లింగ

నెల్లూరు జిల్లాలో స్వర్ణముఖి నది ఒడ్డున పల్లిలో పుట్ట్యాను. నెల్లూరులో, గుంటూరులో చదువు సాగింది. గుంటూరులో బీకాం డిగ్రీ, నెల్లూరులో లా చదివాను. రష్యన్ సాహిత్యం ముఖ్యంగా దొస్తయెవస్కీ, గోర్కీ రచనలు వాటిల్లోని అట్టడుగు బతుకుల చిత్రణ నాకు గొప్ప ఇన్స్పిరేషన్. ఇవే కాకుండా పల్లి కళా రూపాలైన కధలూ, పాటలూ, పజ్జాలూ.. చిన్నప్పుట్నుంచీ పెద్దోళ్ల నోట ఇంటా పెరిగినాను. పాలీషు పట్టని పలుకు మాది. జరిగింది జరిగినట్టు ఇవరించి చెప్పడమే తప్ప అంగు సొంగులు అద్ది వోటితో ఈటితో పోల్చి చెప్పటం చాతకాని మా పల్లి అలవాటే నాకొచ్చింది.
లింగ (పేరు మార్చలేదు) అనేటి పాసిపని చేసుకొనే పిల్ల కత ఇరవై ఏళ్లకి ముందర నేను గుంటూరులో చదువుకుంటుండిన దినాల్లో జరిగినాది. ఇది నేను రాసిన ఇరవై ఆరో కత, సారంగలో వస్తుండే మొదుటి కత. రాసిన ముక్కల్లో నిజివెంత ఉండాదని తప్ప మరొకటి చూసుకోడం తెలవదు.
మా లింగుండాద్యా బాబో..? అంటా ఈది గేటు బైట్నుంచి అడిగిందా ముసిల్ది. లేదే, ఇందాకొచ్చి అప్పుడే ఎల్లిపొయ్యింద్యే..! అని ఇంటి గడప లోపల్నుంచి నంగి నంగిగా జవాబు చెప్పినాడు బాబు. గేటు పట్టుకోని నిలబడి నమ్మలేనట్టు బాబు కళ్ళల్లోకి దెయ్యిం మాదిర్న రొండు సెనాలు చూసి, అడుగులో అడుగేసుకుంటా సిన్నంగా కదిలి పొయ్యిందా ముసిల్ది. అది చూసిన సూపుకి కాళ్లల్లో వొణుకు పుట్టకరాడంతో తలుపు లాక్జేసి బెడ్రూంలోకి వొచ్చిపడ్డాడు బాబు. గలాసులో మిగిలుండే రమ్మంతా వొకే గుక్కన స్పీడుగా తాగేసి వొక్కాకెంగిలి ఊసినట్టు తుపక్కన సిటికిడు ఆ పిల్లమింద ఊసినాడు. వొంటిమింద గుడ్డపేలికి లేకుండా మంచం పక్కనే గచ్చుపైన ముడసక పొణుకోని గొంతు పెగిలిచ్చకుండా కళ్లనీళ్లు పెట్టుకుంటా ఉండాదా పిల్ల..
కోపంతో సిందొక్కతా ఆ పిల్లమ్మిడికి పొయ్యి డొక్కలో ఈడ్సి తన్ని, లేసి గుడ్డలు కట్టుకోయే లంజా అన్నాడు. పొత్తికడుపులో రొండు మూడుతూర్లు గుద్ది, బలొంతాన రమ్ము తాగిచ్చి, పచ్చి పచ్చిగా తిడతా.. అప్పుటికే వొకతూరి అనబగించి ఉండాడు ఆ పిల్లని బాబు. అదేవాటాన రొండోతూరి గూడా అనబగిస్తుండంగా గేటు కొట్టి పిలిసింది ముసిల్ది. బాబుకి ముసిల్దాని ఇందాకిటి దెయ్యిపు సూపు గెవణానికొచ్చి బయిఁవేసినాది. అనుమానఁవూ, కోపఁవూ కూడా పుట్టకొచ్చినాయి. నేలమింద నుంచి లేసి వొంటికి గుడ్డలు కట్టుకుంటుండే ఆయమ్మి కాడికి పొయ్యి, నిజిం జెప్పు మనెవ్వారం అంతా మీయవ్వకు చెప్పేసినావు కదా..? అని మొకంలో మొకం పెట్టి కళ్లురఁవతా, పొళ్లు కొరకతా అడిగినాడు. ఏడ్సీ ఏడ్సీ ఆ పిల్ల