ఒక మంచి పరిణామం. శ్రీ శ్రీని సంస్మరించు కొంటూ, అనేక మంది యువ కవులు తమ తమ స్టేటస్ లలో ఆయన కవిత్వాన్ని, ఆయన జ్ఞాపకాలను షేర్ చేసుకొంటున్నారు. పీడిత జనాల పక్షాన నిల్చున్న శ్రీ శ్రీ ఒక ప్రచండ మెరుపులా, పెను తుఫాన్ లా విశ్వ వ్యాప్త తెలుగు ప్రపంచాన్ని ఉర్రూత లూగించారు. ఒక సరిక్రొత్త తిరుగు బాటునూ, ధిక్కార స్వరాన్నీ కార్మిక, కర్షక, పీడిత పక్షం నుంచి వినిపించారు.
సరిగ్గా అలాగే, మహారాష్ట్ర కు చెందిన , మరాఠీ కవి నారాయణ్ సుర్వే కార్మిక , పీడిత పక్షాన నిలబడి, అప్పటి వరకూ, వినోదం కోసం రాసే కవిత్వాన్ని మట్టుబెట్టి, ఒక క్రొత్త శకానికి నాంది పలికాడు. ఒక అనాధ గా , ఒక ఇంటి పని వాడిగా, హోటల్స్ లో ప్లేట్ లు కడిగే వాడిగా, బేబీ సిట్టర్ గా, పాల డెలివరీ బాయ్ గా , ఒక హమాలిగా ప్రారంబించిన అతడి జీవితం అతన్నో గొప్ప కవిగా నిలిపింది. 2010 లో మరణించిన సుర్వే 1926 లో జన్మించాడు. అతడి కవిత్వ ప్రయాణం అంతా , కులం పేరుతో పెరుగుతున్న అసమానతలను, మతం పేరుతో జరిగే విధ్వంసాలనూ ధ్వంసం చేస్తూ, కార్మిక వర్గాన్ని గ్లోరిఫై చేస్తూ, సరిక్రొత్త కవిత్వాన్ని సాహితీ లోకానికి అందించారు. 1998 లో పద్మశ్రీ అవార్డును, 1996 ల అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్ కు చైర్మన్ అయ్యారు. ఆయన కవిత్వం లోని కొన్ని కవితా వాక్యాలను గమనిస్తే, నేనో నేరం చేయబోతున్నాను అనీ, నేరం జరగ బోనుంది అని రాయగలిగిన రెవల్యూషనరీ కవి నారాయణ సుర్వే.
నాలుగు మాటలు
మరాటి కవిత : “చార్ శబ్ద”
నివ్దాక్ నారాయణ్ సుర్వే ( Nivdak Narayan Surve)
అనుసృజన : సి.వి. సురేష్
*
పొట్ట నింపుకునేoదుకు నేను చేసే పోరాటం
నాకు ప్రతిరోజూ ఓ ప్రశ్న.
కొన్నిసార్లు బయట, కొన్ని సార్లు లోలోపలే
నేనో కార్మికుడిని, ఒక ప్రచండ జ్వాలాభరిత ఖడ్గాన్ని!
మేధావులారా వినండి!
నేనో నేరాన్ని చేయబోతున్నాను.
నేను బాధితుడిని
నేనో సాక్ష్యాన్ని.. కొంచం దగా పడిన వాణ్ణి
నా ప్రపంచపు తీయటి బాధ అందులో కూరుకొని ఉంది
వాటిని నేను కలిపేశాను.
ఒకవైపు కోల్పోతూనే ..
ఇంకో వైపు కొత్త అంశాన్ని నేర్చుకున్నాను
నా జీవితాన్నెలా గడిపేస్తానో, అలా గడిపేస్తూనే
నేనా అక్షరాల్లో ఉండిపోయాను
నా రొట్టె ముక్కపైనే నా మొదటి ప్రేమంతా..
దీన్ని నేను ఒప్పుకుంటాను
కానీ, నాకింకేదో ఎక్కువ కావాలి.
అందుకే నా ప్రపంచము _
ఆ “రాజముద్ర” ను పోత పోస్తోంది
నా అక్షరాల అరచేతుల్లో
కొన్ని పువ్వుల్ని నింపేందుకు సిద్ధంగా ఉంది
నా పదాల చేతులకు ఖడ్గాలను
ఇచ్చేందుకు సిద్ధపడింది.
నేనొక్కడిగా రాలేదు.
నా వెంట మహాయుగమే ఉంది.
జాగ్రత్త! ఇది పెను తుఫాను ఆరంభమే
నేనో కార్మికుడిని… తళ తళ మెరిసే ఖడ్గాన్ని
ఓ మేదావుల్లారా! జాగ్రత్తగా వినండి
ఒక నేరం జరగబోనుంది.
Original Marathi poem titled “Chaar Shabda” BY Nivdak Narayan Surve
The struggle for the daily bread is an everyday question
At times outside the door, at times inside
I’m a worker, a flaming sword
Listen, you intellectuals! I’m going to commit a crime.
I’ve suffered, witnessed, explored a bit
The sweet ache of my world lies in it
I’ve messed up, missed out and learnt new stuff
The way I live, that’s the way I’m in words.
Bread’s my first love, I agree, but I need something more.
That’s why my world’s casting the royal seal
It’s here that I drop flowers into the palms of my words
It’s here that I give swords into the hands of my words.
I haven’t arrived alone; the epoch’s with me
Beware; this is the beginning of the storm
I’m a worker, a shining sword
Listen, you intellectuals! A crime’s about to happen.
*
నైస్ ఆర్టికల్ సర్
Thank you madam
గొప్ప అనువాదం తమ్ముడు.. కవిత మూలాంశం సూపర్భ్ …మీకు సారంగ వెబ్ పత్రకకు శుభాభినందనలు
Very good poem and translation
గొప్ప కవిని చదివించారు సర్…
కవిత చాలా బావుంది… ధన్యవాదాలు💐