ప్రతిష్టాత్మకమైన సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని పొందిన ప్రముఖ తెలుగు కవి – కె. శివారెడ్డి.. తెలుగు కవిత్వ మాతృమూర్తికి ముద్దుబిడ్డల్లో ఒకరు. సిటీలో నివసిస్తున్నా, సింప్లిసిటీయే ఆయనకు ఆభరణం. ఆగస్ట్ 1, 1967 నుంచి వివేకవర్ధని డిగ్రీ కళాశాల , హైదరాబాద్ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా కెరీర్ ప్రారంభించి, 1999లో ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు. శివారెడ్డి గారి మొదటి కవితా సంపుటి పేరు.. ‘రక్తం సూర్యుడు’. మొత్తం 16 కవితా సంపుటాలు వెలువడ్డాయి. 1990లో మోహనా! ఓ మోహనా! కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ లభించింది. వివిధ దేశాల్లో మన దేశం తరఫున పాల్గొని, తన కవిత్వాన్ని వినిపించిన శివారెడ్డి గారు, వర్ధమాన కవుల్ని ప్రోత్సహించడంలో, వారికి మార్గదర్శనం చేయడంలో.. ముందు వరసలో ఉంటారు.
https://www.youtube.com/watch?v=2ryCkwJ-rhQ&t=3s
Add comment