రావిశాస్త్రి – గ్రీషమ్ కలిస్తే ఎంత బాగుండేది?!

రావిశాస్త్రి జన్మించిన తేదీ 30 జూలై

తన రచన ఏ చెడ్డకి సాయం చేస్తోందో, ఏ మంచికి హాని చేస్తోందో ఆలోచించవలసిన అవసరం ప్రతీ రచయిత కు ఉంది

-రావి శాస్త్రి

 

రావి శాస్త్రి. ఇంగ్లీషు పదంలో రాస్తే తెలుగులో రవి శాస్త్రి అంటారు తెలుగు పత్రికల వారు. రావి శాస్త్రి గురించి తెలియని పాత్రికేయులు రవి శాస్త్రి అనే రాస్తారు. ఆ పతనం ఇంకా రాలేదనుకుంటాను. రావి శాస్త్రి గురించి ప్రపంచంలో అమెరికా రచయితల్లో పోల్చడానికి వీలైతే జాన్ రే గ్రీషమ్  కావచ్చు. గ్రీషమ్ అమెరికాలో పేరెన్నిక గల నవలా రచయిత. కాని పొరబాటున ఆయన కేవలం తెలుగులోనే రాయడం వల్ల  తెలుగు జాన్ రే గ్రీషమ్ అని చెప్పుకోవాల్సి వస్తోంది.  ముందు గ్రీషమ్ గురించి రాస్తాను.  రావి శాస్త్రి ఆయన కన్న ఎంత గొప్పవాడో తెలియడానికి.

గ్రీషమ్  రాజకీయవేత్తగా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్త. ఇతని పుస్తకాలు దాదాపు 42  భాషల్లో అనువాదమయ్యాయి. లీగల్ థ్రిలర్స్‌ అనే వాళ్లు. నన్నడిగితే ఇల్లీగల్ థ్రిలర్స్ అనాలి.  నేను చాలా కాలం ‘న్యాయం’ పేరుతో వార్త పత్రికల్లో వారం వారం రాసేవాణ్ని. మిత్రులు నా కాలమ్ లో దాన్ని అన్యాయం అనేవారు. ఎందుకంటే ప్రతిసారీ నేను అన్యాయం గురించే రాసేవాడిని కదా.

గ్రీషమ్ న్యాయశాస్త్రంలో క్రిమినల్ లాయర్‌గా పనిచేసేవారు. 1984లో తన తొలి నవల ‘ఏ టైమ్ టు కిల్‘ రాశారు. 1989లో ప్రచురణకు నోచుకున్న ఈ పుస్తకం 2012 నాటికి ప్రపంచవ్యాప్తంగా 275 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయింది. అమెరికాలో తొలి పుస్తకమే 2 మిలియన్ల కాపీలు అమ్ముడైన రచయితలు ముగ్గురే ముగ్గురు. అందులో టామ్ క్లాన్సీ, జేకే రౌలింగ్‌లతో పాటు గ్రీషమ్ కూడా ఒకరు.1991లో గ్రీషమ్ రాసిన ‘ది ఫర్మ్’ 7 మిలియన్ల కాపీలు అమ్ముడైపోయి రికార్డు నమోదు చేసింది.

జాన్ గ్రీషమ్ అమెరికాలోని అర్కన్సాస్‌లో ఒక పత్తిరైతు కుటుంబంలో జన్మించాడు. గ్రీషమ్‌కు నాలుగేళ్లు ఉన్నప్పుడే అతని కుటుంబం మిసిసిపీకి తరలిపోయింది. గ్రీషమ్ స్థానిక ఎన్నికల్లో డెమోక్రాట్‌గా పోటీ చేసి గెలిచాడు. ఆ పదవిలో 1983 నుండి 1990 వరకు ఉన్నాడు.

ది టైమ్ టు కిల్ పేరుతో గ్రీషమ్ రాసిన నవల  విషాదభరితమైంది. ఒకసారి కోర్టు బయట తను తచ్చాడుతుండగా.. ఓ 12 ఏళ్ల అమ్మాయి వచ్చి తనను  కొందరు ముష్కరులు రేప్ చేసి, ఎలా చిత్రహింసలు పెట్టారో చెప్పినప్పుడు గ్రీషమ్ మనసు ద్రవించింది. అదే అంశాన్ని  తీసుకొని, ఒకవేళ ఆ అమ్మాయి తండ్రి ఆ ముష్కరులను తుదముట్టడించడానికి ప్లాన్ వేస్తే, ఎలాగుంటుంది అన్న ప్లాట్‌తో రాసిన నవలే ‘ది టైమ్ టు కిల్’. దాదాపు 28 మంది ప్రచురణకర్తలు ఆ నవలను ముద్రించడానికి ముందుకు రాలేదు. ఓ అపరిచిత పబ్లిషర్ ఓ 5000 కాపీలు మాత్రమే వేయడానికి ముందుకొచ్చాడు. కాని ‘ది ఫర్మ్’ విజయవంతమయ్యాక తను రాసిన అన్నీ నవలలూ దాదాపుగా బెస్ట్ సెల్లర్స్‌గా అయ్యాయి.

