నా హస్తరేఖలు ఇప్పుడొక ట్విట్టర్ థ్రెడ్
ప్రతి గీత ఒక శాపం ఎమోజీ
రీట్వీట్‌లలో వాటికి రెక్కలు మొలుస్తున్నాయి
గుండె బద్దలైన చిత్రం ఇప్పుడొక ఒక ఎక్స్ రే ఫిల్టర్
ఒక పాత జ్ఞాపకం డిలీట్ అయిన దృశ్యం
ఒక స్ప్లిట్ సెకనులో
బాంబు శబ్దం అంతే బీజీయం మారింది
ఎల్విష్ ఏఐ అనేది ఒక డ్రాగన్ ఫ్రూట్ తెలుసా
గర్భం అంటే ఇప్పుడు హార్డ్ డ్రైవ్
చూడు చూడు
DNA స్క్రిప్ట్ అప్లోడవుతుంది.
అది ఎవరికోసమో?
హే సిరి
“శత్రువు ఎవరు? యుద్ధం ఏంటి ” అని పిల్లల ప్రశ్న సమాధానం చెబుతుందా సిరి?
లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ల మధ్య
చరిత్ర ఇప్పుడొక ఫిల్టర్లు వేయబడుతున్న
జ్ఞాపకం
యుద్ధం ముగిసిందని ఆయుధాలు అమ్మే వాడే
ట్వీట్ చేస్తాడు
సినిమాకి ఎండ్‌క్రెడిట్స్ వేస్తున్నట్టు
యుద్ధ సినిమా ముగిస్తే జనాలు ఛాతి
పెద్దది చేసుకుని ఊగిపోతున్నారు
యుద్ధం వాళ్ళకొక స్టేటస్ పోస్ట్
మా నేలపై ఇంకా శవయాత్ర కొనసాగుతుంది
గూగుల్ ఎర్త్ తవ్వకాల్లో కొందరి రాతలకు
హ్యాష్‌ట్యాగ్: #తాజా_నొప్పి
అదో అక్కడ ఒక శిశువు చిరునవ్వు
ఒక బ్లర్ అయిన ఫోటో
కింద శాడ్ ఎమోజీల వర్షం
ఈ రోజు నా హస్తరేఖలో
ఒక పసుపు సీతాకోకచిలుక ఒక రెక్కలు విప్పింది.
అడవుల్లో యుద్ధబాట పట్టిన సీతాకోక చిలుకను
వెంటాడిన దృశ్యాల ఫోటోలవి
దాని రెక్కలపై టాటూ:
‘నా వేదన ఒక జిఫ్ ఫైల్ కాదు విప్లవం జెపెగ్ ఫార్మాట్ కాదు”
తెలుసా
ఈ ప్రపంచం ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ స్క్రీన్
దీని గమనం
కాల్చిన గాజులో బద్దలైన కలల ముక్కల కోసం
లేదా స్వైప్ చేస్తూ చేస్తూ పోయే
స్వప్నాల టిండర్ ప్రొఫైల్ జాడల కోసం
హేయ్ ఇప్పుడే ఒక శాంపిల్ మ్యాచ్ దొరికింది
ఒక పాత ఫీనిక్స్ ఎమోజీ.
డిజిటల్ పునర్జన్మలో దాని రెక్కలు మళ్లీ విచ్చుకుంటున్నాయి
ఇంక రాసుకోండి ట్విట్టర్ యాక్టివిజం.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
నా వేదన ఒక జిఫ్ ఫైల్ కాదు విప్లవం జెపెగ్ ఫార్మాట్ కాదు”
Excellent