మొకఁవూ, కళ్లూ ఉబ్బరించక పొయ్యుండాయి. చెప్పలేదని తలకాయి అడ్డంగా ఊపిందా పిల్ల. పో.. బైటి బాత్రూంలో మొకం కడుక్కోని దార్లో పెత్తనాలు దెంగకుండా బిన్నా ఇంటికి పో.. ఇంకోతూరి ఈడకొచ్చి నీ గురించి అడగొద్దని ఆ ముసిల్దానికి చెప్పు.. అంటా ఆ పిల్లని మెడ బట్టుకోని బైటికి తోసి తలుపేసుకున్నాడు. గ్లాసు నిండా రమ్ము కలుపుకోని గెడగెడ గుక్కతిరక్కుండా తాగేసి గోడ గెడేరంలో టైం జూసి, ఇంకాసేపుట్లో మమ్మీ డేడీ ఆఫీసుల్నుంచి ఇంటికొస్తారు అనుకుంటా సిల్లాపల్లాగా ఉండే బెడ్రూముని నీటుగా సర్దేసినాడు. అప్పుడు మల్లీ ఇంకో గలాసు రమ్ము తాగంగానే, అట్టా తాగినప్పుడల్లా వొస్తుండేటి ఏడుపు తన్నకొచ్చేసినాది బాబుకి. అయాం సారీ లింగా, మై లింగా.. ఈ బాస్టర్డ్ని సెమించు లింగా నిన్నేఁవిటికని రోజూ ఈవాటాన సంపక దింటుండానో నాకే తెలవడంలేదు.. అంటా పొగిలి పొగిలి ఏడ్సుకున్నాడు. తరవాత మై టియర్స్ అని పేరు పెట్టుకోనుండే డైరీ తెరిసి “ఈ బాధకి అంతులేదు, ఎవురికీ అర్ధం కాదు” అని రాసి చూస్కోని దాని కింద “అయాం సారీ మై ఎల్” అంటా గెలికినాడు.
సిన్నతనాన పుస్తకాల్లో వొక రూపఁవంటా లేని సిక్కరా బక్కరా బొమ్మలేసి వోటికి రంగులు పుయ్యిడం ఇస్టంగా ఉండేటిది బాబుకి, బల్లి మిందా రేడియా మిందా కయిత్తం గూడా రాసినాడు. అయ్యన్నీ డేడీ కంట్లో పడి సదువుకునే పుస్తకాల్లో యాందీ బొమ్మలూ, పిచ్చి రాతలూ అంటా గూబలు పగలగొట్టేసి నేరుగా బడికి పొయ్యి ఇదేనా మా పిల్లోడికి మీరు నేరిపిస్తుండేటి సదువో అని జెంబాలుపోతా క్లాస్టీచర్ని అడిగినాడు. క్లాస్టీచరు బాబు చేతుల్ని తిరగేసి సెక్కస్కేలుతో ఏళ్లిరిగేటట్టు కొట్టి ప్రిన్సిపాల్కి కంప్లేంటు జేసింది. ఆయిన గూడా నాలుగు బాది వొక పిరీడంతా గోడకుర్సీ ఏపిచ్చినాడు. ఇంకోతూరి సొక్కాయి లేకుండా ఈదిలో పిలకాయిల్తో ఆడుకుంటా కనిపిచ్చేతలికి ఈపు వాసేటట్టు బెల్టుతో సావగొట్టేసిన ఆ డేడీ.. తాగొచ్చిన పెతిసారీ కొడుకుని దగ్గిరికి పిలిసి సదువెంత గొప్పదో, కస్టపడి సదివి బాగుపడినోళ్లు ఎవురో ఇవరంగా బోదిస్తుండేటోడు. బాబుకి మాత్రం ఈదిలోకి పొయ్యి ఆడుకోవాలనీ బొమ్మలెయ్యాలనీ చూసిందంతా రాయాలనీ మనుసు కొట్టకలాడేటిది. డేడీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకోనుండే బ్రేందీ ఇస్కీల్లో నుంచి అప్పుడప్పుడూ సైగ్గా ‘ఆ మొందు సీసాయి మూతతో మూతడు’ గొంతులో పోసుకోని గుటక్కన మింగేటప్పుడు నోట్లోనుంచి ముక్కులోనుంచీ గుప్పన తన్నకొచ్చే ఆ బ్రేందీ ఇస్కీల కారుకి సిన్నతనానే ఎడిక్టు అయ్యినాడు బాబు.
అట్టా పెరిగిన బాబు ఇంటర్మీడేటుకి కాలేజీలో జాయినైనాడు కానీ క్లాసులుకి పోడఁవే బాగా తక్కవ. పొయ్యినా ఎవుర్తో మాట్లాడేవోడు కాదు. ఎవురన్నా పలకరిస్తే తనక మినకలాడి సిగ్గుపడిపొయ్యి మాటలు నానస్తా తత్తర బిత్తరయ్యేటోడు. ఆడపిలకాయిల మొకంలోకి సూడాలంటేనే బయిపడి వోళ్లు ఎదురుబడితే తలకాయొంచుకోని సఱ్ఱన దాటుకోనిపొయ్యేది. అందురూ నన్నే జూసి నా గురించే యాందేందో మాట్లాడుకోని నవ్వుకుంటుండారని ఎప్పుడూ అనువానంగా దిగులుగా ఉండేటిది. వొకనాడు క్లాసులో ఎనకబెంచిలో కూసోని తూగతుంటే అప్పుడే జాయినైన వొడ్డూ పొడుగుండేటి పిల్లోడొచ్చి పక్కన కూసోని నవ్వతా సొరవగా నా పేరు మన్నన్ అని జెప్పి పరిసియం జేసుకున్నాడు. ఆ నవ్వూ సొరవా కంటికింపుగా ఉండినాయి బాబుకి. లోపలేందో వొణుకు పుట్టకొచ్చినాది. తత్తర బిత్తర స్టయిల్లోనే సిగ్గు సిగ్గుగా మన్నన్తో మాట గలిపినాడు బాబు. తొందరగానే ఆ ఇద్దురూ మంచి ప్రెండ్సయినారు..
మమ్మీడేడీ బాబు ఇస్టాల్ని బలొంతాన అణస్తా వొచ్చినప్పుటికీ డబ్బుకి మాత్రం తక్కవ జేసిందిలేదు, దాంతో ఆ వొయిసులో క్లాసుమేట్సు పది రోపాయిలు దొరక్క అల్లాడతుంటే, బాబు వొందలొందలు కర్సు పెడతుండేటిది. అమ్మా నాయినా ఆఫీసులకి పొయ్యినాక, వారంలో రొండు మూడు తూర్లు నాన్వేజొండుకుంటా గ్రీన్లేబుల్ మొందు తాగతా టీవీలో మారియో, డక్ హంటు ఈడియో గేమ్స్ ఆడుకుంటా, ఇపరీతంగా అస్తపెయోగం జేస్కుంటా సందేల దాకా ఇంట్లో పడుండటం అలవోటైన బాబుకి ఇప్పుడు మన్నన్ తోడైనాడు. ఒక మజ్జేనం పూట ఇద్దురూ తాగీ తినిం తరవాత తీరిగ్గా సోపాలో పక్కపక్కన మొండిమొలల్తో జారబడినారు, ఇంత పెద్దది..! ఎట్టొచ్చింది బావా నీకా అంటా మన్నన్ది సేత్తో పట్టుకోని సప్పరిస్తా, కళ్లింత చేసుకోని అబ్బరంగా అడిగినాడు బాబు. నీ చెయ్యి పడంగానే అదే అంత పెద్దదైపోతుండాది.. అన్నాడు పేణాలకి సక్కిలిగిలి పెట్టే నవ్వు నవ్వతా మన్నను. మొన్నట్లాగా తొందరగా అవుట్ చేస్కోబాక బావా ప్లీజ్.. అంటా మన్నన్ని పైకిలాక్కోని ముక్కు మింద ముద్దుబెట్టి మొత్తుగా అన్నాడు బాబు.
వొకనాటి సందేల మమ్మీ ఆపీసునుంచొచ్చి ఆపనీ ఈపనీ సక్కబెట్టుకోని తీరిగ్గా టీవీ ముందర కూసునే తలికి ఎదురుంగా టీవీ లేదు..! ఇదేందిదే వైర్లు పెరికేసుండాయి, టీవీ ఎట్టపొయ్యిందే..? అని ఆలోసిస్తా బాబు ఇంటికొచ్చినాక అడిగితే “అది మజ్జానం ఉన్నెట్టుండి కాలిపోతే రిపేరు కిచ్చుండాను, కొత్త పిచ్చర్టూబుకి పదేనొందలు తేమన్నాడు మెకానిక్కు” అని మన్నన్ చెప్పమన్న మాటల్ని చెప్పినాడు. ఇంకోతూరి గ్యాస్సిలిండరు మాయివయ్యింది. దేన్నెత్తకపొయ్యినా కుదవబెట్టుకోని డబ్బులిచ్చే అంగడి తెలుసు మన్ననుకి..
ఇంకోక మజ్జేనం, మమ్మీ ఇప్పేసిపొయ్యిన కోకా రైకా కట్టుకోని రైక ఊక్సులు ఇప్పేసి మన్నన్ సేత నిప్పుల్సుని పిండిచ్చుకుంటా.. “నువ్వొకతూరి కైపెక్కి, నీయమ్మా కొజ్జా లంజాకొడకా అంటా యాందేందో తిడతా హార్డుగా రేప్లాగా చేసినావే, అట్టా చెయ్యి బావా ఇప్పుడా.. అనడిగినాడు మురిపెంగా బాబు. చేస్తాలేగానీ, చిన్న చిన్న వొస్తువులకి డబ్బులెక్కువ రాడంలేదు, నువ్వే చూస్తుండావు కదా అందుకని ఇంట్లో మీయమ్మ బంగారొస్తువ ఏదన్నా తీసకపొయ్యి కుదవబెట్నాం అనుకో ఎక్కువ డబ్భులొస్తాయి, ఆలోసించు అన్నాడు మన్నను. గోల్డా..! గోల్డైతే తగువౌతాదేఁవో కదా..? మొన్న కొత్త కుక్కరు కనబడ్డంలేదని మమ్మీకి మల్లీ నా మింద కోపంగా డౌటుగా ఉండాది, బట్ ట్రై జేస్తా అని మన్నన్ పొట్ట దిగవనుండే గుబురెంటికిల్లోకి యేళ్లుదోపి గిలకొడతా చెప్పినాడు బాబు. ఆ రాత్రి డైరీలో ఐ హేట్ మై డెడ్లీ పెయిన్ ఫుల్ లైఫ్.. అని రాసుకున్నాడు.
రొండు నెల్లు తిరిగేతలికి బాబు ఇంటిని అయినకాడికి సదరబెట్టినాడా మన్నను. అన్నిట్నీ చూసీ చూడ్నట్టు పోతుండిన మమ్మీ ఒకనాడు బంగారుంగురం కనబడకుండా పోడంతో ఆ దొంగతనాన్ని డేడీ దాకా తీసకపొయ్యింది. ఇంట్లో పాసిపని జేసే యానాది ముసిల్దాని మింద అనువానంతో పోలిసుకేసు పెడతాఁవంటా బెదిరిచ్చినారు. అది నెత్తీనోరూ గొట్టుకోని బయింతో ఊళ్లోనే కనబడకుండా పొయ్యింది. ఇంట్లో ఇంతక ముందర గూడా శానా వొస్తువులు పొయ్యినాయనీ, తాళాఁవేసిన బీరువాలో ఉండే బంగారొస్తువ పనిముండ తీసుండదు కాబట్టి పిల్లోడ్ని బెదిరిచ్చి సూడమని డేడీతో చెప్పింది మమ్మీ. యవ్వారం అంతా కక్కిన్దాకా కొట్టినాడు డేడీ. మన్నన్తో మజ్జానాల మందళ్లు తప్ప దొంగతనాలన్నీ బైటపడ్డాయి, తెలిసిన కానిస్టేబుల్ని తోడుకోని మన్నన్ ఇంటికి పొయ్యి ఇంకోతూరి మాపిల్లోడితో మీ పిల్లోడు కనబడితే ఏం జెయ్యాలో అది జేస్తానని, కేసు బెడితే పిల్లోడి సదువు సెడిపోతాదని ఇప్పుటికి వొదిలేస్తుండాననీ గెట్టిగా వార్నింగ్ ఇచ్చొచ్చినాడు డేడీ. దాంతో ఆ ప్రెండ్సిప్పు కట్టయ్యి కొంత కాలం పిచ్చోడ్లాగా యాడస్తా డైరీ నిండా యేందేందో రాసుకోజాగినాడు బాబు. పాత పనిమనిసి కనబడకుండా పోడంతో లింగమ్మ అనే పెళ్లి వొయిసు పిల్ల అప్పుడే పాసిపనికి కుదిరినాదా ఇంట్లో..
బాబు నంగితనఁవూ అవాఁయికపు బొద్దు మొకఁవూ జూసి, దాని దరిద్దరపు కుఱ్ఱొయిసు ముసిచ్చి దానికదే కోరుకోనొచ్చి ఆ బాబు సేతల్లో పడ్డాది లింగ. వోడి యాడేడ కచ్చంతా, ఎప్పుటెప్పుటి ఏడుపంతా తీర్సుకునే అవకాసిం దొరికినట్టు చూసినాడు గానీ, కోరొచ్చిన ఆడపిల్లలాగా సూస్కోలేక పొయ్యినాడు ఆయమ్మిని. దినదినఁవూ ఆ పిల్లని సంబరపెట్టేది తక్కవ, అల్లాడిచ్చక తినేది ఎక్కవ అయ్యేది. నాతో పొణుకున్నట్టు ఇంకా ఎవురెవుర్తో పొణుకుంటుండావో చెప్పమంటా సెంపలు పగలగొట్టేటోడు. వొకనాడు వొళ్లంతా మిరప్పొడి పూసినాడు. మరొకనాడు ఏడేడిగా టీ ఎత్తక రమ్మని తెచ్చినాక రొమ్ముల మద్దిన పోసినాడు. అనబగించిన పెతిసారీ, కడుపొస్తే యాంజేస్తావు, నలగరికీ ఎవురిమింద చెప్తావు అంటా కోలెత్తుకొనేవోడు. సావగొట్టేది ఎంటనే యాడస్తా కాళ్లు బట్టుకోని సారీలు చెప్పేది, రమ్ము తాగమని బలవొంత పెట్టేది, గిచ్చేదీ కరిసేదీ.. ఎప్పుడు ఏవాటాన మారతాడో తెలవక అదిరి సస్తుండేదా లింగ. వొకనాడు కడగాబొయ్యుండాను వొద్దన్నా ఇనకుండా, తొడలకీ పొత్తికడుపుకీ నెత్తురయ్యి జారిపోతుండినా వొదల్లేదా పిల్లని..
రేపు ఊరెల్లిపోతుండాను బాబూ, మేనమాఁవతో నా పెళ్లి కుదిర్సినారు మా పెద్దోళ్లు, అని దిగులుగా చెప్పింది వొకనాడా లింగ. నెత్తిన రాడ్డుతో కొట్టినట్టు చూసినాడు బాబు.. వొందతూర్లు నిజఁవా అబద్దఁవా అంటా అడిగిందే అడిగి నిజివేఁనని తేలినాక కూలబడి లింగను బట్టుకోని పసిబిడ్డాల యాడవను మల్లుకున్నాడు. నువ్వు గూడా ఎల్లిపోతే నాకు దిక్కెవురు లింగా.. నాకొకరవ్వ టైమియ్యి, మనిద్దరం యాడకన్నా దోరంగా ఎల్లిపొయ్యి పెశాంతంగా బతకే దారి జూస్తాను అప్పుటిదాకా ఊరికిపోబాక, నామాట ఇనకుండా పోవాలని జూసినావో ఇప్పుడే నిన్ను గొంతుపిసికి సంపేసి నేను గూడా సచ్చిపోతా అని నోటికొచ్చినాటివన్నీ చెప్తుండంగా, ముసిల్దొచ్చి లింగా.. ఇళ్లన్నీ తిరిగొస్తుండానే.. ఈడుండావా..?, మీ బాపొచ్చుండాడు రా అంటా గేటు తట్టింది. పొయ్యొస్తాను బాబు, మీరు ఇదే వాటాన రోజూ మొందు తాగతా ఉండబాకండి మంచిగుండండి అని బాబు బుజంమింద సెయ్యేసి దిగులు మొకంతో, నీళ్లు నిండిన కళ్లతో గుండిల్లో ప్రేఁవనంతా పెదేల మింద నవ్వుగా సూపిచ్చి ఎల్లిపొయ్యిందా లింగ.. ఆ రేతిరి డైరీ తీసుకోని “నీ ప్రేఁవని ఈ జనమలో మర్సిపోను మై ఎల్, ఎప్పుటికైనా నిన్నెతుక్కుంటా మీ తెలంగాణా కొస్తాను” అని ఎక్కిళ్లుబెట్టి యాడస్తా రాసుకున్నాడు..
లింగ పొయ్యిన్తరవాత బాగా దిగులు పడిపొయ్యినాడా బాబు, నాలుగైదు పుస్తకాల నిండా మై టియర్స్ అనే కయిత్తమూ, ఇంకో నాలుగైదు పుస్తకాలనిండా మై అబ్స్ట్రాక్ట్ హార్ట్ అనే బొమ్మలూ సెక్కి పెట్టుకున్నాడు. ఇంటరయ్యి డిగ్గిరీలో కొచ్చినాక పక్కింట్లోకి బాడుక్కొచ్చిన లాయిరు కూతురు అనురాదతో కుదిర్నాది. అద్దరేతిరి ఇంటి మిద్దిమింద మూలన సీకట్లో గోడకి జారబడిన బాబుపైన గొంతుక్కూసోని ముందుకొంగి నోట్లో నోరుబెట్టి, నాబోటి అందఁవైనోళ్లు ఇంకా ఎవురైనా ఉండారా నీ దుస్టిలో డాలింగ్ అనడిగింది అనురాద, ‘మీయన్న’ అని తడుంకోకుండా టక్కన చెప్పినాడు బాబు. వ్వాట్..? అన్నాది బాబు నోట్లోనుంచి నోరు బైటికిదీసి ఆ పిల్ల, ఎంటనే బాబు స్పుహలోకొచ్చి ‘మీనా’.. మీనా.. సినిమా ఈరోయిన్ను మీనా, నీయంతందంగా ఉంటాది..! అని చెప్పి కవర్ చేసుకోని, నీ ఫస్ట్ లవ్వు నేనేనా అనడిగినాడు. నీకెట్టా కనబడతుండాన్నేనో ఇప్పుటికి పదిలచ్చిలసార్లు ఈ మాటే అడిగుండావు, ఎప్పుడు కలిసినా ఇదే మాటా నీకా..? అంటా బాబుమింద నుంచి దిగేసి కోపంగా అడిగిందా అనురాద.. అట్టయితే నీ తొడలమిందా, నడుం సుట్టూ, ఈప్మిందా ఆ బ్లేడుతో కోసిన గీతలూ రొమ్ముల మింద కాల్సిన మచ్చలూ యాందీ అంటా కల్సినప్పుడల్లా అడగాలనుకొంటుండే అసలు డౌటుని అప్పుడుండే మూడ్లో అడగలేక సారీ జెప్పి ఆపిల్లని బతిఁవాలి మల్లా పైకెక్కిచ్చుకున్నాడు గానీ, వోడెవుడో నాకంటే పెద్ద సైకో సేతల్లోనే పడొచ్చినట్టుండాదిదే అని ఎప్పుట్లాగానే గెట్టిగా మనుసులో అనుకున్నాడు. నాలుగైదుతూర్లు ఆవాటాన అద్దరేతిరి మిద్దిమింద కలుసుకున్నాక బాబు జేసే మెంటలు పిజికలు ఎరాస్మెంట్లు, ఎంక్వైరీలూ బరాయించలేక పొర రాకుండా యాడస్తా ఛీ తూ అంటా ఊసి ఇంకోతూరి నాజోలికొచ్చినా, ఈ మిద్దిమింద రకస్యిం బైటబెట్టినా, రోజూ ఈదుల్లో ఎంటబడి ఏడిపిస్తుణ్ణెట్టు ‘మీనా’తో చెప్తి తన్నిస్తానని వార్నింగిచ్చి, పొంటిగాట్లతో నెత్తురుతేలిన రొమ్మునీ, సెంపదెబ్బకి అదిరిపొయ్యిన బుగ్గనీ రుద్దుకుంటా ఈ మిద్దిమింద సీకట్లో నుంచి ఆ మిద్దిమింద సీకట్లోకి దూకి మాయిఁవై పొయ్యినాదా అనురాద.
ఇంటర్లోనే కడుపొస్తే తియ్యిచ్చి, సదువు మానిపిచ్చి ఇంకోడితో పెళ్లి జరిపిచ్చినారనీ ఒకనాడా మొగుడు ఇంటికొచ్చేతలికి బెడ్రూములో లవ్వర్తో పొణుకోనుండి దొరికిపొయ్యినాదనీ, దాంతో మొగుడు ఇడాకులీమని బ్లేడుతో వొళ్లంతా కోసి పుట్టింట్లో వొదిలేస్తే, ఏడుగురు అక్కాసెల్లిళ్లు (ఆ ఏడుగుర్లో వొక్కరు గూడా మొగుడితో కాపరం సెయ్యరని ఊళ్లో సెప్పుకుంటా ఉంటారు) నడపతుండే ఏదో మకిలా సంగంతో గలిసి మొగుడిమింద నాలుగైదు గెట్టి కేసులు పెట్టుండారనీ ఈ మద్దిలో మల్లీ కాలేజిలో సేరి, కాపరం దీసిన లవ్వరు మొకం దప్పిచ్చేతలికి క్లాస్మేటుల్లోనే ఒకడ్తో తిరగతుండాదనీ ఆ అనురాద గురించి తరవాత తెలిసొచ్చినాది బాబుకి..
