ఆ చలం ఊహలే ఇప్పటి సైన్సు : ప్రముఖ అనువాదకురాలు వసంత

ఆమె రచనలు ఎక్కడా అనువాదాలని చదువుతున్నట్టు అనిపించవు, స్వీయ రచనలలాగే అనిపిస్తాయి. ఇలాంటి కళ కొద్దిమంది అనువాద రచయతలలోనే చూస్తాం.

ప్రముఖ అనువాద రచయిత్రి డాక్టర్ టి. సి. వసంత గారు మనకున్న అనువాద రచయితలలో ఒకరు. హిందీ నుంచి, మరాఠీ నుంచి తెలుగులోకి అనువదించడమే కాకుండా, తెలుగు సాహిత్యాన్ని విస్తృతంగా హిందీ, మరాఠీ భాషలలోకి తీసుకువెళ్లడంలో వసంత గారి కృషి నిరుపమానమైనది. అనువాదాలే కాకుండా తెలుగు లో కొన్ని చక్కటి నవలలు, విరివిగా వ్యాసాలురాసారు.  ఇప్పటిదాకా ఎవరు చేయని విధంగా చలం సాహిత్యాన్ని ఆయన జీవితాన్ని పోల్చి చూస్తూ 1400 పేజీల బృహత్ రచనని ఆమె హిందీ లో తీసుకువచ్చారు.

అది హిందీలో ప్రఖ్యాతి పొందడమే కాకుండా, ఇప్పుడు మరాఠీ సాహిత్యంలో కూడా ప్రవేశిస్తోంది. ఆమె రచనలు ఎక్కడా అనువాదాలని చదువుతున్నట్టు అనిపించవు, స్వీయ రచనలలాగే అనిపిస్తాయి. ఇలాంటి కళ కొద్దిమంది అనువాద రచయతలలోనే చూస్తాం.

 


 

హిందీ లో ఆమె  స్వీయ  రచనలు “గీతికార్ నీరజ్”, “మృత్యులీల –  జీవన్ హేల”, “రమణి సే రామానాశ్రమ్ తక్ (చలం జీవిత చరిత్ర)”, “విద్రోహి వసుంధర”, “ఏక్ దూసరా మహాభారత్ (పల్నాటి యుద్ధం).”అది హిందీలో ప్రఖ్యాతి పొందడమే కాకుండా, ఇప్పుడు మరాఠీ సాహిత్యంలో కూడా ప్రవేశిస్తోంది. ఆమె  రచనలు ఎక్కడా అనువాదాలని చదువుతున్నట్టు అనిపించవు, స్వీయ రచనలలాగే అనిపిస్తాయి. ఇలాంటి కళ కొద్దిమంది అనువాద రచయతలలోనే చూస్తాం.

తెలుగు లో వసంత  స్వీయ రచనలు –  ” రేపటి వసంతం”, “విముక్తి”, “భూతల స్వర్గంలో గాయపడ్డ వసంతం”.

తెలుగు నుంచి హిందీ అనువాదాలు –  తాపీ ధర్మారావు గారి రచనలు “దేవాలయోన్ పర్ మిథున్ మూర్తియోన్ క్యోమ్ “, “వివాహ్ సంస్కార్ –  స్వరూప్ ఏవం వికాస్”, ప్రజనన తంత్ర తథా దైవీ భావన”, వోల్గా “రాజనీతిక్ కహానీయాం”, సి యస్ రావు “పత్తర్ బోల్ ఉఠేతో”, “లోహర్ కా ఆంగన్”, అత్తలూరి విజయలక్ష్మి “మాఖాన్ ప్రేమ్”, మునిసుందరం “ఏక్ యుధ్ కె బాద్”.

హిందీ నుంచి తెలుగు లోకి – అమృతలాల్ నాగర్ “ఆడలేనురా గోపాలా”, విష్ణు ప్రభాకర్ “అర్థ నారీశ్వర్”, పరస్ లాల్ గోవర్ధన్ “ఆధునిక కహానీయాం”, నయాగరా “జలము నీవే జీవమూ నీవే”, రమణికగుప్త “నా జీవితం – ఉద్యమాలు, పోరాటాలు”, మధు కాంక్రియ “ఎండిపోతున్న చిన్నారులు”, ఆనంద్ మోహన్ “మాంటో బతికే వున్నాడు”.

మరాఠీ నుంచి తెలుగు లోకి – లక్ష్మణ్ గైక్వాడ్ “ఉచల్య”, “రాణి లక్ష్మి బాయ్”.

ఇవి కాకుండా విస్తృతం గా తెలుగు లోను, హిందీ లోను అనేక వ్యాసాలు, సమీక్షలు, పరిచయాలు రాసారు. ఆమె రచన  “విద్రోహి”   త్వరలో ఇంగ్లీష్ లో కూడా రాబోతోంది.

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • డా.వసంత గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. మోహన్ బాబు గారు చాలా మంచి విషయాలు వినిపించారు..వసంత గారు చాలా మంచి మనిషి..
    ఆమె అనుభవాలు రచనలు గురించి కలిసినపుడు ఫోన్ లో చెపుతూ ఉంటారు..
    చలంగారి పై మంచి work చేసారు…
    అనేక మంచి అనువాదాలు చేసారు..మా తరానికి అనువాద రంగంలో హిందీ అనువాదకులు మార్గదర్శకులు వసంత గారు..

    నిరాలా గారి తో చలం గారి పోలిక వ్యక్తి గత అనుభవాలు రచయితలగా ok కావచ్చు
    రాజకీయ అభిప్రాయాలు మాత్రం విభిన్నం..

    నిరాలా వ్రాసిన.. బిక్షుక్..తోడ్ తీ పత్తర్..రామ్ కీ శక్తి పూజ..లాంటి రచనలు చలంలో చూడలేము…

    తర్వాత మేళా..అంటే..జాతర..అన్నారు..కానీ..తిరనాల..అంటే..ఇంకా దగ్గరగా ఉంటుంది..

    ఇంత మంచి ఇంటర్వ్యూ అందించిన మోహన్ బాబు గారికి నాకు మంచి. ఆప్తులు మార్గదర్శకుల అఫ్సర్ గారికి కల్పనా గారికి క్రృతజ్ఞతలు..

  • డా.వసంత గారి ఇంటర్వ్యూ బాగుంది. మోహన్ బాబు గారు చాలా మంచి విషయాలు వినిపించారు.. వసంత గారి గురించి ఇంకొంత వివరాలు రాసి ఉంటె బాగుండేదని అనిపించింది.. థాంక్యూ మోహన్ బాబు గారు..
    శాంతిశ్రీ

  • చాలా మంచి పరిచయం, ఇంటర్వ్యూ. ధన్యవాదాలు.

  • K.srinivas gari sammoham chadivaaka oka sathaabdini sontham chesukunna viplava kavi malli puttabodu ani anipinchindi.edi niraasaavaadame kaavachu.kaani ede nijam.tharvaatha yenni kotha kadgasrusti laanti kavithalu vachina Sri Sri kavtvaniki samaanaardakaalu kaavu, kaalevu.ee vyasam nindaa srinu sahajamaina maata theeru vundi .naathonu ma sudarshan thonu kalisi maatlaadinattundi.mana parishath lo 18th June 1983 naadu gaddar gaari samakshamlo ok shraddanjali Sabha jarigindi.chukkallo velisaadu Sri Sri. suryunilo nilichaadu Sri Sri ane song andarini kantathadi pettinchina goppa paata okati undi .meerannattu smruthi kavitwam raavaalsinantha raaledu.manam parishath students ainanduku Sri Sri ni entha lothuga ardham chesukogaluguthunnamanukuntaa..srinivaas gaaru thanks.paramatma

  • చాలా అవసరమైన ఆర్టికల్ ఇది. ఒక గొప్ప రచయిత్రిని తెలుసుకోగలిగేలా చేసినందుకు కృతజ్ఞతలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు