1
గలవా?
చెమ్మచాపపై
ఉప్పుటికల నెమరేసుకుంటూ
జోకొట్టుకునే కళ్ళబొమలు
నిదరోతాయా?
దూదితాకిడి నూగు రేగిన
నెమ్మది కంపనచడి
నేలవేరు గిలిగింత కదా!
కొరతమొగిలు కనుచూపు
అరకౌగిలి నవ్వు
అతనపు ఆవులింతచిటికెల
కంచెల మట్టుబద్ధకం
దవ్వుతొవ్వల కాలికొలతబద్ద
ఇంకని కడలొడ్డు పీతసున్నా
లోపాము పాకని ఒళ్ళు
చేగర్రసాయం చేదనినుయ్యి
తెరు……..
తెరువెరగని
వెలగని ఒత్తుకంటిపుసి నులుముతూ
నల్లని పొగరునీ….
నీలో వగరునీ…..
*
2
వొక నెలపొడుపు
తలంతా పల్చని తెల్లటిబట్ట
పరుచుకుని వుంటుంది
నెల వొక మిండగాడు
అరుదు అద్దం
నాలుక ముందుంచి
నరాలకి గొట్టం గుచ్చుతాడు
అల్లకల్లోలకడలి మెదటి
మెత్తళ్ళ ఇగురుకూర వీడు
వొంటి జుట్టుకీ
ఎదసడినిత్తమల్లి
జతచేసే కూడికలంకె
మత్తువేళ్ళ జారుతీగ
దూదిదోసమజ్జిగ చిలికే
కుంటెనకాడు
పిడికిలి విడి నింగి చూపేవేలి
తలపుల దుబ్బల వెతికే
మయపేలు వీడని
నే చెప్పాలా…..
*
చిత్రం: సృజన్ రాజ్
Excellent
ఎంత బావుందో రారెడ్డి గారు. చాలా నచ్చింది