి కథ “పారిపోయిన చిలక”
మన్ ప్రీతమ్ కథ “స్టేజీ” చూడండి, వినండి!
కవిత్వం:
ఎన్. వేణుగోపాల్ కవిత – ఏ ఇంటికి రమ్మంటావు?!
వర్మ కవిత : అతనిప్పుడు మాటాడుతున్నాడు
శ్రీనివాస్ సూఫీ కవిత – సేవించటమే పండగ
పుస్తక ప్రపంచం:
అంటరాని వసంతం- మన వెంట వచ్చే పుస్తకం
నా చదువు కథ:
Saranga Editor, Raj Karamchedu: My Reading Habits
నా చదువు కథ భాస్కర్ రాయవరం mp4
దృశ్యాదృశ్యం:
Congratulations Kalpana garu !
It is very well done.