వ్యాసాన్ని కూడా బోర్ కొట్టించకుండా మొదలుపెట్టిన దగ్గర్నుంచి ముగించే వరకు వైవిధ్యపూరితంగా సాగే రచన ‘చెమట చెక్కిన వాక్యం’. ఈ పుస్తకంలో ఒక వ్యాసాన్ని కొటేషన్‌తో మొదలు పెడితే ఇంకొక వ్యాసాన్ని ఒక సూత్రీకరణ తనే చేసి మొదలుపెడుతాడు. మరొక వ్యాసాన్ని డైరెక్టుగా కవిని గురించి మాట్లాడుతూ మొదలుపెడతాడు. ఇంకొక వ్యాసాన్ని ఏదో ఇంగ్లీషు కొటేషన్స్‌తో మొదలు పెడతాడు. ఇట్లా బహుముఖంగా తాను వైవిధ్యపూరితైనటువంటి శైలిని తన వ్యాసరచనలో కనబరిచాడు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన చాలా సాధారణమైన సాదాసీదా మాటల్ని తీసుకొని చిన్న చిన్న వాక్యాలతో గంభీరమైన విషయాల్ని వివరించడం. అందుకని రీడబులిటీ అనేది దీనికి ప్రశ్నకాదు.
ఈ పుస్తకం తెరవగానే వొరప్రసాద్ ముందుమాట చదివాను. ఆ ముందుమాట బాగా న్యాయం చేసిందీ పుస్తకానికి. అంటే ఈ పుస్తకాన్ని పొగిడి చేశాడనేది కాదు. న్యాయం చేయడమంటే అసలా పుస్తకంలో ఏముంది? ఎలా ఉంది? ఎందుకు ఉంది? అనే మూడు ప్రశ్నలు మనం వేసుకుంటే ఆ మూడింటికి చక్కని సమాధానాలు వొరప్రసాద్ ఇచ్చాడు.
ఆ ముందుమాట చదివినాక మనకు తొందర తొందరగా వెళ్ళాలనిపిస్తుంది. అలా వెళ్ళేటట్టుగా ఈ పుస్తకం వుంది. ఈ చెమట చెక్కిన వాక్యం పుస్తకంలో తాను తీసుకున్నటువంటి కవులందరూ కూడా ఏదో ఒక స్కూల్ కి చెందిన వాళ్ళుకాదు. ఇందులో వామపక్షకవులున్నారు, విప్లవకవులున్నారు, దళితకవులు ఉన్నారు, బహుజనకవులున్నారు. దండోరా ప్రేరేపితులైనటువంటి కవులున్నారు. అట్లాగే స్త్రీవాదానికి సంబంధించిన కవులున్నారు. వివిధ అంటే ఇవ్వాల నడుస్తున్న కవిత్వంలో ఎన్ని ధోరణులైతే ఉన్నాయో అన్ని ధోరణులకు సంబంధించిన కవులు ఈ పుస్తకంలో ఉన్నారు. అంటే ఈ పుస్తకంలోకి మనం వెళ్లడమంటే అర్థం, ఇవ్వాళ సమకాలీన కవిత్వంలోని వివిధ ధోరణులతో కరచాలనం చేయడం. ఆ విధంగా మనకి సమకాలీన కవిత్వానికి సంబంధించినటువంటి భిన్నకోణాల్ని, విభిన్నమైన దృక్పథాల్ని, విభిన్న శిల్పవిశేషాల్ని అన్నిటిని కూడా తాను వివరంగా మనకర్థమయ్యేలా చెప్పాడు.
కొత్తగా కవిత్వం రాయాలనుకునే వాళ్ళకి గాని, కవిత్వం చదవాలనుకునే వాళ్ళకు గాని, ఇది కావలసిన ఫౌండేషన్‌ని సమకాలీన కవిత్వం పట్ల వేస్తుంది. అందుకని నాకు చాలా సంతోషం వేసింది. ఈ పుస్తకాన్ని చదివి. తను నాగప్పగారి సుందర్రాజు మీద రాస్తూ ఆయన కవితా సంపుటి చండాల చాటింపుని మాదిగ చైతన్య గుండెచప్పుడు అని విశ్లేషణ చేశాడు. అది సాధారణమైనటువంటి దళితకవిత్వం అని మనం ఏదైతే అనుకుంటున్నామో, దానికంటే కూడా ఎక్కడ భిన్నంగా ఉందో తను పిన్ పాయింటెడ్‌గా చెప్తాడు. సంతోషమేసింది. దళితకులం నుంచి వచ్చింది ఒక అమ్మాయి గంగవరపు సునీత. కానీ ఆమె రాసిన కవిత్వం మాత్రం ‘ఇట్లు ఓ ఆడపిల్ల’ అనబడే ఒక ఆడపిల్ల అంతర్మధనం. ఆమె కవిత్వంలో ప్రేమలో మోసపోవటమో, ప్రేమను తెలపలేకపోవటమో ఇవి రెండు జరిగినా కూడా ఉండే ఆశ నిరాశల మధ్య ఉండే ఘర్షణో, ఒక అంతర్మథనం ఎక్కువగా కనబడిరది. మొన్ననే ఆ అమ్మాయి మరోగబ్బిలం అని బుక్కు తెచ్చింది. అందులో ఆ పేరుతో ఉన్నది ఒక పోయమే. మిగిలిన అన్ని పోయెమ్స్‌లో ఇదే. ఇదే ధోరణి. తను దళితస్త్రీ కాబట్టి, దళితవాదంతోనే ఆమెను చూడాలని కాదు. అసలక్కడేముందో దాని ప్రకారం దాన్ని చూడటం అని. ఆమె కవిత్వాన్ని సరిగా విశ్లేషించి. మళ్ళీ ఆపోయం, ఆ మీద రాసిన ఆ వ్యాసాన్ని ఒకసారి చదవండి. జి.వెంకటకృష్ణ మీద రాసిన వ్యాసం. ఆయన గొప్ప కథకుడు,కవి, విమర్శకుడు మంచివక్త, అయితే ఈ నాలిగింటిని క్రమంగా గమనిస్తూనే ఉంటాను. ఆయన మీదొక మూడు వ్యాసాలు రాశాడు. ఆ మూడువ్యాసాల్లో నన్ను బాగా ఆకట్టుకున్నటువంటి వ్యాసం, కంచె దాటని పాట. ఆ విశ్లేషణ చాలా బాగుంది. ఎందుకంటే అది పొలిటికల్ వ్యాసం. అంటే తనలో సమకాలీన రాజకీయవైచిత్రిని, ఫాసిజాన్ని దాని తాలూకు వైషమ్యాల్ని, రికార్డు చేసిన రచన.
ఇట్లా లోసారి సుధాకర్ గారి కవిత్వాన్ని కూడా ఆయన మీద కూడా రెండు మూడు వ్యాసాలు రాశాడు. అందులో కూడా ఆయన్ని ప్రమోట్ చేయాలనే బుద్ది ఎక్కడా లేదు. అన్నిటికంటే సంతోషమేమంటే.. ఎవరినుంచి ఒక కొటేషన్ ఇచ్చినా, ఆ కొటేషన్‌లో వస్తు శిల్పాల అన్యోనత కనబడే కొటేషన్సే తీసుకున్నాడు. అది అందరూ చేయలేరు. జనరల్‌గా ఏం చేస్తారంటే ఒక కొటేషన్ని ఇదిగో ఈ ఇతివృత్తాన్ని ఈ నాలుగువాక్యాల ద్వారా మనం చూడొచ్చని, నాలుగువాక్యాలను ఇతివృత్తాలకు సంబంధించిన వాక్యాలు ఇస్తారు. కవిత్వం ఉన్నా లేకపోయినా..ఈయన సెలెక్టు చేసుకునే అన్ని లైన్లను గమనించండి. ఎక్కడో ఒక చోట తప్ప ఆ లైన్లన్నింటిలోనూ అటు వస్తువు ఇటు శిల్పం రెండూ కూడా ఒదిగిపోయి, సమన్వయీకరించిన ఒక ఎక్స్‌ప్రెషన్స్‌ను తీసుకుంటాడు. నేను చదివేటప్పుడది చూస్తాను.
ఒక విమర్శకుణ్ణి చూసేటప్పుడు కవిత్వం నుంచి అతన్ని తీసుకుంటే అందులో వస్తుశిల్పాలు రెండు కనబడుతున్నాయా? లేదంటే వస్తువును మాత్రమే రిఫ్లెక్ట్ చేసి, కవిత్వం శిల్పమే లేని కవిత్వం రాస్తున్నాడా అని. అలా చూసినపుడు ఇతనిలో ఆ సత్తా కనబడింది. కవిత్వం కూడా అంతే. మనం చదువుతున్నప్పుడు ఒక కవిలో వస్తువు కోసం కొన్ని లైన్లు, శిల్పం కోసం కొన్ని లైన్లు వేరు చేసి, తీసే పరిస్థితి వచ్చిందంటే ఆ కవి కవిగా ఫెయిలైనట్టే. నువ్వు ఏ పదివాక్యాలైనా తీసుకో కవి నుంచి.. అందులో అతడి వస్తువు శిల్పం టిపికల్‌గా బయటపడాలి.అప్పుడు కవిగా అతను ఒక ఉత్కృష్ణమైన స్థానంలో ఉన్నట్లు లెక్క. ఆ ఇది తాను నిరూపించుకోగలిగాడు. ఇంకా శివారెడ్డి లాంటి సీనియర్ కవులమీద తను చాలా సంభాళింపుతో రాశాడు. అఫ్సర్ మీద రాశాడు. జీవనది లాంటి కవిత్వం అఫ్సర్‌ది అని. పాతకవుల నుంచి, పెద్దకవుల నుంచి, చిన్నకవుల వరకు డీల్ చేసాడు. ఒకరకంగా యువకవుల్ని డీల్ చేసేటప్పుడు ఇతన్లో మంచి పదును నాకు బాగా కనబడింది. పల్లిపట్టు నాగరాజు పుస్తకం యాలై పూడిసింది అనేది. దానిమీద ఒక మంచి వ్యాసం రాశాడు. అప్పటికే చాలా మంది చాలా రాశారు అతనిమీద.
కవిత్వంలో స్థానిక చైతన్యం అనే పాయింట్ తీసుకొని ఆ స్థానికచైతన్యంలో భాగంగానే ఆ స్థానికత్వంలో ఉన్నటువంటి ఆ రైతు సమస్యలు గానీ, కులసమస్య గాని, స్త్రీల సమస్యలు గానీ వీటన్నిటిని సంభాళింపు చేసుకుంటూ ఒక డెమోక్రటిక్ వాయిస్‌ను అతను ఎలా వినిపించాడో చాలా చక్కగా పట్టుకొచ్చాడు. అంటే అతను అతన్ని సొంతంగా చూస్తున్నాడు. అంతకుముందు ఆయన్ని దళితకవిగాను, మాదిగ చైతన్యానికి చెందిన కవిగానూ, సీమకవిగానూ ఇట్లా రకరకాలుగా చేస్తూ రాసిన వాళ్ళు ఉన్నారు. కాని ఈయన స్థానికచైతన్యం కానీ ఏంది రాసినగానీ సొంతచైతన్యం, సొంత ముద్రతో, సొంత చూపుతో రాయాలి. విమర్శకుడికి సొంత చూపుండాలి. అది నేను కెంగార మోహన్‌లో గమనించాను. అతను మంచి వక్త. చాలా చక్కగా ఆలోచిస్తాడు విశ్లేషిస్తాడు. కేకలు పెట్టి అరిచి కాకుండా అవతలివాళ్ళలో ఆలోచనలు రేకేత్తించగలిగే స్థాయిలో తను మాట్లాడతాడు. ఈ విమర్శగూడా అట్లాగే వుంది. ఏంది శృత్రువుతో యుద్ధం చేసేటటువంటి పరిస్థితి దానికి సూట్ టైపులో కాకుండా దానికి ఏది ఉందో ఆ బుక్‌లో చూసి ఆ బుక్ లో ఏది మంచి ఏది చెడు. ఎందుకు అనేదాన్ని వివరించుకుంటూ వచ్చాడు. అయితే ఏమిటంటే తొలి పుస్తకం కాబట్టి కొంత అవతలవాళ్ళ దోషాలు చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉంటది. ఈయన కొంత ఎక్కువ జాగ్రత్తగా ఉన్నాడు. ఎవరికి ఏమి నొప్పి కలిగించలేదు. దానికి ఒక కారణం ఏంటంటే మనం తెలుగు కవిత్వరంగంలో అంటే సాహిత్యరంగంలోనే చిన్న విమర్శచేస్తే విలవిలలాడిపోయే తత్వం కవుల్లో వుంది. వాళ్ళకు ఆ రోజు అన్నం సహించదు. నాలుగు రోజులు నిద్రపట్టదు. మనం కూడా తప్పులు చేస్తాం.
ఒకప్పుడు నేను చాలా ఏదన్నా రాశానంటే రెండో రోజు దానిమీద ఇంకొక పదిఖండనలు పదిడిఫెన్స్‌లు ఇట్లా ఉండి, దెబ్బలు తిని తిని తిని తిని ఒక దశలో నాక్కూడా ఎందుకీ గొడవ అంటీ అంటినట్లు రాస్తే పోలా అని అనిపించేది. అయినా చేయలేం. అది వేరే సంగతి. అలాంటిది కొత్త రచయితలు కొత్త విమర్శకుల్ని ఇంకా ఎంత ప్రలోభాలకు గురిచేస్తుంది మన వాతావరణం. గురిచేస్తుంది..వాస్తవం కూడా. విమర్శ అంటే అగ్రెసివ్‌గా కవుల్తోనూ, రచయితల్తోనూ కత్తియుద్దం చేయటం కాదు. విమర్శంటే ఆ కవులు రచయితల్ని దైవాంశసంభూతులుగా ప్రత్యేకమైన విశిష్టమైన జీవులుగా వర్ణిస్తూ ఎక్కడో ఉంచడమోకాదు. వాళ్ళు కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు స్పందన జీవులు. కళాత్మకజీవులు. మనతో పోలిస్తే వాళ్లకు ఉన్నటువంటి తేడా ఏంటంటే మామూలు జనానికి కవులకి రచయితలకి మామూలు జనం కంటే ఎక్కువగా స్పందించేతత్వం వాళ్లకుంది. మామూలు జనం చెప్పలేనంత కళాత్మకంగా వాళ్ళు చెప్పగలరు. అంతవరకు దాన్ని అంగీకరించి మనం రాయాలి తప్ప, వాళ్ళు ఏదో మామూలు జనానికి, మామూలు జన జీవితానికి ఇది చాలా అతీతులులాగా మనం ఇచ్చేసి రాయడం కూడా కరెక్ట్ కాదు. ఆ స్పృహ కెంగార మోహన్‌కు వుంది. అందుకనే ఎవర్ని కూడా పూర్తిస్థాయిలో పైకి ఎక్కించుకోలేదు. అలాగని పట్టుకొని కుదించలేదు. అట్లని ఈయన సెటిలిటీగాబోయి ఇది చేయలేదు.
సమకాలీన సాహిత్యం పట్ల సమకాలీన సమాజం పట్ల ఈ రాజకీయాల పట్ల చరిత్ర పట్ల ఈ ఈస్థటిక్స్ పట్ల కనీస అవగాహన ఉంది. లేని అవగాహన కూడా తెచ్చుకోడానికి సిద్ధంగా ఉండే సానుకూలత సానుకూల దృక్పథం మోహన్ లో ఉంది. ఎందుకంటే నీవు విమర్శకుడిగా రావాలి. ఎందుకు రావాలంటే తెలుగు సొసైటీలో విమర్శ అసలు లేదు. విమర్శకులే లేరు. అని మాట్లాడుతున్నటువంటి ఈ తరుణంలో నీలాంటి యువకులు పదునైన విమర్శతో రావాలనుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇందులో విమర్శిస్తుంది. ఒక రకమైనటువంటి విమర్శ.
నేనేమంటానంటే పిచ్చివాళ్లు పుట్టకుండా సమాజం మారదు. ఏ రంగంలో ఆయినా సరే. అందుకే దోస్త్‌వస్కీ ఒక నవలకు ది ఇడియట్ అని పేరుపెట్టాడు. ఎవరా ఇడియట్టు. ఇన్‌సెన్సుబుల్‌గా బతికే మనుషుల మధ్య ఒక సెయింట్‌లాగా జీవితాన్ని గడిపిన వ్యక్తి వాడు ఇడియట్టు. అందురు ఇడియట్స్‌గా ఉన్నప్పుడు అనీడియట్‌గా ఉన్నప్రతీవాడు ఇడియట్‌గా కనబడతాడు. ఆ సెన్స్‌లో ఈ విమర్శ కూడా, ఈ విమర్శకుడు కూడా తొందరలో ఇడియట్‌గా తయారవుతాడని అనుకుంటూ తయారు కావాలని కోరుకుంటూ-
*
సమకాలీన సాహిత్యం పట్ల సమకాలీన సమాజం పట్ల ఈ
రాజకీయాల పట్ల చరిత్ర పట్ల ఈ ఈస్థటిక్స్ పట్ల కనీస అవగాహన
ఉంది. లేని అవగాహన కూడా తెచ్చుకోడానికి సిద్ధంగా
ఉండే సానుకూలత సానుకూల దృక్పథం మోహన్ లో ఉంది. ”
మోహన్ కి ఇది మంచి కితాబు.
– వొరప్రసాద్
Thak you anna
Thak you So much sir
గౌరవనీయులైన శ్రీ గుంటూరు లక్ష్మీనరసయ్య గారు కెంగార మోహన్ గారి ఆధునిక సాహిత్య విమర్శ పై రాసిన వ్యాసం చదివిన నాకు కెంగార మోహన్ గారి ప్రతిభావంతమైన రచన గురించి నాకు పూర్తి అవగాన అయ్యింది. కెంగార మోహన్ గారి రచనలలోని శీర్షికలు దేనికదే ఒక వైవిద్యభరితమైన ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఆది ఆయన గొప్పతనము.