శాశ్వతత్వం ఓ గొడ్డలి,
హంతకుడు
తన తలలోకి దించుకున్నాడు
శాశ్వతత్వం ఓ చర్య,
భయాన్ని దోపిడీ చేశారు
ఇప్పుడు అక్కడంతా ఖాళీ
శాశ్వతత్వం ఎర్రని కోరిక,
కొన్నెత్తుటిలా, ఆవిరి చెలరేగుతూంటుంది
చివరికి అదీ మేఘమై తేలిపోతుంది
శాశ్వతత్వం హృదయంలాంటిది-
హంతకులు తునాతునకలు చేయడానికి
మొహమాటపడరు.
శాశ్వతత్వం హత్యలాంటిది,
అది మృత్యు ముఖంలాంటి
దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుంది
శాశ్వతత్వానికి చెవుల్లేవు,
లోపలి రహస్యంలా
పకడ్బందీ శ్రవణానందం
శాశ్వతత్వం కన్నులాంటిది-
చనిపోయినా, అలాగే
మరో కంటిలో గుప్పెడు వెలుగు.
శాశ్వతత్వం ఓ దుఃఖం
అనేక దేవదూతల వలెనే
పవిత్రులు కానివారెవరూ లేరు
శాశ్వతత్వం సూర్యోదయంలాంటిది
దాని కాపలా దేవతను మాత్రం
ఎప్పటికీ మేల్కొల్పలేదు.
*
Add comment