లేని కొన్ని వుదయాలను
వున్న తడి రాత్రులను
చలి వేయడం ఆగిన వొకింత సమయాలను
మోసుకు.
రోడ్డున వొంటరి నీడల్ని
లెక్కలోకి
చప్పుడు చెయ్యని మెట్లని
లోలోకి
నిశ్శబ్దంగా వున్న గదిని
శరీరంలోకి
తీసుకు.
చెట్టుమీద
సగం కట్టిన గూడు
యింకా నిద్రిస్తున్నట్టే
ఖాళీ చేయబడ్డ మాటల్ని
గాలి
నెత్తిన మోస్తున్నట్టే
మామూలే మళ్లీ
యెరుకలోకి
వొస్తున్నట్టే
తెలవారి.
*
Add comment