ఇప్పుడు మనం రావిశాస్త్రి గురించి రాద్దాం. ఆయన ఏమన్నాడో చదవండి. ‘‘అక్కడ అనాథుల ఆక్రందన, అక్కడ అసహాయుల ఆర్తనాదం. అక్కడ పేదల కన్నీటి జాలు. అదేసుమా కోర్టు! అని కూడా నాకు రాయాలని ఉంది. అయితే, సెంటిమెంట్‌ సాబ్‌ స్టఫ్‌, ఏడుపురాత రాసేనని తప్పక చాలామంది వెక్కిరిస్తారు.

రావిశాస్త్రి శైలి ఎవ్వరూ అనుసరించలేనిది. అది అనితర సాధ్యం. అతని కథ, కథనం చాలా పదునైనవి. జన బహుళత్వం లోకి హృదయంలోకి తోసుకుని లోపలికి పోతాయి.  నిజమైన న్యాయవాది రావిశాస్త్రి. ధనికులు, భూస్వాముల అన్యాయాలకూ, దౌర్జన్యాల గూర్చి చిత్రహింసలు పడే దీన, హీన, బడుగు వర్గ ప్రజల తరుపున వకాల్తా తీసుకున్నవాడు.  ఆయన విశాఖ పట్టణాన్ని వదిలేసి, హైకోర్ట్ లో ప్రాక్టీస్ చేస్తే క్రిమినల్ లాయర్ గా ఈ దేశానికి తెలిసేది. ఆయన   డబ్బు చేస్తారని నేనడం లేదు. న్యూఢిల్లీ, సుప్రీంకోర్టుమీద ఎన్ని లక్షల మందిని బతికించేవారో.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సంపన్నుల రక్షణకు న్యాయస్థానాలు, పోలీసులు చట్టాలు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. నల్లకోటు ధరించిన దురాశపరులు ఖాకీల లొసుగులను ఉపయోగించుకుని న్యాయాన్ని నలిపివేస్తున్నారు. ” అన్నారు రాచకొండ విశ్వనాథ శాస్త్రి.

ఆయన రచనలో ముఖ్యమైనవి కథా సాగరం, ఆరుసారా కథలు, ఆరు సారో కథలు, రాజ మహిషి, బానిస కథలు, రత్తాలు ` రాంబాబు, సొమ్ములు పోనాయండి, గోవులొస్తున్నాయి జాగ్రత్త బంగారం, ఇల్లులను చెప్పుకోవచ్చు. రాజు మహిషి, రత్తాలు ` రాంబాబు అనే రెండు అసంపూర్తి నవలల్ని వ్రాసారు. ఆంధ్రలో మధ్యపాన నిషేధం చట్టం వల్ల సమాజంలో జరిగిన పరిణామాలను చిత్రిస్తూ అయన రాసిన ఆరు సారా కథలు తెలుగు సాహితీ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపి ఎంతో మంది విమర్శకుల్ని ఆలోచింపచేసాయి.

‘రత్తాలు రాంబాబు’ నవలలో వేశ్యగృహంలో తన స్నేహితురాలు ముత్యాలు ఏడు నిలువుల లోతు నూతిలో ఆత్మహత్య చేసుకున్నప్పుడు, రత్తాలు పడ్డ మానసిక వేదన, ఆరు చిత్రాల ‘కథాసంపుటిలో’ మామిడిచెట్టు కథలో తను అద్దెకు దిగిన ఇంటి పెరడులోని మామిడి చెట్టు పక్క ఇంటి వారికి నీడనిస్తుందన్న అక్కసుతో మామిడిచెట్టును కొట్టి వేయించిన ఇంటి యజమాని చర్యతో నీడకోసం పలవరించిన నాయకుడి మాటల్లో మనల్ని కవిత్వం పలకరిస్తుంది.

‘‘రచయిత అయిన ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను తలుస్తాను’’ అని రచయిత మంచి వైపు నిలబడవలసిన అవసరాన్ని గుర్తుచేశాడు.

దు:ఖాన్ని పాఠకుల గుండెలకు సూటిగా నాటుకునేలా తన రచనలు సాగించి వారిపై సమాజంపై మొత్తం సానుభూతి కురిపించేలా చేసిన గొప్ప రచయిత, మానవతామూర్తి. గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిల తరువాత ఎక్కువగా మాండలిక శైలిని ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికలంలో అట్టడుగు ప్రజల వాడుక భాషలో పాఠకులకు హత్తుకుపోయే రీతిలో పదునైన గొప్ప రచనలు చేసాడు.

రావిశాస్త్రి ఇద్దరు ఆంగ్ల రచయితలు లాంబ్, డికెన్స్ చే ప్రభావితమయ్యారని, గురజాడ అప్పారావు శ్రీశ్రీ రచనల నుండి ప్రేరణ పొందారని విశ్లేషకులు అంటారు. “స్త్రీ” చిత్రానికి డైలాగ్స్ స్క్రీన్ ప్లే రాశారు.

తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. జేమస్ జాయిస్ “చైతన్య స్రవంతి” ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇది. జేమస్ జాయిస్ రచనా పద్థతిని మొదటిసారిగా తెలుగు కథలకు అన్వయించినది కూడా రావిశాస్త్రినే. ఇది ఆయన మొట్టమొదటి నవల అని రచయితలు వివరించారు.

రావిశాస్త్రి రచనలు: 1) కథాసాగరం (1955) 2) ఆరుసారా కథలు (1961) 3) రాచకొండ కథలు (1966)

4) ఆరుసారో కథలు (1967) 5) రాజు మహిషి (1968) 6) కలకంఠి (1969) 7) బానిస కథలు (1972) 8) ఋక్కులు (1973), 9) ఆరు చిత్రాలు (1974), 10) రత్తాలు-రాంబాబు (1975), 11) సొమ్ములు పోనాయండి- 12) గోవులోస్తున్నాయి జాగ్రత్త, 13) బంగారం, 14) ఇల్లు, • నాటకం నాటికలు 1) నిజం నాటకం, 2) తిరస్కృతి నాటిక, 3) విషాదం నాటిక.

తన రచనల్లో ఎక్కువగా పీడిత వర్గాల వారికి సముచిత స్థానం ఇచ్చి వారి సమస్యలను, బాధలను తన రచనల్లో చిత్రీకరించాడు. రావిశాస్త్రి శైలి చాలా ప్రత్యేకమైనది. ఎవ్వరూ అనుసరించలేని విశిష్టత కలిగినది. అది అనితర సాధ్యం. అతని కథ, కథనం చాలా పదునైనవి. జన బహుళత్వం లోకి దూసుకెళ్ళే తత్వం కలిగినవి. న్యాయవాదైన రావిశాస్త్రి సాహిత్యంలోనూ అదే బాటను కొనసాగించాడు. ధనికులు, భూస్వాముల అన్యాయాలకూ, దౌర్జన్యాలకు గూర్చి చిత్రహింసలు పడే దీన, హీన, బడుగు వర్గ ప్రజల తరుపున వకాల్తా పుచ్చుకొని తన వారి సాంఘిక న్యాయం కోసం రచనలు చేసాడు.

రావిశాస్త్రి సమాజంలోని పేద, నిమ్న బడుగు జనుల ఆక్రందనలను, దు:ఖాన్ని పాఠకుల గుండెలకు సూటిగా నాటుకునేలా తన రచనలు సాగించి వారిపై సమాజంపై మొత్తం సానుభూతి కురిపించేలా చేసిన గొప్ప రచయిత, మానవతామూర్తి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిల మాండలికంలో అట్టడుగు ప్రజల వాడుక భాషలో పాఠకులకు హత్తుకుపోయే రీతిలో పదునైన గొప్ప రచనలు చేసాడు. వాటిలో అతి ముఖ్యమైనవి కథా సాగరం (1955), ఆరుసారా కథలు (1961), ఆరు సారో కథలు (1967), రాజ మహిషి (1968), కలకంఠ (1969), బానిస కథలు (1972), ఋక్కులు (1973), ఆరు చిత్రాలు (1974), రత్తాలు ` రాంబాబు (1975), సొమ్ములు పోనాయండి, గోవులొస్తున్నాయి జాగ్రత్త బంగారం, ఇల్లు మొదలైన వాటిని చెప్పుకోవచ్చు. దీన్ని ఆయన 1952లో వ్రాసారు. ఆ తరువాత రాజు మహిషి, రత్తాలు ` రాంబాబు అనే రెండు అసంపూర్తి నవలల్ని వ్రాసారు. ఇక చరమాంకంలో అతను ఇల్లు అనే నవలని కూడా వ్రాసినా అతని నవలల్లో అత్యంత గొప్పదైనదిగా విమర్శకుల ప్రశంసలు అందు కున్నదే కాకుండా అత్యంత ప్రజాదరణ కూడా పొందిన నవల కూడా అల్పజీవే.

అప్పట్లో ఆంధ్రలో మధ్యపాన నిషేధం చట్టం వల్ల సమాజంలో జరిగిన పరిణామాలను చిత్రిస్తూ అయన రాసిన ఆరు సారా కథలు తెలుగు సాహితీ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపి ఎంతో మంది విమర్శకుల్ని ఆలోచింపచేసాయి. ఆంగ్లంలో ప్రపంచాన్ని కుదిపి ఆలోచించిన వాడు మహానుభావుడు గ్రీషమ్. ఇద్దరూ ఓ సారి కలిస్తే ఎంత బాగుండేది?

*

మాడభూషి శ్రీధర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు