యూఫోరియా!!

ల నుండి కలలోకి

పరుగులు తీస్తున్నాయి

రెండు అలుపులేని నయనాలు!

***

అబద్దపు ప్రమాణాలపై నిలుపుకున్న

ప్రేమల ఆకాశాలకన్నా

రెప్పల్లో చీకటి అలుముకోగానే

వసంతంలా అలా వచ్చి

ఇలా వెళ్ళిపోయే ఈ కలే బాగుంది

***

నమ్మకాలకు మరణశిక్ష అమలై

రాతిప్రతిమలా మిగలడంకన్నా

అస్పష్ట భావాలకు రూపమిస్తూ

వెలుగురేఖలరాకతో రివ్వున పారిపోయే

అలలా వొచ్చే అల్లరికలే బాగుంది

***

అపనమ్మకాల గూళ్శను అల్లుకుంటూ

మాటలన్నీ మౌనమైన నిశ్చల అపరచిత కాలంకన్నా

రాత్రి చూసిన రంగులన్నీ

కనురెప్ప చివర తడిగా ఉదయాన్నే తిరిగొచ్చినా సరే

ఆత్మ దేహాన్ని తాకే ఆ లిప్తకాలమే బాగుంది.

***

జీవితపు చివరి అడుగు గాలిలో పడగానే

భారరహితం-భావరహితం

ప్రాణమే కరిగిపోతోందో? కలగా మిగిలిపోతోందో?

*

 

 2

అమ్మతనం అరువిస్తా!

 

వేట తీవ్రమయ్యింది

మానాల వేట

ప్రాణాల వేట

పురుషాకృతుల్లో

మదపు వాసన

మతపు వాసన

ఆడపిల్లల్ని అలుముకుంటున్న

కమురువాసన

 

 

మాంసం ముట్టని

మూర్తులు కొన్ని

లేత మాంసాన్ని ఛిద్రం చేసి

ప్రాణాలు ఆరగిస్తున్నాయి

దారి చూపుతానని

దారి తప్పిస్తున్నాయి

 

అసహనాలిప్పుడు

పదునుతేలిన కామాంగాలు

కారణం లేని తెగ్గోతలు వాటిపని

తొలిగా నేర్చిన అమ్మపదం

ఆఖరు చెయ్యడం

అవి

పసివాళ్ళతో ఆడే ఆట

 

 

కామాంధుల్లారా!

అమ్మతనాన్ని

ఒక్కసారి మీకిస్తా

కన్నప్రేగు వెక్కిళ్ళేమిటో

వినండి

బిడ్డల్ని కనండ్రా!

పసిపువ్వులు నలిగే బాధ

మీ మగతనాన్ని ఎప్పటికీ

చంపేస్తుంది

 

అమ్మలూ మీరు జాగ్రత్త!

మగవాళ్ళందరికీ

ఇనుపకచ్ఛడాలు

వేసి మగతనాల్ని మూసేసే వరకు!

మీ గర్భాల్లో

ఆడ పువ్వుల్ని మళ్ళీ

దాచేసుకోండి!

ఆ లేతకాళ్ళు రెండుగా చీలి

విరగక ముందే!!

 

పెయింటింగ్: సత్యా బిరుదరాజు 

ఝాన్సీ పాపుదేశి

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రెండో కవితలో మీ ఆవేదన…. ఆగ్రహం అక్షర సత్యాలు.

  • రెండు భిన్నమైన కవితలు. ఒకటి పూవుతో కొట్టినట్లు, మరొకటి గొడ్డలితో మోదినట్లు! భిన్న భావోద్వేగాల ప్రపంచాలలో ఏకకాలంలో బతకటం ఒక్క నిజమైన కవికే సాధ్యం. బాగా రాశారు ఝాన్సీ!

  • మాటల్లేవు అక్షరాలు ఆవేదనను కక్కుతుంటే వేదన ఇక

  • Both are written very well expressing different emotions. Yes Afsarji you are right.

  • మీ కవిత లో ఆవేదన ఈ సమాజాన్ని ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి 🙏

    చాల బాగా రాశారు ఝాన్సి గారు👍

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు