వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు విశ్వనాథుడు.
ఆమె కవితావాక్యాలు చదువరిలో వేయి నెమలీకల స్పర్శను ఏకకాలంలో కలిగించగలవు. ఆమె చేబూనిన కలంలో నింపిన సిరా “ప్రేమ”
“An excellent love poem
Balances literary proficiency
With honest sentiment”
_ Robert Lee Brewer
భాష పుట్టినప్పటి నుండీ ప్రేమ కవిత్వం విరాజిల్లు తూనే ఉంది. ప్రేమ, స్నేహం ఒకదాని వెనక ఒకటి నడిచినట్లు ఉన్నా.. ఒక చిన్న వెంట్రుక వాసి లో స్నేహం ప్రేమ గా మారడం, జరిగి పోతుంది. గిల్గామేష్ మరియు ఎంకీడు లమధ్య స్నేహమో, ప్రేమో, పెనెలోప్ మరియు ఒడిస్సీయూస్ లమధ్య ప్రేమ కానీ, హోమర్ పారిస్ ల మధ్య నెలకొన్న ప్రేమ పై గానీ, ప్రపంచ ఇతిహాసాలలోనే అద్భుతమైన ప్రేమ కవిత్వం వికసించింది. మనిషి ఉన్నన్నాళ్ళు ప్రేమ, వేదన ఉంటుందని చెప్పకనే చెపుతారు సామాజిక పరిశోధకులు …
అలాంటి ప్రేమనూ, వేదననూ అంతే సమపాళ్ళల్లో కవిత్వం లో రంగరించి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్లో నూ ప్రేమ కవితల పాలకంకిగా పేరు తెచ్చుకున్న గీత వెల్లంకి సాహితీ ప్రయాణం పై సారంగ ఇవాళ్టి క్రొత్త కవిత్వ తీరాలు శీర్షిక కు అందిస్తున్నాము….
…
“నీ కిష్టమైన పాటలా
చెవి నుండి హృదయానికి చేరి
నీ పెదవులపై తారట్లాడాలని
నీకు తప్ప మరెవరికి చెప్పలేని
నా డార్క్ ఫాంటసీలు….!!!”
…
“నా ఒంటరి సంధ్యా సాయంత్రపు సరాలు అన్నీ
నీవరుదెంచిన క్షణాన
తెగి కాలం లో కరిగిపోతాయి….
ప్రియా.
కలయికలోని అద్వైతం
నన్ను నిన్నుగా మారుస్తుంది.
ఇక ఉన్నది నేనే!!”
ఇలా ప్రేమలోని అద్భుతమైన అద్వైత స్థితిని ఆవిష్కరించే అనేక కవితా వాక్యాలు రాసిన కవయిత్రే….ఈ కింది వాక్యాలూ తన కవిత్వం లో కనపరచింది..
“ఉన్నట్టుండి మృత్యు కౌగిలికై
ఒక ఆపుకోలేని వాంఛ రేగుతుంది…
మరణపు అమరత్వమేలి ముసుగు తొలగిన
ఆ క్షణం నేనెలా వచ్చానో…
అలాగే అంతర్హితం అవుతాను…”
“మరణపు మేలి ముసుగు” అని ఒక శీర్షికలో రాసిన ఈ నిర్వేద కవిత్వాన్నీ గమనించాలి.. ఒక వస్తువు కు ఇంకో వస్తువు కు కానీ, ఒక అభివ్యక్తి కి ఇంకో అభివ్యక్తి కి గానీ, శైలి గానీ సంబంధం లేకుండా ఎంతో నేర్పుతో రాసిన ఈ వాక్యాలు గమనించాల్సిందే.
“ఆమె ఒక అధోముఖయై
అంతరాంతరాల్లో నిర్వేదం నింపుకొని
నిశ్చలంగా నిరామయంగా ఉన్న కన్నులతో…
ఎటు చూస్తుందో తెలియనట్లు
ఒక పరిత్యక్తలా కాంతి విహీనంగా
నిస్త్రాణంగా పడి ఉంది…’
తన అక్క ఆసుపత్రి లో ఉన్న సమయం లో తనలోని వేదన ను ఆ పరిస్థితి ని అప్పటికప్పుడు వేదనతో రాసిన ఈ కవిత్వం ఎవరిని కదిలించదు…? పైగా ఆమె కవితల నడక సరళంగా కనిపిస్తూనే పదసంపద, భావగాంభీర్యం చకితుల్ని చేస్తుంది.
***
కొత్త కవిత్వ తీరాలు కు గీత గురించి రాయాలని అనుకుని ఫోన్ చేయగానే,… ఆమె స్పందించిన తీరు చాలా ఆశ్చర్యం వేసింది. ఫేస్బుక్ లో ప్రేమ కవిత్వానికి చిరునామా గా మారిన గీత కవిత్వ ప్రయాణంలో ప్రేమ కాదు పెయిన్ ఉంది. గాయం నుంచే గేయం పుడుతుందనేది మరోసారి నిరూపణ అవుతోంది..
పూలు, వెన్నల, హరివిల్లు, గోదారి నడక,.ఇలాంటి వర్ణనలతో భావ కవిత్వం గొప్పగా రాస్తున్న గీత వెల్లంకి పుట్టింది..ఏలూరు. 9 వరకు తాడేపల్లి గూడెం లో చదివారు. పదవ తరగతి విజయవాడ లో చదివి, తర్వాత ఢిల్లీ కి వెళ్లి కాలేజి లో చేరాలని ప్రయత్నించడం, తిరిగి హైదరాబాద్ కు రావడం, జరిగింది. ఢిల్లీ లో ఉండగానే, హిందీ పాటలతో పరిచయం, కాస్త కవిత్వం అనే ఒక అంశం ఉంటుందని తెలుసుకొన్నారు.
హైదరాబాద్ లో ఇంటర్ , డిగ్రీ చదివారు.
అమ్మ కడుపులో ఉండగానే గీత తండ్రి మరణించారు. చాలా చిన్న వయసులోనే భర్త ను కోల్పోయిన అమ్మ తన పట్ల ప్రవర్తించిన తీరు ను గీత ఎలా కవిత్వం చేసారో “సారంగ” తో పంచుకొన్నారు.
“ నాన్న అర్ధాంతరంగా మాయమైతే,
నీవు కోల్పోయిన సహచర్యం అలా చేసిందా?
నీలా కాకూడదని
మనసు నిబ్బర పరచుకొని
సఖుని కోల్పోయిన వియోగ యోగం లో యోచిస్తున్న!
మనో వేదనల్ని మరుగుపరచి
నా కంటి పాప ను నేను కాపాడు కుంటాను.”
నాలా మాతృ ప్రేమ రాహిత్యానికి గురి కాకుండా…”
ఇంటర్మీడియట్ లో ఉండగానే గీత తల్లి మరణించారు. గీత తల్లి పెట్టిన బాధ ను అలాగే దిగమింగు కొని తన వేదన ను అక్షరాల్లో వొలికించారు.
ఏ.వి. కళాశాల లో డిగ్రీ చదివారు. డిగ్రీ చదివిన తర్వాత ఆపిల్ కంప్యూటర్స్ డీలర్ దగ్గర ఉద్యోగం లో చేరారు. అక్కడే డి.టి.పి. నేర్చుకోవడం జరిగింది.
1998 లో చంద్ర మోహన్ అనే వ్యక్తితో వివాహం కావడం, ఆ తర్వాత ఒక పాప హరిత కు జన్మ నివ్వడం జరిగింది. ఒక కవిత్వం మినహా, అన్ని సాహిత్య ప్రక్రియల్లో భర్త చేదోడు వాదోడు గా ఉండటం అంత ఆమెకు ఒక తీయటి జ్ఞాపకం.
2009 మే నెలలో భర్త హఠాత్తుగా మరణించడం. భర్త ఉద్యోగం కంపాషినేట్ గ్రౌండ్స్ కింద ఆమెకు ఆ ఉద్యోగం రావడం ఆ కుటుంబానికి ఒక ఆసరాగా అయ్యింది.
ఆమె మాట్లాడుతూ… తనకు ఏడుగురు అక్కచెల్లెళ్ళు ఉండగా, ఇప్పుడు కేవలం ముగ్గురమే ఉన్నామని చాలా వేదనతో చెప్పుకొచ్చారు. దాదాపు అన్ని మరణాలను దగ్గరగా చూసిన గీత ఒక వేదనాత్మకమైన మరణం అనే అంశంపై కవిత్వాన్ని ఎలా మలచిందో చూడండి…
“అసలే వేడి తట్టుకోలేని నాకు
ఇంత మంటల్లో ఏం పని
లేచి కుర్చోనా అని ఆలోచిస్తున్నా
…
ఒరే
పొండిరా ఇంకా తిరిగి చూడకుండా
మీ బతుకు మీరు బతకండి
…..నేనిక్కడ చివరి పంక్తులు కొన్ని రాసుకోవాలి …”
ఈ కవిత్వం ఆత్మాశ్రయ కవిత్వ కోవ కు చెందినదా? సార్వజనీనమా? అని అడిగితే రెండూ అని చెప్పవచ్చు. ఈ కవిత టైటిల్ అంతిమ సంస్కారం.
“జీవితంలో
అగ్ని ఉంటుంది…
జీవితం లో దాస్యం ఉంటుంది.
జీవితం లో యుద్ధం ఉంటుంది.
జీవితంలో కలలు ఉంటాయి…
దుఖానికి ఆనందానికి కళ్ళు చెమర్చడము ఉంటాయి.
జీవితం లో మరణమే కాదు
పునరుజ్జీవనం కూడా ఉంటుంది.”
ఇంతటి ఫిలసోఫికల్ థాట్ ను ఎలా ఇంజెక్ట్ చేసారో ఆ కవితలో ఆశ్చర్యమే వేస్తుంది. పెద్దగా నోరు విప్పరు. సహన శీలి. ఒక వైపు ఉద్యోగం వృత్తి గా.. కవిత్వం ప్రవృత్తి గా ఆమె అద్భుతంగా కవిత్వాన్ని పండిస్తున్నారు.
మొట్ట మొదట కవిత ఇంటర్ మొదటి సంవత్సరం లో రాసారు. తన స్నేహితురాలు జరీన పర్వీన్ కోసం ఆమె రాసిన ఈ కవితలోని కొన్ని వాక్యాలు చూడండి.
“ఇది నా జీవితపు ఎడారిలో
ఎండమావిలా అగుపించితివో
ఎండు మ్రోవి నా ఎద చాటున చిగురాకుగా చలించితివో
నాలో నాదం పలికించాలని
నన్నో పక్కన శ్రుతి చేస్తూ
చాపిన నీ చేతిని అందుకొనే వేళకై
అరక్షణం ఆగితే,
అందరాక పోయావేం?”
అంత చిన్న వయసులో, బహుశా, ఆ అమ్మాయితో చిరు బేధాలు రావడం మూలాన , ఆ తర్వాత రాసిన ఈ కవిత లో అభివ్యక్తి, ఆ శైలి ని చూస్తే, బాల్యం లోనే ఈమెకు కవిత్వం అబ్బిందని చెప్పక తప్పదు.
1998 వరకు కవిత్వాన్ని రాసిన గీత, ఎందుకో ఆ తర్వాత కవిత్వం రాయడం ఆపేశారు. భర్త కు కవిత్వం అంటే ఎందుకో నచ్చేది కాదన్న ఒకే ఒక కారణం తో ఆమె తన కవిత్వాన్ని నిలిపి వేసారు.
….
ఆ తర్వాత చాల రోజుల గ్యాప్ తర్వాత 2017 డిసెంబర్ నెల నుండి కవిత్వం రాయడం మొదలు పెట్టారు. ఒక ఫోటో చూసి, చాల ఉత్తేజితమై కొన్ని కవితా వాక్యాలు రాసారు. చూసిన ఫ్రెండ్స్ తిరిగి ప్రోత్సాహం ఇవ్వడం తో, గీత తిరిగి సీరియస్ పోయెట్రీ లోకి మళ్ళీ కాలు పెట్టారు.
పురోగతి లేని ప్రతిభ నిస్సారమవుతుంది. క్రమంగా తన కవిత్వాభివ్యక్తికి పుటం పెట్టుకుంటూ ఆమె కవిత్వం లో పరిణతి ఎలా సాధించిందో… మనం గమనించ వచ్చు. భావ కవిత్వం, ప్రేమ కవిత్వం, రొమాంటిసిజం అధికంగా అగుపించే ఆమె కవిత్వం ఇవాళ అందరిని అబ్బుర పరుస్తోంది…
2017 లో….
“ గతించిన క్షణం
జ్ఞాపకంగా మారితే
గుండెల్లో దాగుంటుంది…
రాబోయే కాలానికి
రసస్ఫూర్తై నిలుస్తుంది”
…
…
“నీ జ్ఞాపకం
ఒక కాంతి కిరణం
చెంతలేని ప్రతి క్షణం
నీ స్మరణం “
..
“తోక చుక్కలా…
జీవితం లోకి దూసుకు వచ్చి
ఉల్కాపాతానికి గురి చేసావు.
నీవెక్కడున్నవా? అని
వెతకబోతే,
గ్రహాంతర వాసిలా మాయమయ్యావ్”
2018 లో….
“ నీ ముందు నేను
సైకత రేణువునై
దాహార్తి తో అలమటిస్తున్నప్పుడు
నీ అనురాగం హర్షించి,,
సేద తీర్చి, చెంత చేర్చి,
నాలో మమేకమై నీవు..”
..
..
మరో కవిత…..
“ఓ గాఢమైన డిజైర్
నీతో ఉండాలని, అంతే
ఎక్కువ రిక్వైర్ మెంట్ లు ఏమీ లేవు నాకు
ఎందుకంటే, నీతో పంచుకొన్న క్షణాలు
నన్ను రిజునివేట్ చేస్తాయి.”
…
…
2018లోని మరో కవిత…
“నేనూ ఆకాశం
కవిత్వాన్ని చెప్పుకొంటాం
ఒకరిపై ఒకరం వాలి
ఆకాశం వైపు చూస్తే,
నేను కిందుంట..
తన వైపు నుండి చూస్తే
తన మీద నేనుంటా
అప్పడప్పుడు మబ్బులు వస్తాయి.
చినుకులు నాపై విసిరేస్తాయి.
నక్షత్రాలోచ్చి మా మొఖాలు
వెలిగించి పోతాయి.
గాలి మాత్రం నీలి రంగు ని
మోసుకొని, ఇద్దరినీ తాకుతూ
తిరుగుతుంటుంది..
ఎంతసేపైనా సరే….
నేనూ ఆకాశం అంతే…!
నేను తనకి…..తనకి నేను…!”
2019 లో ఆమె కవిత్వపు తీరు….ఆ గాఢత, ఆ సాంద్రత పరిశీలించాలి. విభిన్నమైన ఆమె పరిణతి ని, ఆ కవిత్వ తీరును ప్రశంసించకుండా ఉండలేము…
2019 లో కవిత్వం …
నేను నా కొత్త రంగు
“ బెరడు రాలుతున్న చెట్టు కింద
నీవు రాని బెంగను పోగేస్తూ నేను..
నీవు కనిపించిన సంభ్రమం లో
నేనే ఒక చివురాకునై ….
కొత్తగా, సరికొత్త రంగులో
జీవితం చెంత…”
..
2019 లో మరో కవిత…
“మొన్నటి వాన
వర్షం నిన్ను నన్ను తడుపుతోంది.
నీవక్కడా..
నేనిక్కడ…
మధ్యన కొన్ని చినుకుల దూరం
ప్రతి చినుకు ఒంటరిదే నట
అచ్చం నాలాగే..”
రెండు సంవత్సరాల కాలం లోనే ఆమె భావ ప్రకటన లో, ఆ కవిత్వ నడక లో అద్భుతమైన పరిణతి ని సాధించింది అనడానికి పైన పేర్కొన్న కవితలుచెప్పుకోవచ్చు
….
ఇలాంటి భావ కవిత్వం రాస్తున్న గీత సామాజిక అంశాల పట్ల కూడా అంతే శ్రద్ధగా స్పందిస్తూ,కవిత్వం రాస్తూ వస్తున్నారు.
“ఒకప్పుడు ఒక సైనికుడు ఉండేవాడు
అతడు నిజం తుపాకినే ధరించే వాడు.
కళ్ళల్లో దయా జాలికనపడ కుండా
టోపీ ధరించే వాడు.
ఎండనక..వాననకా..
పోరాటానికి సన్నద్ధంగా ఉండేవాడు.
అతడికి కుటుంబం అంటే…
దేశం మొత్తం.” ఈ చివరి వాక్యమే ఆమె సామాజిక అంశాల్ని ఎంత బలంగా వ్యక్తీకరించగలదో చెప్తుంది.
మరో కవిత-
“డిప్రెషన్ మెట్లు”
‘అప్పుడప్పుడు చెట్లెక్కుతా…
ఎక్కుతున్నామని తెలియని
ఎంతకూ తరగని
ఎత్తైన
డిప్రెషన్ మెట్లు ….
ఎక్కడం మన చేతుల్లో ఉండదు.
మనో నిబ్బరపు పారాచూట్ లు
మనతోనే ఉంటాయని గమనించుకొని
దిగిపోవాలి..
ఎవరైనా ఎక్కబోయినా…
చేయి అందించి లాగేయాలి..”
చదువరిని చైతన్యవంతం చేయగలిగి మనోధైర్యాన్ని ఇవ్వగలుగుతున్న ఈ అభివ్యక్తి గీత ఏ వస్తువైనా ఎంత పవర్ఫుల్ రాయగలదో చెప్తుంది.
కానీ.. నిరాశానిస్పృహలూ, అశక్తతా అసహాయతా వంటివి జీవితంలో సహజమైనప్పటికీ అక్షరాల్లో ఒంపటం ఇష్టపడదు. “ప్రేమ” ను సిరాగా చేసుకున్న తన కలంతో ప్రేమనే ఎప్పటికప్పుడు కొత్తగా సృజియించే ప్రయత్నం చేయటాన్నే ఇష్టపడుతుంది. ప్రియతమునికై నిరీక్షణ
విరహం ఎక్కువగా కనపడే గీత కవిత్వంలోని ప్రేమ ను నిర్వచించ మాటలు వెతకాలి. తన కవిత్వంలోని ఊహాప్రపంచంలో ప్రియుడు తానే ప్రేయసీ తానే ప్రేమా తానే. ప్రేమతో ప్రేమరాహిత్యాన్ని జయించవచ్చని నమ్ముతుంది. తనను రిజువెనేట్ చేసుకుంటుంది.. పాఠకుల్నీ రివైటలైజేషన్ వైపు నడిపిస్తుంది. జీవితంలో పునరుత్తేజం చెందడం కంటె గొప్ప ప్రయోజనం ఏముంటుంది. గీత కవిత్వం ఆ పని చేస్తుంది.
***
కవిత్వం గురించి ఏమైనా చెప్తారా అన్న ప్రశ్నకు , నేను రాసింది నథింగ్. ఇంకా చదవాలి.. ఇంకా అధ్యయనం చేయాలి. కవిత్వం లో సాహిత్యం లో అందరూ నిత్య విద్యార్థులే, కవిసంగమం లో శీర్షిక ల ద్వారా, అక్కడ కవిత్వం ద్వారా నేర్చుకొన్నది చాలా ఉంది. ఎలా రాయాలి ? అన్న అంశం బాగా తెలిసింది.
….
జీవితం లో ప్రతి నిముషం హర్ట్ అవుతూనే ఉంటాను సర్.. హార్ట్ కానట్లు సంతోషంగా ఉన్నట్లు నటించాల్సి ఉంది. మనిషికో ముసుగు కావాలి. జీవితం లో నటించడం తెలియాలి. అది తెలీక చాలా సార్లు దెబ్బ తిన్నాను. ముక్కు సూటిగా మాట్లాడటం ఈ సాహిత్య రంగం లో కష్టమే. ఇంత వయసొచ్చాక ఎలా సమాజాన్ని అవగాహన చేసుకొని మారాలి? ఎలా ముసుగు వేసుకోవాలి? అని చాల నిస్సహాయంగా ఆమె చివరగా సారంగ తో మాట్లాడటం ఎంత వేదనలో ఆమె అలా మాట్లాడారో అనిపించింది.
సాహిత్య రంగం లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అంత ఎత్తు ఎదగక పోయినా.. మన రాయడం ఒక్కటే మనం చేయగలగాలి. రాస్తూ ఉండాలి..
ప్రతి మనిషిలో ఎంతో కొంత నేర్చుకోనేది ఉంటుంది.
సారంగ… అత్యద్భుతమైన పత్రిక. అది ఒక మహా సముద్రం. దాంట్లో నుంచి బయట పడటం కష్టం. ఒక వ్యసనం. అక్కడి కథలు. కవితలు. విశ్లేషణలు.. ఇలా చదివే కొద్దీ ఒక అద్భుతమైన భాండాగారం. అఫ్సర్ గారికి వేవేల ధన్యవాదాలు ..
“చాల సంతోషంగా, అద్భుతంగా అనిపించింది. అఫ్సర్ గారు మేగజైన్ లో నా గురించి రాయడం ఊహ కు కూడా అందని విషయం.. కొత్త కవిత్వ తీరాలు శీర్షికలో చోటు దొరికితే, అది వారికి తమ సాహిత్య ప్రయాణం లో ఒక కీలక ఘట్టం గా చెప్పవచ్చు. “
ఇలా ఒక గంట సేపు గీత వెల్లంకి గారు సారంగ తో అద్భుతంగా తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.
నాలోని చాలా కోణాలు స్పర్శించిన ఇంటర్వ్యూ… అది’నేను’ అని ఖచ్చితంగా తెలియచెప్పేది .. సురేష్ గారు చాలా శ్రమకోర్చి అత్యంత సరళ భావాలతో నన్ను నేను దర్శించుకునేలా చేశారు. ఒక డాక్యుమెంటరీ చూస్తున్నట్లు అనిపించింది. ఇలాంటి శీర్షికలో నాకు చోటు కల్పించేందుకు అఫ్సర్ గారికీ, సారంగా ఇతర టీం మెంబర్స్ కీ, సీవీ సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏
ధన్యవాదాలు గీత జీ..
Well narrated introduction of Mrs Geeta vellanki petry in saaranga. Her poems are well equipped words. She is very active and always gives suggestions to new writers.
Congratulations to geetha vellanki garu
Parichayam chesina suresh gariki dhanyavaadaalu
Thank u అండీ
ధన్యవాదాలు సర్ మీ స్పందన కు
అద్భుతం ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు💐💐💐💐💐💐💐
Thank you Neelima ji
ధన్యవాదాలు నీలిమ జీ
నవ్వుల వెనుక కన్నీళ్ళను మా ముందు పెట్టారు సార్ .ప్రేమ వెనుక విషాదం మాకు చూపించారు.ఎవరికి తెలియని గీతక్క జీవితం చదువుతుంటే గుండె బరువెక్కింది.గీతక్కను కేవలం ప్రేమ కవితలకే పరిమితం చేయకుండ తన కవితలోని వేదనను,మరణం గురించి రాసిన తాత్వికతను గూర్చి చెప్పడం చాలా బాగుంది సార్ .గీతక్కకు మనసారా శుభాకాంక్షలు.
థాంక్యూ గోపాల్
Excellent poetess 🌹
She knows how to keep emotions in words very perfectly.
థాంక్యూ అండీ
కొత్త కవిత్వతీరాలు. లోప్రేమకవితల పాలకంకి గా పేరు తెచ్చుకున్నగీత వెలంకి gari పరిచయం బాగుంది. మనిషికో ముసుగు కావాలి, జీవితంలో నటించడము తెలియాలి,!ఇలాంటినగ్నసత్యాలను తెలిపిన, గీత గారికి,ప్రేమను సిరగా చేసుకున్న తన కలం తో ప్రేమ కవితలు రాసే గీత వెలంకి గారికి,అభివందనలు,అభినందనలు.💐👌
థాంక్యూ అండీ
కవిత్వం చదవడంతో పాటు కవయిత్రి గురించి తెలుసుకుని చదవడంతో మరింత ఆత్మీయత పెరిగినట్లనిపిస్తుంది గీత గారి పరిచయంతో..చాలా చక్కగా పరిచయం చేసారు సురేష్ గారు .
ధన్యవాదాలు విజయ జీ
థాంక్యూ మేడమ్
గీత గారి పరిచయం చక్కగా చేసారు సీవీ సర్.. మీ ఇద్దరికీ అభినందనలు 💐 💐
అప్పుడప్పుడు చెట్లెక్కుతా…
ఎక్కుతున్నామని తెలియని
ఎంతకూ తరగని
ఎత్తైన
డిప్రెషన్ మెట్లు ….
ఎక్కడం మన చేతుల్లో ఉండదు.
మనో నిబ్బరపు పారాచూట్ లు
మనతోనే ఉంటాయని గమనించుకొని
దిగిపోవాలి..
ఎవరైనా ఎక్కబోయినా…
చేయి అందించి లాగేయాలి..”
ఇక్కడ నేను చాలా కనెక్ట్ అయ్యాను.
ఆ మెట్లు దిగడం రాకపోతే జీవితం అగమ్యగోచరమే..
అలాంటి సందర్భాల్లో ఎదుటి వారిని కాపాడేందుకు మనల్ని మనం కాపాడుకునేందుకు ఎరుకతో ఉండటం అవసరం.
తర్వాత ఈ ఒక్క పదం నన్ను చాలా ఆకట్టుకుంది.
అతడికి కుటుంబం అంటే…
దేశం మొత్తం🙏🙏
నటించడం తెలియాలి. అది తెలీక చాలా సార్లు దెబ్బ తిన్నాను. ముక్కు సూటిగా మాట్లాడటం ఈ సాహిత్య రంగం లో కష్టమే అన్నారు.
( ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏ రంగంలో అయినా కష్టమే.. మనం మనలాగే సాగుదాం..)
ఇంత వయసొచ్చాక ఎలా సమాజాన్ని అవగాహన చేసుకొని మారాలి? ఎలా ముసుగు వేసుకోవాలి?
అవును.. చాలా చాలా మదనపడాల్సి ఉంటుంది ఆ సంధర్బాలుఎదురైనప్పుడు.
సంఘర్షణ తో నలిగిపోవాలి.
ఇద్దరికీ అభినందనలు 💐 💐
శుభాకాంక్షలు 💐💐
థాంక్యూ అండీ
గాఢమైన, నిగూఢమైన వ్యక్తీకరణ శైలి గీత గారి ప్రత్యేకత. చదివిన ప్రతిసారీ, ప్రతి కవితా మనసును తడిమేస్తుంది, తడిచేస్తుంది. ఈ పరిచయం ద్వారా మరిన్ని వివరాలు తెలిశాయి. కవిత్వం వెనుక ఆర్ద్రత అర్థమైంది. గీత గారికి అభినందనలు. మీకు ధన్యవాదాలు.
థాంక్యూ సో మచ్ అండీ
Geetha garu chala baga rastharu … mana gundelanu thakutaru … vari kavithwam naku estam … chalasarlu varu rase kavithwamlo nannu nenu chusukuntanu .. fb lo naku nachhe poet veray … mm
థాంక్యూ అండీ
Excellent interview Sir
Congratulations to you and
Geetha Ma’am
💐💐💐
థాంక్యూ సో మచ్ అండీ
థాంక్యూ అండీ
చాలా మంచి పరిచయం సురేశ్ గారూ . గీత గారి కవితలలో ఆవిడ పదసంపద బావుంది. అభినందనలు
థాంక్యూ అండీ
కవిసంగమం ఇచ్చిన స్నేహల్లో ఒకరు.. నాకిష్టమైన భావకవిత్వపు మాధుర్యానికి చిరునామాగా గీత ఈరోజు సారంగకు అతిధి కావడం సంతోషంగా ఉంది…టైటిల్ ..లీడ్..
విశ్లేషణకి తీసుకున్న కవితా వాక్యాలు మీ అభిరుచిని ప్రతిబింబిస్తూ ఆకట్టుకున్నాయి సర్..ముఖ్యంగా కాల గమనంలో మారిన తీరును చూపడం నచ్చింది.తీసుకున్న కవితా వాక్యాలు ఎంపికలో అభిరుచిని ప్రతిబింబిస్తూ..ఆమె పరిశీలనని సందర్భాలని కవిత్వం చేసే నేర్పుని చూపుతున్నాయి….
ప్రేమ విరహంగా మొదలైన ఆమె కవితలు క్రమంగా అద్వైత మనదగ్గ గాఢతను సంతరించుకోవడం …అసలైతే క్రమం తప్పకుండా రోజువిడిచిరోజు కవిత పోస్ట్ చేయగలిగే తీరు అబ్బురమే.. వ్యక్తీకరణ లో వైవిధ్యం..పద లాలిత్యం నాకు చాలా ఇష్టం..సి వి.సర్ గారి వల్ల ఊరూరా కవిసంగమం
లో గీతా గారిని కలిసే వీలు కలిగింది..తన చుట్టూ సాహిత్యాన్ని సంతోషాన్ని ఇష్టపడే ఆమె కవితల్లో ఊహాత్మక సౌందర్య మాయ అందరినీ ఆకట్టుకుంటుంది..
మీరన్నట్టు నిరాశా నిస్పృహ లు,
అశక్తతా అసహాయతా వంటివి జీవితంలో సహజమైనప్పటికీ అక్షరాల్లో ఒంపటం ఇష్టపడదన్న మాట నిజం..వ్యక్తిగా తను మోస్తున్నదేదైనా తన అక్షరాల్లోనే సాంత్వన వెతుకుతున్న ఆమె సంతోషకరమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నా..గీతా త్వరలో మీ భావ విపంచి నెమలీక గుత్తులుగా పోత్తమై వస్తారని ఆశిస్తూ… శుభాకాంక్షలు నేస్తమా…
శుభాభినందనలు సర్..కొత్త కవిత్వ తీరాన భావకెరటపు మాధురీ వెల్లువని , చక్కగా విశ్లేషించారు..సారంగా కి ధన్యవాదాలు..
థాంక్యూ రాజేశ్వరి… నిజంగా ఎంత సంతోషమే నీ కామెంట్ చూస్తే.. నన్ను తెలుకున్న వ్యక్తులలో మీరూ ఒకరు.. థాంక్యూ
గీతా వల్లంకి మేడమ్ కవితలు ముళ్ళ గులాబీలు..
ఏ జ్ఞాపకాల సుగంధాలనో రేపి, గుచ్చి ఎదను ఏడిపించుకు తింటాయి..
ఇప్పటి రోజుల్లో నాకు చాలా ఇష్టమైన కవయిత్రి ఆవిడ💐, కవి మరొకరున్నారు..
Suresh sir మీ సమీక్ష కుడోస్ 💖
Thank u ji
అనురాగపు ఆర్టిని ఇలా ప్రకటించడం హృదయాన్ని మెలి పెట్టె కొత్త గిలిగింత లా ఉన్నది గురువు లా పూజ్యత లా మెరుపు మెరిసింది మెనూ యేమివ్వగలం🙏🙏🙏 తప్ప
Thank u so much
గీతా వెల్లంకి మేడమ్ కవితలు ముళ్ళ గులాబీలు..
ఏ జ్ఞాపకాల సుగంధాలనో రేపి, గుచ్చి ఎదను ఏడిపించుకు తింటాయి..
ఇప్పటి రోజుల్లో నాకు చాలా ఇష్టమైన కవయిత్రి ఆవిడ💐, కవి మరొకరున్నారు..
Suresh sir.. కుడోస్ 💖
Thank u
Life is a tragedy when seen in close-up, but a comedy in long-shot.
Charlie Chaplin …
చాప్లిన్ గారి quote ను బాగా లోతుగా అర్థం చేసుకున్న కవియిత్రి గీతగారు.వారి కవిత్వం ప్రేమ సంబంధమైన విషయాల చుట్టూ తిరుగుతున్నా , బాగా గమనించ గలిగితే అంతర్లీనంగా వేదనను ముఖ్మల్ బట్టలో కప్పెట్టేసి జిలుగు వెలుగుల జరీ తో కవిత్వాన్ని అల్లేస్తారు…. ”నాకు వర్షంలో నవ్వుతూ నడవడమంటే ఇష్టం, ఎందుకంటే వర్షంలో నా కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించవుగా😊””…అని అంటాడు చాప్లిన్. గీత గారిలో ఓ చాప్లిన్ దాక్కోనున్నాడేమో అని నా అనుమానం!!
గీతగారిలో నచ్చిన విషయం..ఆమె స్పాన్టనిటీ, ఆత్యంత వేగంగా కవితలల్లేయడం!!
సురేశ్గారూ!! గీతగారి విద్వత్తును సమగ్రంగా సమీక్షించిన మీకు శుభాభి నందనలు…. గీతగారికి శుభాకాంక్షలు💐💐💐💐💐💐💐💐
Venugopal Sir.. Thank u for ur affectionate n lovable comment.
పైపైన చిన్న నది లాంటి గీత గారే నాకు తెలుసు… లోలోపల ఆమెలోనే ఎన్ని సముద్రాలు ఉన్నాయో కదా అనిపిస్తుంది. పైకి కనిపించినంత ఆహ్లాదంగా జీవితం ఉండదని ఒక సందేశం అందుతుంది. ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొని అన్నిటినీ సమానంగా తీసుకునే పరిపక్వత వారి ద్వారా నేర్చుకోవాలి. ఆమె గొంతుకలో ఓ ఠీవి, ఓ ఆత్మవిశ్వాసపు స్వరం ధ్వనించడం నాకూ అనుభవమే. వారి కవిత్వం గురించి అందరికీ విధితమే. ఓ అద్భుతమైన కవిత రాయడం ఆమెకు సర్వసాధారణ విషయం. గీత మేడం లోని ఓ సున్నిత పార్శ్వాన్ని….మాకు తెలియని వారి జీవన గీతాన్ని పరిచయం చేశారు…. ఓ ఆర్టికల్ ఆపకుండా ఏకబిగిన చదివించింది అంటే అది దాదాపు CV సురేష్ సార్ ఆర్టికల్ అయి ఉంటుంది అని మరో సారి రుజువు అయింది. Congrats Geeta madam…. Thank you CV sir.
Juned .. Thank u for ur exclusive comment!
సర్ ‘కొత్త కవిత్వ తీరాలు’ లో గీత గారిని చదువుకోవడం సంతోషంగా ఉంది. మీరు రాసిన ప్రతీ అక్షరం గీత గారి కవిత్వం డిజర్వ్ చేస్తుంది. అన్ని కోణాల్లోనూ ఆమె కవిత్వాన్ని కవిత్వ ప్రయాణాన్నీ సమగ్రంగా ఆవిష్కరించిన వ్యాసం. చాలా విషయాలు తెలుసుకోగలిగాం. మీరందించిన తన జీవిత విశేషాలు చదివాక తన జీవితం కవిత్వంది ఓ విరోధాబాస గా, తన సంఘర్షణ అక్షరాల్లో పెద్దగా కనపడనివ్వకపోవటం తన గొప్పతనంగా అర్థమైంది. ప్రేమ ను సిరాగా నింపుకున్న ఆమె కలం ఇతర అంశాలనూ ఎంతో ప్రభావవంతంగా వ్యక్తీకరించగలదు. మీరు చెప్పినట్టు.. ప్రేమరాహిత్యాన్ని ప్రేమతోనే జయించటాన్ని తన కవిత్వ విధానం చేసుకున్నారు గీత గారు. దాదాపుగా ఆమె కవిత్వాన్ని ఫాలో అయే పాఠకులలో ఒకరిని. తన కవిత్వ పరిణామ క్రమం మీరు సంవత్సరాల వారీగా ప్రజెంట్ చేయటం చాలా బావుంది సర్. జీవితంలోని సంఘర్షణ, కవిత్వంలోకి ఒంపటం ఇష్టపడని.. ఆమె కవిత్వంలో కూడా సంక్లిష్టత ఉండదు. అతి సరళ పదాలలో అత్యంత భావ గాంభీర్యం నింపటం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వారు ఉపయోగించే పద సంపద నుంచీ చాలా నేర్చుకున్నా. మీరన్నట్టు తనను కవిత్వంలో రిజెనువేట్ చేసుకుంటూ ప్రయాణం సాగిస్తున్న గీత గారు కవిగా సంతోషం పొందాలని కోరుకుంటున్నా.
మీరు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యాసం.. తన అక్షరాల పట్ల గౌరవాన్ని ద్విగుణీకృతం చేసిన వ్యాసం. ఇరువురికీ హృదయపూర్వక అభినందనలు. 💐💐
Phani Madhavi … U r an affectionate poetess n a pal. Thank u for love and ur help in this article!
నా చిన్న చెల్లెలు గీతా గొప్పగా కవితలు, ఇంత మంచి పేరు తెచ్చుకుందంటే చాలా ఆనందంగా వుంది.
సురేష్ గారు మీరు ఇంటర్వ్యూ చేసి చాలా చక్కగా రాశారు. కృతజ్ఞతలు సురేష్ గారు గీతా జీవితంలో ఇంకో అడుగు విజయవంతంగా వెయ్యడానికి సహకరిస్తున్నారు.
Thank u very much for ur love Nagakka.
చాలా బావుంది సురేష్ గారు ..గాయం ఎన్ని గేయాలు రచిస్తుంది కదా … అభినందనలు గీత వెల్లంకి గారికి
చాలా ధన్యవాదాలు మీ స్పందనకు వాణి గారు..
Thank u andi
Nice kavitalu…
Great Geetha Vellanki
Thanks andi
ప్రేమ నిండిన మనసుతో, ప్రేమాక్షరాలను నిరంతరం చల్లుతూ, ప్రేమలోకంలో అందరినీ విహరింపజేస్తున్న మిత భాషి, మధుర మనస్వి అయిన గీతా వెల్లంకి గారి కవితా ఝరిని మాకు పంచి పెట్టిన శ్రీ సురేష్ గారికి ధన్యవాదములు..
చాలా చాలా ధన్యవాదాలు మీ స్పందనకు
Thank u dear
😘 నాకు మాటలు లేవు మా గీత ప్రభంజనం చూసి. గుండెల్లో ఆనందం నిండి పోయింది సురేష్ గారి సమీక్ష చదివాక. నాకు ఇప్పుడే తెలిసింది ఈ సారంగ పత్రిక ఉందని. మా గీత కవితలు బాగానే అనుసరిస్తుంటాను. ఒక్కోసారి ఏం కామెంట్ పెట్టాలో తెలీదు. గుండెనో, నరాన్నో ఒత్తేస్తుంటాయి కొన్ని కవితలు. సురేష్ గారి విశ్లేషణ సముద్రాన్ని మధించి ముత్యాలు, రత్నాలు ఏరి తెచ్చి అందంగా దండ గుచ్చి మన ముందు ఉంచినట్లు ఉంది. పాలకంకి తిన్నంత రుచిగా ఉంది. ఇందులో మాకు తెలియని మా గీత కూడా దాగుంది. మా చెల్లిలో దాగిన సముద్రగర్భాన్ని శోధించి సారంగ ద్వారా మన ముందు ఉంచిన శ్రీ సి.వి. సురేష్ గారికి ధన్యవాదాలు.👏👏👏
మీరన్న ప్రతి మాట నిజ0..
మీ విలువైన స్పందనకు నెనర్లు.
Prabhavathakka.. Love u so much
అద్భుతం గీత.. నీలో ఇంత ప్రతిభ ఉందా..! నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు
చాలా హ్యాఫీ ఫీలవుతున్నా..
చక్కటి title, అంత కన్నా చక్కటి పరిచయం. మా మధ్య గీత గారి లాంటి మంచి కవయిత్రి ఉన్నందుకు, మాకు బంధుత్వం ఉన్నందుకు గర్వం గా ఉంది.. ఆవిడ ఎంత కష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా, మంచి చిరునవ్వుతో ఇలా కవితలు అందించ గలగడం ఆశ్చర్యం. ఇంకా మంచి మంచి కవితలు రాయాలి అని ఆశిస్తూ, సారంగ్ అనే వేదికకు, కవి హృదయాలకు అభినందనలు 🙂
“వేయి నెమలీకల స్పర్శ గీత వెల్లంకి కవిత” – శీర్షికే ఓ చిన్న కవితలా వుంది. వెల్లంకి గీత గారి గురించి తెలుసుకోవడం బావుంది.
…i never knew that still poetry exists in these days until i came across the poetry written by Geeta vellanki…
those beautifully expressed feelings in my telugu language makes any heart to feel..laugh..cry..and go back to their own memories and cherish the so called “kavitvam”.
i salute Geeta vellanki ఆలోచనలకు కవిత౯వమనే అందమైన రూపమిచినందుకు
and proving that art and poetry still lives in this gadget era too…and there are so many admirers of the same..
thank you..
ఈ కొత్త కవిత్వ తీరాలు శీర్షికతో గీత గారి గురించి, తన కవిత్వపు పరిణితి,లోతు గురించి తెలుసుకునే అవకాశం కలిగినందుకు చాలా హ్యాపిగా ఉంది.సురేష్ గారు మీ ఈ ప్రయత్నానికి అభినందనలు…
చాలా చక్కని పరిచయం. గీతగారి థైర్యం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. సురేష గారి ఇంటెర్వూ ఆద్యంతం బాగుంది. ఇంకా ఎన్నో మంచి కవితలు రాయాలని ఆకాంక్షిస్తూ ఇరువురికీ అభినందనలు.
గీతక్క జీవితాన్ని ,కవిత్వాన్ని పరిచయం చేసిన తీరు చాలా బాగుంది సర్..
ప్రేమకవితలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన గీతక్కను పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది సర్..