వంగూరి ఉగాది ఉత్తమ రచనల పోటీ

వంగూరి ఉగాది ఉత్తమ రచనల పోటీ

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
(1994 లో సంస్థాపించబడిన లాభాపేక్ష లేని తెలుగు సాహిత్య మరియు ధార్మిక సంస్థ)
3906 Sweet Hollow Court, Sugar Land, TX 77498
Phone: 1 832 594 9054; E-mail: vangurifoundation@gmail.com
_______________________________________________________
30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 10, 2025)
 
గత మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే “విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు అంతర్జాతీయ స్థాయిలో 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ  నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు విభాగాలు ఉన్నాయి.
ప్రధాన విభాగం
భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.
ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  US$116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  US$116
 “మొట్టమొదటి రచనా విభాగం”
భారత దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్న, చిన్న, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలు ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ “పోటీ” లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.
“నా మొట్టమొదటి కథ”: (ఉత్తమ కథ): US$116
“నా మొట్టమొదటి కవిత”: (ఉత్తమ కవిత): US$116
అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
• ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించ వచ్చును. వీలయినంత వరకు అన్ని రచనలూ యూనికోడ్ (ఉదా. గౌతమి ఫాంట్) లో మాత్రమే పంపించాలి. కథల నిడివి 2500 పదాలకు మించకూడదు. (సుమారు 15 పేజీల లోపు). కవితలు ఐదు పేజీలు లోపు ఉండాలి. PDF, JPEG  ఆమోదయోగ్యమే.
• తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు.
• రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించ బడతాయి. స్వంత బ్లాగులు, సొంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణించబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనలతో పాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీలో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచన అని హామీ పత్రం లో పేర్కొనాలి.
• బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ లోనూ, తదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించ బడతాయి.
• విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు అనగా… మార్చ్ 30, 2025 కానీ అంతకు ముందు కానీ   ప్రకటించబడతాయి. కాపీ రైట్స్  ఆయా రచయితల వే అయినా, ఈ పోటీకి పంపిన రచనలు గడువు తేదీ లోపు  రచయితలు ఇంకెక్కడా ప్రచురించకూడదు.
• విజేతల ఎంపిక  న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
Last Date to receive entriesMarch 10, 2025
Please send entries by email attachments (PDF, JPEG or Unicode fonts)
 
భవదీయులు,
వంగూరి చిట్టెన్ రాజుశాయి రాచకొండదీప్తి పెండ్యాల
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికాహ్యూస్టన్, టెక్సస్

వంగూరి చిట్టెన్ రాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు