‘మన’ పసలపూడి కథల్లో మాండలిక మానవులే తప్ప ‘విడి’ మనుషులుండరు. మాండలిక భాషే తప్ప ‘పొడి’ పలుకులుండవు. ఆ కథల్లో వంశీ అందాల పటం కట్టింది ఒక సమాజానికి, ఒక ప్రదేశానికి, ఒక జీవనవిధానానికి, ఒక కాలానికి. అంటే ఒక సంస్కృతికన్నమాట. ఆ కీలకం తెలిసింది రామచంద్రారెడ్డి గారికి, అందుచేతనే అనేకానేక…. పిహెచ్.డి. గ్రంథాల్లాగా తన రచనను వట్టి సాహిత్య ప్రశంసగా మార్చి పారెయ్యకుండా, అరుదైన సంస్కృతి విశ్లేషణగా మలిచారు. సంస్కృతికి భాష నిలుపుటద్దమని గ్రహించి భాషకు ప్రత్యేకంగా పట్టం కట్టారు. తూర్పుగోదావరి జిల్లా జాతీయాలూ, వాడుకలూ, పలుకుబళ్లూ, తిట్లూ, దీవెనలూ, సరదాలూ, మర్యాదలూ, మన్ననలూ అన్నింటినీ వంశీ ఒక పలుకుపంటగా పండిస్తే, కుప్పనూర్చి పంటను ఒబ్బిడి చేశారు రామచంద్రారెడ్డి, పదాల- భాషాశాస్త్ర పరిణామాలనీ, చారిత్రక అర్థ పరిణామాలనీ, సాంస్కృతిక పుట్టుపూర్వోత్తరాలని విశ్లేషించిన భాగానిది ఈ పుస్తకంలో ‘హారంలో తరళస్థానం’.
-డా. రెంటాల శ్రీవెంకటేశ్వరరావు
Add comment