రెండో పాత్ర
పాపను పడుకోబెట్టినపుడు
తనపై పరుచుకున్న నిద్రని
దుప్పటిలా తొలగించివచ్చి
ఎప్పటిలా ఆమె తిరిగి పనిలో పడింది.
కళ్ళకి అక్కడక్కడా అంటుకొనున్న కలని
కాసిని చన్నీళ్ళతో కడిగింది.
పాపచేతినుంచి విడిపించుకున్న తన అస్తిత్వాన్ని
తిరిగి నడుముకు చుట్టుకుంది.
పాప ఇల్లంతా పరచిన దాని ప్రపంచాన్ని
ఒద్దికగా ఒకచోట సర్దింది.
ముడిపెట్టిన శిరోజాల్లాంటి తన ఆలోచనల్ని
సున్నితంగా విడిపించి పరుచుకుంది.
పాపచుట్టూ పరిభ్రమించిన
తన సర్వ శక్తుల్నీ
తిరిగి తనవైపుకు తిప్పుకుంది.
పాప ఆకర్షణలో కరిగిపోయిన
తన ఆకర్షణల్ని
ఒకటొకటిగా తిరిగి సమకూర్చుకుంది.
పగలంతా పాల వాసనవెంట
పరుగులెత్తిన ఈమె
సగంరాత్రివేళ పారిజాతమై పరిమళిస్తుంది.
दूसरी भूमिका
मुन्नी को सुलाते वक्त
अपने ऊपर बिछाई हुई नींद को
चादर की तरह हटाकर
हमेशा की तरह फिर कामकाज में लग जाती |
आँखों पर कहीं कहीं लगे सपने को
थोड़े से ठंडे पानी से धो लेती
मुन्नी के हाथ से छुड़ाये गये
अपने अस्तित्व को
कमर में फिर से बांध लेती
मुन्नी द्वारा फैलायी गयी
उस की दुनिया को
सलीके से एक जगह पर
इकट्ठा कर रख देती |
जूड़े में बंधे गये
बालों जैसे ख़यालों को
बहुत ही नाज़ुक़ ढंग से
छुड़ाकर बिखेर देती !
मुन्नी के चारों तरफ़
चक्कर काटते आकर्षण में
धुले हुए अपने सारे सम्मोहन को
थोड़ा थोड़ा करके
फिर से अपने में लगा लेती !
दिन भर दूध की खुशबू के पीछे
दौड़ लगाती रही
तो आधी रात की बेला में
हर सिंगार होकर
खुशबू बन जाती है !
గొడుగు
ఎండగాని, వానగాని లేనప్పుడు కూడా
మా నాన్న గారు గొడుగు వేసుకుని నడిచేవారు.
ప్రకృతి నుంచే కాదు
గొడుగు మనుషుల నుంచి కూడా కాపాడుతుంది.
తెరిచిపట్టుకున్నంత సేపూ చుట్టూ
ఒక నల్లటి ఏకాంతాన్ని నిర్మిస్తుంది.
మిలమిలలాడే ఊసల్ని బయటపెడుతూ
ఆత్మీయంగా నవ్వుతుంది.
కాళ్ళ కింద నల్లటి తివాచీలా పరుచుకున్న రోడ్డు
తలపై నల్లకలువలా విరిసిన గొడుగు
-నడిచినంత మేరా ఆయనతో
సంభాషించేవి.
నడకంటే ఆయనకెందుకంత ఇష్టమో
నాకిప్పుడర్థమౌతోంది.
ఆయన విడిచివెళ్లిన గొడుగుని
బహుశా మేమెవరమూ తెరవం.
విప్పిచెప్పని ఆయన అంతరంగంలా
ఆ గొడుగు ముడుచుకొనే ఉంటుంది.
ఎప్పటికీ రాయని ఆత్మకథలా
మిగిలిపోతుంది.
छतरी
ना तपती धूप ना ज़ोर की बारिश
फिर भी बाबूजी ले चलते छतरी |
बराबर निकल पड़ते
हाथ में लेकर छतरी |
बचाती है
सिर्फ़ प्रकृति से नाहीं
बचाती है
लोगों से भी छतरी |
खोलने पर
चारों तरफ़ बनाती है
काली वीरानी |
दिखाकर
प्यार से हॅसती है
अपनी अंदरूनी चमचमाती कमानी
लोहे की तीली छतरी |
बिछाकर पाँव तले
काली कालीन जैसी राह पे
नील कमल जैसी
खिलती है सर पर छतरी |
चलते चलते
बतियाती है छतरी
आज जाना मैं ने
क्यूं बेहद पसंद है
उन्हें पैदल चलते चलते |
हम में से
कोई शायद कभी न खोले
उनकी छोड़ी हुई छतरी |
जैसे उनका जियरा
खोलकर कभी कोई बात कही नहीं
पड़ी रहती है
सिमटके छतरी
जैसे कभी न लिखी गई
ज़िन्दगी की कहानी उनकी
ख़ामोश होके
पड़ी रह जाती है छतरी
तेलुगु :विन्नकोटा रविशंकर
हिंदी अनुवाद : चागंटि तुलसी
బావున్నాయి
చాలా బాగున్నాయి
మేడం గారు
తులసిగారి హిందీ అనువాదం ప్రతిలేఖనం (transliteration) లా కాకుండా, రవిశంకర్ గారి మాతృక లోని జాతీయత, నుడికారం (idiom) ప్రతిబింబించేలాగా అద్భుతంగా ఉంది
అభినందనలు ఇద్దరికీ!
అల్లాడి మోహన్, తిరుపతి
Lovely poems and translations. Loved the “godugu”
మనసును తడిమిన కవితలు రవిశంకర్ గారూ. అభినందనలు 💐
కవితలు – తెలుగు, హిందీ రెండూ – చాలా బాగున్నాయి