చెట్టుకు దంతాలు మొలిచాక
వాన పళ్ళు తోమింది
పున్నమి వలలో
చీకటి చేప ఎగిరెగిరి పడింది
నిద్ర వీధిలో
కలల గూర్ఖా తిరుగుతూనే ఉన్నాడు
హఠాత్తుగా కుక్కలు ఏడ్చాక
నడిరేయి మూత్ర విసర్జన చేసుకుంది
రాలిన పూలకాంతిని చూడలేక
దేవుడు కళ్ళు మూసుకున్నాడు
పిల్లికి రేచీకటి వచ్చాక
మూషికాలు తోకలమీద నడిచాయి
ఉన్మాదగాలి చెట్టును చంపి
పత్తా లేకుండా పోయింది
పూలందంకన్నా
సీతాకోక మనసు బరువెక్కువ
వాన మొక్కలకు
వడ్లగింజలు కాచాయి
నది ఆకలిని
చేపలు ఎన్నడూ అడగలేదు
చీకటి మడతల్ని దీపం
సాపు చేయలేకపోయింది
వాన నిద్రను
తూనీగ తోకతో లేపింది
*
Add comment