లింగతో గడిపిందంతా ‘ఒక పిచ్చి పిల్ల నవ్వు’ అనే పేర్తో, మన్నను గేపకాలన్నీ ‘ఏడురంగుల కళ్లనీళ్లు’ అనే పేర్తో కయిత్తం రాసి పెట్టుకున్నాడు. మై అబ్స్ట్రాక్ట్ హార్ట్ పేర్తో గీసిన వొక్కొక్క బొమ్మకీ నాలుగు లైన్లతో ‘మై టియర్స్’ అనే అబ్స్ట్రాక్ట్ కయిత్తం కూడా రాసుకున్నాడు. ఆ రాతలన్నిట్నీ బంటీ అని పేరు పెట్టుకోనుండే సిన్నప్పుటి వొక కన్నూడిపొయ్యిన టెడ్డీబేరుకీ, చార్లీ అని పేరుబెట్టిన కోతి బొమ్మకీ మొదుటిగా ఇనిపిచ్చేది. ఫేస్బుక్ యాపు డౌన్లోడ్ చేస్కున్న కొత్త ఊపులో వోటిల్లో నుంచి ఒకటీ అరా కయిత్తం పోస్ట్ జేసేవోడు. ఆ కయిత్తంలో సామాజిక సెయితన్నిం లేదన్నారొకరు, ఆ బాస అర్తం కాడంలేదన్నారు ఇంకోకరు, నీదంతా నోస్టాల్జియా మాదిర్నుండాది అట్టా మాటిమాటికీ మన తప్పుల్నీ ఏడుపునీ మనఁవే రాస్కోడం గాకుండా లోకంలో ఉండే తప్పుల్ని ఎత్తి సూపిస్తా కయిత్తం రాయమని ఇన్‌బాక్సులో సలకా జెప్పినారు ఒకరు.. ఈవాటాన ఏది పోస్ట్ జేసినా ఎనికిట్నే వొస్తుండే నానా దెంగులికీ ఇసుగుబుట్టి ఇట్టగాదని వొకతూరి ‘గాలి గుసగుసలు’ పేర్తో – రొండు కొండల మద్దిన రాణి రాగం తీస్తుండాది, నిన్నా మొన్నటి గాలి బాణం యాస్తుండాది- అంటా పిత్తు మింద ఇండైరెక్టుగా పదొరసల తలాతోకా లేని కయిత్తం రాసి, తడిసిన కోకలో నుంచి ఆరారా కనబడతుండేటి ఎత్తు పిఱ్ఱల్ని ఎమ్ముగా తెరస్తుణ్ణెట్టు రొండు సేతలా పైకెత్తి పట్టుకోని ఎనిక్కి దిరిగి పోజిచ్చిన మోడల్ ఫోటోతో కలిపి పోస్ట్ జేస్తే ఎంటెంటనే నాలుగొందల తొంబైవొక్క లైకులొచ్చినాయి. సూపరు, యేసమ్, కుడోస్, ఎక్సలెంట్, టచ్చింగ్, లవ్విట్ట్.. అంటా ఆరొందలపైన కామెంట్లొచ్చినాయి, నలపై ఐదు మంది దాన్ని షేర్ జేసినారు. పలానా ఇవ కవి నిన్న గొప్ప ప్రేఁవ కయిత్తం రాసినాడని ఈపుగీరే ఇశ్లేసన గూడా వొచ్చింది మరసటి దినాన. ఇయ్యన్నీ జూసి ఇరక్తి పుట్టకొచ్చి ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసుకున్నాడు బాబు. యాఁవయ్యిందో గానీ వొక రేతిరి ఆ కయిత్తమూ, బొమ్మలూ ఉండే డైరీలన్నీ చించి ఇంటెనక్కి ఎత్తకపొయ్యి కాల్చేసినాడు..
ఆడా మొగా తేడాలేకుండా అప్పుడప్పుడూ ఎవురెవురో బెడ్రూంలోకి వొచ్చి పోతుండినా, పెశాంతం అనేటిదేదో మాత్రం లేదా బాబు బతుక్కి. ఎప్పుడు జూసినా లింగ గెవణానికి రాజాగతుండేది. ఆయమ్మిని దలుసుకున్నప్పుడల్లా పేణవంతా సల్లబడేటిది ఎంటనే సెప్పలేనంత యాతన పుట్టేటిది.
ఇంతెత్తన సోకు జేసుకోని తిరిగే టౌను ఆడపిలకాయిలు ఎవుర్లో లేని పాలనవ్వు, ప్రేఁవతో మెరిసిపొయ్యే కళ్లూ లింగ మొకాన మాత్రవే ఉండేటివి. కాళ్లాజాతా తన్ని రకతం కళ్లజూస్తుండినా ఏడ్సే దాని మొకంలో ఆ ప్రేఁవ దప్ప అసీకం కోపం అనేటివి కనిపిచ్చేదే లేదంటే లింగ ఎట్టాటి ఆడదనుకోవాల..!? అనే ఆలోసెనలతో కుమిలిపోజాగినాడు బాబు. ఉండేకొద్దీ తిరుగుళ్ల మింద యావ జచ్చి తాగుడే లోకఁవైపొయ్యినాదా బాబుకి. పొగులు పొద్ధస్తమూ ఇచ్చా తాగతా, కూడూ నీళ్లూ ముట్టకుండా దెయ్యిపు రూపుబడ్డాది..
ఆ వాటాన పది పన్నెండేళ్లు గడిసినాయి, ఇంతకాలఁవూ లింగ జాడ దొరక్క, ఆ పిల్ల గేపకాలు వొదలక దెబ్బతిన్న గొడ్డాల గొరిసిపోతుండేటి బాబుకి వొకనాడు తటక్కన లింగ గేపకాలన్నీ కయిత్తంగానో కతలుగానో రాసుకుంటే ఎట్టుంటాదే అని ఆలోసిన బుట్టింది. ఆ ఆలోసినకే ఏళ్లకేళ్లుగా పేణంనిండా పేరుకోనుండేటి బొరువంతా దిగిపొయ్యినట్టనిపిచ్చింది. ఎనికిట రాసినాటివన్నీ సించి తగలబెట్టినప్పుడు లింగ మింద రాసినాటివి గూడా వోటితో కలేసి తగలబెట్టినందుకు యాడలేని మనేదీ కలిగినాది. మనుసు కోరుకుంటుండే ఆ లింగ, తప్ప తాగినా ఆ తాగిందంతా దిగినా గేపకానికొచ్చి పేణాలు తీస్తుండే పాలనవ్వూ ప్రేఁవకళ్ల మొకం లింగ, పదేళ్ల ముందర కనబడకుండా పొయ్యినా ఈనాటికీ ప్రేవంటే యాందో రుసి చూపిస్తుండే ఆ పిల్ల గురించి నిజాలు, జరిగినాటివన్నీ జరినట్టు మల్లా మొదుట్నుంచీ కయిత్తంగా రాయిడం మొదులుబెట్నాడు. అట్టా ఎప్పుడైనా నాలుగచ్చిరాలు ఆయమ్మి మింద రాసుకున్నప్పుడు ఆ అచ్చిరాలగుండానే బాబు ముందర కొచ్చి నిలబడతాదా లింగ, బాబు ఎంటనే నీళ్లు తేలే కళ్లని మూసుకోని ఆ లింగ గుండిలమింద గమ్మున తలకాయి ఆనిచ్చుకుంటాడు…
*

సొలోమోన్ విజయ్

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇజయా బాగుంది.❤️ .”గాలి గుసగుసలు” హైలెట్

  • హైఫై సొసైటీ పేరుతో తల్లితండ్రులు ,పిల్లల పెంపకం లో నిర్లక్ష్యం.. పెడతోవ పట్టి పిల్లలు అసహజ రీతిలో (bisexualism, drugs, alchohalics) పెరగటం.. బహుశా ఇదంతా globalisation తో దిగుమతి అవుతున్న పాశ్యాత్య సంస్కృతేమో🤔చేదుగా అనిపించినా అన్నీ నిజాలే… కవిత్వం పై “గాలిబాణం”👌 కుడోస్ విజయ్👍👍💐💐

  • యాసనీ అందున దాగున్న సొగసునీ
    గాలి గుసగుసలతో సెప్పావ్ యిజియా
    దండాల్

  • నేటి సమాజాన్ని పట్టిచ్చే కథ.. మాండలీకం లో ఉన్నప్పటికీ రీడబిలిటీ లో ఇబ్బంది కలగలేదు. మరిన్ని ఇలాంటి జీవమున్న కథలు మీ నుండి రావాలి…కుడోస్

  • చాలా బాగుంది.. మండలీకం అదనపు బలాన్ని ఇచ్చింది.. అభినందనలు…

  • కథ బాగుంది…. నేటి పేరెంట్స్ పిల్లల పట్ల అతి జాగ్రత్త పెంపకకమె కొంపముంచుతుంంది……యాస బాగుంది….

  • వినోదిని రాసిన మరియ కథ గుర్తు వచ్చింది. రెండింటికీ ఉన్న తేడాల్లో ఒకటి ఇక్కడ కథ బాబు వైపు నుంచి నడవడం. ఫలానా వైపు నిలబడి రాయాలన్న ఉద్దేశం ప్రయత్నపూర్వకంగా లేకపోవడం వల్ల లింగ సహజంగా కనబడుతోంది. ఎందుకో ముగింపు అసంతృప్తిగా కలవరంగా అనిపించింది. బహుశా చదివేవాళ్లకి ఇట్లా అనిపించడమే ప్రయోజనం ఏమో!

    నందకిషోర్ ఇచ్చిన మునికాంతపల్లి కథలు ఇక చదవడం మొదలు పెట్టాలి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు